TRS Plenary Meeting 2021:ప్లీనరీ సభలో జాడలేని హరీశ్ రావు,కవిత

TRS Plenary Meeting 2021

TRS Plenary Meeting 2021

iRAYSMEDIA

TRS Plenary Meeting 2021:టీఆర్ఎస్ 20 వార్షికోత్సవ సభ అంగరంగ వైభవంగా జరిగింది.తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి ముఖ్య నాయకులు,పార్టీ శ్రేణులు తెరాస ప్లీనరీ సభకు తరలి వచ్చారు. ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులైయ్యారు

టీఆర్ఎస్ అధినేత CM KCR తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ ఆశ్యక్యత, సాధించిన విజయాలను కొనియాడారు. ముందు ముందుజరగబోయే ప్రణాళికల గురించి తెలియజెప్పారు సీఎం కెసిఆర్ . ఇంత పెద్ద తెరాస ప్లీనరీ వేదికపై ఎందరో నాయకులు కూర్చున్నా.. కేసీఆర్ తో పాటు కేటీఆర్ ప్రసంగాలు కూడా హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి . మిగతా నాయకులు సైతం వారి ప్రాంతాల అభివృద్ధి గురించి చెప్పారు. అయితే టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఉద్యమ కారుడు హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత ఈ ప్లీనరీ సభలో కనిపించలేదు. హరీశ్ రావుకు ఆహ్వానం అందకపోగా.. కవితకు ఆహ్వానం ఉన్నా.. సభకు హాజరు కాలేదు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా హరీశ్ రావుకి సీఎం కెసిఆర్ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను డిస్ట్రబ్ చేయడం ఎందుకని ప్లీనరీ సభకు ఆహ్వనం పంపలేదని పార్టీ నాయకులు అంటున్నారు. అయితే పార్టీ ఆవిర్భాం నుంచి ఉద్యమ కారుడిగా, పార్టీ నాయకుడిగా కీలకంగా ఉన్న హరీశ్ రావు ఈ సభలో లేకపోవడం వెలితిగానే ఉందని ఆయన అభిమానులు అంటున్నారు. కానీ మరి కొందరు మాత్రం హరీశ్ కు ఆహ్వానం అందకపోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

ఇక టీఆర్ఎస్ లో మరో కీలకనేత అయినా ఎమ్మెల్సీ కవితక ఆహ్వానం అందింది. కానీ ఆమె హైదరాబాద్లోనే ఉన్నా సభకు హాజరు కాలేదు. బతుకమ్మ సంబరాల సందర్భంగా దుబాయ్ వెళ్లి రావడంతో జ్వరం ఉందని, అందుకే రాలేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. హుజూరాబాద్ లో ప్రచారం చేసిన కవిత ప్లీనరీ సభకు హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. కానీ కేటీఆర్ తో ఉన్న మనస్పర్థల కారణంగానే ఆమె సభకు హాజరు కాలేదని కొందరు అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ నిర్వహించే సభకు కవిత హాజరు కావడం లేదు. పార్టీలో కీలకంగా ఉన్నా అన్నతో అంతర్గతంగా కలహాలు ఉన్నాయని గుసగుసలాడుతున్నారు.

సోమవారం జరిగిన తెరాస ప్లీనరీ సభ అంతా కేసీఆర్, కేటీఆర్ మాత్రమే న్నట్లుగానే సాగింది. కానీ తెరాస పార్టీ ఆవిర్భావంలో, పార్టీ అభివృద్ధిలో హరీశ్ రావు లాంటి ముఖ్య నేతలు కూడా ఉన్నారు. కానీ వారికి ఆహ్వనం పంపకపోవడంపై రకరకాలుగా చర్చ సాగుతోంది.

READ MORE:

TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు

CM-KCR Plenary Meeting Today:మార్చి నెల వరకు అన్ని నియోజక వర్గాల వారికి దళిత బంధు

Previous Post
Teenmar-Mallanna Sent-to 14-days Custody:తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Next Post
4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు
Teenmar-Mallanna Sent-to 14-days Custody:తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్
4-Year-Old Salutes CISF At-Bengaluru:బెంగుళూరు ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ పై నెటిజన్ల ప్రశంశలు

Recent Posts

Menu