TRS Plenary Food Menu:తెరాస ప్లీనరీ మీటింగ్లో 34 రకాల భోజన పదార్థాలు

TRS Plenary Food Menu

TRS Plenary Food Menu

iRAYSMEDIA

TRS Plenary Food Menu:హైదరాబాద్ మహా నగరం (తెరాస)గులాబీ జెండా ద్వి దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజవకర్గమైన శేరి లింగంపల్లి పరిధిలోని (మాదాపూర్‌) హైటెక్స్‌ ఇందుకు వేదికైంది.

హైటెక్స్‌ ప్రాంగణం సహా పరిసర ప్రాంతాలు అన్ని ఇప్పటికే, గులాబీ అలంకరణలతో గులాబీమయమయ్యాయి. ఈ నెల 25న ఇక్కడి హైటెక్స్‌ ప్రాంగణంలో జరగనున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ప్లీనరీ సమావేశానికి 15 నుంచి 20 వేల వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో షడ్రసోపేతమైన భోజనాలను అందించేందుకు సంబంధిత కమిటీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. భోజన వసతి ఏర్పాట్లను కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అప్పగించిన నేపథ్యంలో ఈ బాధ్యతలను ఆయ న హైటెక్స్‌లో ఉండి పర్యవేక్షణ చేపడుతున్నారు.

మొత్తం 34 రకాల భోజన పదార్థాలను ప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు వడ్డించనున్నారు. శాఖాహారంతో పాటు మాంసాహార భోజనాలను రుచికరంగా ఆహూతులకు వడ్డించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. కాగా, ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించేందుకు హైటెక్స్‌కు చేరుకున్న మంత్రి కేటీఆర్‌. ప్లీనరీ లో వడ్డించే భోజన పదార్థాల జాబితాను పరిశీలించి నగరంలో నివసించే అన్ని ప్రాంతాలకు చెందిన వారి భోజన పదార్థాలు ఉండేలా చూడాలన్నారు. ktr ఎమ్మెల్యే కృష్ణారావు కు రాయలసీమ ప్రాంత ప్రజలు అంతో అమితంగా ఇష్టపడే రాగి సంకటిని తెరాస ప్లీనరీ పదార్థాల జాబితాలో చేర్చాలనిసూచించారు. దీంతో శనివారం రాగి సంకటి పదార్థం సైతం తెరాస ప్లీనరీ జాబితాలోకెక్కింది.

 

TRS Plenary Food Menu

ఇప్పటి వరకు ఏ ప్లీనరీలోనూ ఛాయ్‌ ప్రస్తావన లేకపోవడం , ఈ సారి ప్లీనరీలో మాత్రం తెలంగాణ ఇరానీ ఛాయ్‌ పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా అందబోతున్నది. ఈ ప్రత్యేక ఛాయ్‌ ను 20 వేల మందికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మె ల్యే కృష్ణారావు పేర్కొన్నారు. మొత్తం మీద భోజన పదార్థాల జాబితాలో మొత్తం 32 పదార్థాలుండగా, అందులో మాంసాహారానికి చెందిన 10 ఐటె మ్స్‌ ఉండగా, మిగిలినవి శాఖాహారానికి చెందినవి కావటం విశేషం.

trs plenary food menu

మిఠాయిలు

మూడు ప్రత్యేక మిఠాయిలు ఇందులో వడ్డించబోతున్నారు. హైటెక్స్‌ ప్రాంగణంలోని అయిదు ప్రత్యేక షెడ్లలో ఒక్కసారికి 8 వేల మంది భోజనం పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసామన్నారు. తద్వారా ప్లీనరీ కేవలం విజయోత్సవాలను పునస్సమీక్షించుకోవటం, ప్రత్యేక భోజనాల ద్వారా పార్టీ శ్రేణులకు ఆతిథ్యమివ్వబోతున్నది.

trs plenary food menu

 

READ MORE:

KCR to Huzurabad Today: కేసీఆర్ ఈరోజు హుజూరాబాద్ లో దళిత బంధును ప్రారంభిస్తారు | KCR to Huzurabad today. CM will start Dalita Bandhu

Average of 50 kg of food is wasted by an Indian!

Previous Post
Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్
Next Post
India VS Pakistan T20 :భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రామ్ గోపాల్ వర్మ కీలక ట్వీట్
Huzurabad By Election Latest_Update:తెలంగాణ DGP Mahender Reddy ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్
India VS Pakistan T20 :భారత్ – పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై రామ్ గోపాల్ వర్మ కీలక ట్వీట్

Recent Posts

Menu