వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి

వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం

వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : iRAYSMEDIA-HYDERABAD

వరంగల్ జిల్లా నర్సపేట బిట్స్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసింది.

వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం

లక్నేపల్లి శివారు బిట్స్ కళాశాలలో నిన్న రాత్రి శుక్రవారం రోజు రెండు వర్గాలలో ఉన్న నలుగురు విద్యార్థుల మధ్య గొడవ ప్రారంభం అయింది. ఈ గొడవ కాస్త ముదిరి పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న సంజయ్ ని మరో విద్యార్థి కళాశాల భవనంలోని రెండో ఫ్లోర్ పై నుండి తోసేశారు. ఈ క్రమంలో సంజయ్ పై నుండి కిందపడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. గాయాలతో ఉన్న సంజయ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సంజయ్ మృతి చెందాడు. సంజయ్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీిలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంజయ్ కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని అందించడంతో కుటుంబ సభ్యులు, బందువులు ఆందోళన చేపట్టారు. సంజయ్ మృతికి కాలేజ్ యాజమాన్యమే కారణమంటూ ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యి వరంగల్ ప్రధాన రహదారి వద్ద ధర్నాకు కూర్చున్నారు.

 

ఇవి కూడా చదవండి:

Telangana government has directed: వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల ప్రదర్శన పేర్లు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు | The Telangana government has directed to change the name and display of Warangal Urban and Rural districts

Another atrocity in Hyderabad:హైదరాబాద్ లో మరో దారుణం ..20 ఏళ్ల యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు | Another atrocity in Hyderabad..20 Year young woman raped by car driver

Previous Post
Inter First Year Exams 2021 Schedule Released : త్వరలోనే ఇంటర్ పరీక్షలు
Next Post
సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు
Inter First Year Exams 2021 Schedule Released : త్వరలోనే ఇంటర్ పరీక్షలు
సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు

Recent Posts

Menu