TSRTC Sajjanar Mark: ఆర్టీసీకి 8 రోజుల్లో 8కోట్ల ఆదాయం

TSRTC Sajjanar Mark

TSRTC Sajjanar Mark

iRAYSMEDIA

TSRTC Sajjanar Mark: నష్టాల్లో ఉన్న తెలంగాణ RTC కి ఈ ఏడాది దసరా పండుగ కాసుల వర్షం కురిపించింది అని చెప్పాలి.

దసరా ఫెస్టివల్ సీజన్లో ఈనెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ 8కోట్ల రూపాయల ఆదాయం ఆర్టీసీకి వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. పండగ 8 రోజుల్లో మొత్తం 8కోట్ల 54లక్షల రూపాయల ఆదాయం TSRTCకి వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే 4 నుంచి 5 కోట్ల ఆదాయం టార్గెట్‌ పెట్టుకున్న ఆర్టీసీ అధికారులకు అదనంగా 3కోట్ల రూపాయల ఆదాయం రావడంతో సంతోష వ్యక్తం చేస్తున్నారు.

కోవిడ్‌- 19 కష్టాల బారి నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్న తెలంగాణ ఆర్టీసీకి ఈ దసరా ఆదాయం కొంతమేరకు ఉపశమనం కల్పించిందని చెప్పవచ్చు. ఇక పండుగకు ఐదు రోజుల ముందే స్పెషల్‌ బస్సులు పెట్టిన వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయకపోవడం, అటు కేవలం పది రోజుల్లోనే 2కోట్లకుపైగా మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చడంతో TSRTC సరికొత్త రికార్డు సృష్టించింది. ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్‌ , సమస్యలను పరిష్కరిస్తూ, ఆర్టీసీని లాభాల బాటలో తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

READ MORE:

Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్

Dalit Bandhu Scheme:Telangana-GOVT Ready to Spend 250cr

Previous Post
Huzurabad By-Election:ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర
Next Post
Bill Gates Daughter Wedding:అంగరంగవైభవంగా బిల్ గేట్స్ కూతురు పెళ్లి
Huzurabad By-Election:ఈటల రాజేందర్ దిష్టి బొమ్మ శవయాత్ర
Bill Gates Daughter Wedding:అంగరంగవైభవంగా బిల్ గేట్స్ కూతురు పెళ్లి

Recent Posts

Menu