మహిళకు రక్షణ ఎక్కడ? ఆఫ్ఘన్ పోలీసు మహిళకు ఎదురైన లైంగిక వేధింపులు

మహిళకు రక్షణ ఎక్కడ?

మహిళకు రక్షణ ఎక్కడ? ఆఫ్ఘన్ పోలీసు మహిళకు ఎదురైన లైంగిక వేధింపులు!

ప్రపంచం అన్ని రంగాలలోనూ ముందుకు సాగుతోంది. ఇది సర్వత్రా వినిపించే మాట. కానీ మనలో సగం అని, అన్నిటిలోనూ సమానమనీ, సమానావకాశాలు అంటూ ఊదరగొడుతున్న పురుషాధిక్య ప్రపంచం తీరు మాత్రం ఏ మాత్రం మారలేదు. మారదు అని అనాలేమో!

అది ఒక చిన్న దేశం. చరిత్రలో అది ఛాందసవాదానికి కేంద్రం. దాని పేరు ఆఫ్ఘనిస్తాన్. ఇటీవల ప్రపంచ దేశాలతో సమానంగా అక్కడ కూడా మహిళలకు అవకాశాలు మెరుగుపడ్డాయి. ఉన్నత పదవులు లభిస్తున్నాయి. కానీ అక్కడా మహిళల పట్ల పురుష సమాజం ప్రవర్తన మాత్రం ఏమీ మారలేదు. అందుకే ఆఫ్ఘన్ పోలీసు దళంలో పనిచేస్తున్న ఒక మహిళ తనకు ఎదురైన లైంగిక వేధింపులు, అత్యాచారాలను గురించి గొంతెత్తి ప్రపంచానికి వినిపించింది. ఆమె ఆక్రందన వినిని అమెరికా, యూరోపియన్ యూనియన్ ప్రభుత్వాలు ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని అక్కడి పాలకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఆఫ్ఘన్ న్యాయ స్థానం చాలా సాధారణమైన అంశంగా ఈ ఆరోపణల్లో నిజం లేదని కొట్టి పారేసింది. అంతేకాదు. ఆరోపణలు చేసిన బాధితురాలిని ఎక్కడైనా పడి చావు అని ఉచిత సలహా కూడా పడేసింది.

బిబిసి ఈ ఘోరం గురించి దర్యాప్తు చేసి కొన్ని వివరాలు సంపాదించింది. ఆఫ్ఘన్ పోలీసు దళాలలో పనిచేసే మహిళపై ఉన్నతోద్యోగులు లైంగిక నేరాలకు పాల్పడుతున్నారని, వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారని వెల్లడించింది. చాలా మంది మహిళలతో మాట్లాడిన తరువాతే బిబిసి వార్తాకథనం వెలుగులోకి తెచ్చింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రం చాలా అమాయకంగా ముఖం పెట్టి తాము సంస్కరణల దిశగా దేశాన్ని నడిపిస్తున్నామని జవాబు ఇచ్చింది. కానీ అక్కడి హక్కుల సంఘాలు మాత్రం ఇలాంటి ఘోరాలకు పాల్పడిన వారిని శిక్షించిన సందర్భాలు చాలా స్వల్పమని అభిప్రాయపడుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ పోలీసు దళాలలోనికి మహిళల ఎంపిక ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం 3900 మంది వివిధ స్థాయిల్లో పోలీసు దళంలో పనిచేస్తున్నారు.  వారిలో చాలా మంది ఏదో రూపంలో పురుషుల వేధింపులకు గురైనవారే. ఎక్కడైనా ఆరోపణలు వస్తే వాటిపై దర్యాప్తు జరపడంలో కూడా వివక్ష స్పష్టంగా కనిపించిందని బిబిసి కథనం తెలిపింది. కొన్ని సందర్భాలలో ఆరోపణలు లేవనెత్తిన మహిళలు అత్యాచారాలకే గురయ్యారు. మరి కొందరు రక్షణ కోసం ఇతర మార్గాలు ఎన్నుకోవలసి వచ్చింది.

ఈ సందర్భంలో మొమేనా కర్బాలయీ అనుభవాలు భయంకరమైనవి. ఆమె పోలీసు దళంలో పనిచేస్తున్నారు. ఒక రోజు పై అధికారి ఆమెను పిలిచి, ఆ రాత్రి ఇతర పోలీసు అధికారులకు పడక సుఖం ఇవ్వాలని హుకుం జారిచేశాడు. ఆమె నిరాకరించింది. అయినా ఆ అధికారి ఆమెపై అత్యాచారం చేశాడు.  ఆపై కోర్టును ఆశ్రయించింది. ఆరోపణలను కోర్టు కొట్టిపారేసింది. నేరం నిర్ధారణ కాలేదని తేల్చింది. అవమానంతో ఆమె మార్చి 2020లో బహిరంగంగా ఒక రోడ్డు కూడలిలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది. అయితే చుట్టూ ఉన్న వారు ఆమెను అడ్డుకున్నారు. తన చావులో అయినా ఇతర మహిళల వేదనలను పాలకులు గుర్తిస్తారని తాను ఆశించినట్లు ఆమె ఆ జనం మధ్యలోనే గోడుగోడున ఏడుస్తూ ప్రకటించారు. ఇప్పటికీ ఆమె పోలీసు దళంలోనే పనిచేస్తున్నప్పటికీ అనేక శాఖలను తిరగాల్సి వచ్చింది. నోరు విప్పిన మహిళలకు న్యాయం చేయాలని, వారికి తగిన రక్షణ కల్పించాలని ఆమె కోరుతున్నారు. ఇదివరలో ఇంటీరియర్ మంత్రిత్వ శాఖలో డిప్యూటీ మంత్రిగా పనిచేసిన హొస్నా జలీల్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అయితే ఆ తరువాత ఆమె మంత్రి పదవి ఊడిపోయింది.

Know more about the importance of a double mask.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
Shikhar Dhawan as captain .. Rahul Dravid as head coach!
Next Post
Selling land is the only solution
Shikhar Dhawan as captain .. Rahul Dravid as head coach!
Selling land is the only solution

Recent Posts

Menu