World 1st Malaria-Vaccine For-Children:మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్

World 1st Malaria-Vaccine For-Children

World 1st Malaria-Vaccine For-Children,

iRAYSMEDIA

World 1st Malaria-Vaccine For-Children: మలేరియా (Malaria) ఎప్పటినుంచో పట్టి పీడుస్తున్న మహమ్మారి ఇప్పటికే చాల మందిని బలికోండి .. అయితే ఇక నుండి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు .. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) మొదటి సారిగా పిల్లల కోసం మలేరియా వ్యాక్సిన్ సిఫార్సు చేసింది.

WHO దీనిపై అధికారికంగా ప్రకటన కూడా చేసారు . దోమల కారణంగా మలేరియా విస్తరిస్తోంది అని మనందరికీ తేలిన విషయమే . మలేరియా బారిన పడి ప్రతి సంవత్సరం వందల మందిని ప్రాణాలు తీస్తుంది . ప్రతి రెండు నిమిషాలకు ఒక పిల్లవాడు మలేరియాతో మరణిస్తున్నట్లు WHO తెలియ జేసింది . పిల్లల మరణాలను తగ్గించడానికి ఈ మలేరియా అధిక వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో WTS RTS మలేరియా వ్యాక్సిన్‌ను సిఫార్సు చేసింది WHO. 2025 నాటికి ప్రపంచం నుంచి మలేరియాను సమూలంగా నిర్మూలించడమే who లక్ష్యం అని తెలిపింది . అందుకోసం వారు తీవ్రంగా పని చేస్తున్నారు.

25 దేశాలలో మలేరియా నిర్మూలన కార్యక్రమం కూడా ప్రారంభించారు.అయితే WHO ఉప-సహారా ఆఫ్రికాలో ఉన్న పిల్లలలో మలేరియా వ్యాక్సిన్‌ను విస్తృతంగా ఉపయోగించాలని నిర్ణయించింది. అయితే మలేరియా వ్యాప్తి ఆఫ్రికన్ దేశాలలో ఎక్కువగా ఉంది. మలేరియాతో ప్రతి సంవత్సరం ఆఫ్రిక లో దాదాపు 260,000 పిల్లలు మరణిస్తున్నారు.

RTS, S / AS01 గా మలేరియా వ్యాక్సిన్‌ టీకా శాస్త్రీయ నామకరణం చేసారు . రెండు అతిపెద్ద సలహా సంస్థల ఆధారంగా ఈ శాస్రియ నామాన్ని సిఫార్సు చేసింది. 5 నెలల పైబడిన పిల్లలకు ఈ టీకాను ఇవ్వొచ్చని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ స్పష్టం చేసింది. పిల్లలకు మొత్తం నాలుగు మోతాదులు ఉంటాయి. 2.3 మిలియన్ డోసుల టీకాలని మూడు ఆఫ్రికన్ దేశాలలో ఇచ్చారు. ఈ టీకా పూర్తిగా సురక్షితం అని నిరూపించారు.

READ MORE:

CM-KCR Good-News To Singareni-Employees:సింగరేణి కార్మికులకు 29 శాతం బోనస్‌

Hero-Ajith Fan Suicide Attempt:హీరో అజిత్ మహిళా అభిమాని ఆత్మహత్య ప్రయత్నం

Previous Post
Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి
Next Post
Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
Bathukamma Sarees Distribution : బతుకమ్మ చీరల లొల్లి
Vizag Minor Girl Case:వైజాగ్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Recent Posts

Menu