తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు

తెలంగాణ ప్రజలను రక్షించడానికి

తెలంగాణ ప్రజలను రక్షించడానికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముందుకు వచ్చారు:

తెలంగాణ ప్రజలను రక్షించడానికి గాంధీభవన్ లో మూడు అంబులెన్స్ లు ఏర్పాటు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి ..

గాంధీ భవన్ లో మూడు అంబులెన్స్ లు ప్రారంభించిన పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య…

గాంధీ భవన్ హెల్ప్ డెస్క్ 040-24601254 కి కాల్ చేసిన వారికి ఉచిత అంబులెన్స్ సేవలు …

గాంధీ భవన్ నుండి …

మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారి కామెంట్స్…

ఇంతటి దురదృష్టకరమైన పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో కాని చూస్తామని అనుకోలేదు ..

మోడీ,కేసీఆర్..కరోనా కట్టడిలో విఫలమయ్యారు ..

మోడీ రాష్ట్రాల మీద బాధ్యత వదిలి చేతులు దులుపుకున్నారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కరోనా సెకండ్ వేవ్ విషయంలో ముందు చూపు లేదు ..

గ్రామాల్లో అసలు టెస్ట్ లు చేయడం లేదు..

లాక్ డౌన్ పెట్టం అని.. హై కోర్టు చివాట్లు పెట్టగానే..ఆగమేఘాలపై మంత్రి మండలి సమావేశం అయ్యి..లాక్ డౌన్ పెట్టారు ..

తినడానికి తిండి లేక..నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ..

హైదరాబాద్ చుట్టుపక్కల 370 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయని మీకు తెలుసా…?

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన కనీస బాధ్యతని ప్రధాన మంత్రి మోడీ సీఎం కేసీఆర్ గాలికొదిలేశారు..

ప్రజల ప్రాణాలు ముఖ్యమని గుర్తించని నాయకత్వం దేనికి అని ప్రశ్నించారు..

రాహుల్ గాంధీ సోనియా గాంధీ 2020 ఫిబ్రవరి నుండి కరోనా వైరస్ పై చేరికలు చేస్తూనే వస్తున్నారు..

కాంగ్రెస్ సలహాల ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు..

మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉందని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు..

ఏ విషయంలో మీరు సమీక్ష చేశారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతారా..

2020 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తే .. 2021 ఏప్రిల్ 11 వరకు టాస్క్ ఫోర్స్ సమావేశం జరగలేదు..

పార్లమెంటరీ కమిటీలు 2020 సెప్టెంబర్ లో ఆక్సిజన్ గురించి ముందుగా హెచ్చరించాయి.. అయినా పట్టించుకోలేదు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ దేశంలో ప్రజల ప్రాణాల కంటే మరొక అంశం లేదు..

ఈ విపత్కర పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఉపాధి హామీ పథకం నూట యాభై శాతం అధికంగా ఉపయోగించుకున్నారు.. ఇలాంటి కార్యక్రమాలను చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది..

39 మంది డాక్టర్లు ఒక న్యాయవాది ఈ ప్రభుత్వానికి సూచనలు చేశారు..

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని మీ ముందు పెడుతున్నాం.. ఖబడ్దార్..

మొదటి డోసు 55 లక్షల మందికి ఇస్తే రెండవ డోసు ఐదు లక్షల మందికి ఇచ్చారు ..మరొక 50 లక్షల దోస్తులు అవసరం ఉన్నాయి అన్న అన్న ఇంగిత జ్ఞానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేకపోవడం శోచనీయం.. ( end of April )

ప్రధానమంత్రి చప్పట్లకు దీపాలకు సౌత్ కొరియా ప్రధానమంత్రి ఎంత ఎగతాళి చేసాడో తెలుసా…

అమెరికా ప్రెసిడెంట్ కు సలహాదారుగా ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో తెలియదా..

మేము ప్రతిపక్షంగా ఆరోపణ కాదు ప్రజల కోసం చెబుతూ ఉన్నాము..

ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటూ సలహాలు తీసుకుంటూ చర్చలు చేస్తూ ప్రజల ముందుకు రావాలని కోరుతున్నాం..

అంతే తప్ప నాకు స్వార్థం లేదు రాజకీయాలు లేవు..

హైదరాబాద్‌లో మాత్రమే ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లు చాలా ఉన్నాయి. వారు పరిశ్రమకు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఎప్పుడూ సమీక్షించలేదు

ఈ ఉపద్రవం కేసీఆర్ తప్పిదం..

అంచనా వేయడంలో, ముందు జాగ్రత్త చర్యలో విఫలం అయ్యారు.

హైకోర్టు చెప్తే తప్ప ఆయుష్మాన్ భారత్ లో చేరలేదు, లక్డౌన్ పెట్టలేదు.

మందులు, టీకాలు, బెడ్స్, ఆక్సిజన్ అన్ని కొరత ఉన్నాయి

సమీక్ష లేదు. అహంకారంగా ప్రవర్తిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు.

ఎంజిఎం వరంగల్‌కు కెసిఆర్ సందర్శన గురించి మరింత తెలుసుకోండి

అలాగే, తెలంగాణలో కోవిడ్ 19 నవీకరణల గురించి మరింత తెలుసుకోండి.
తెలంగాణ కరోనా అత్యవసర సంప్రదింపు సమాచారం:
ఉచిత అంబులెన్స్ కోసం (సైబరాబాద్)
9490617400
9490617431
ఉచిత క్యాబ్ సేవలకు (రాచకొండ)
9490617234

Previous Post
నల్ల బ్యాడ్జీల తో డ్యూటీలకు హాజరవుతున్న జూనియర్ వైద్యులు
Next Post
బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం: MP రేవంత్ రెడ్డి!
నల్ల బ్యాడ్జీల తో డ్యూటీలకు హాజరవుతున్న జూనియర్ వైద్యులు
బొల్లారం ఆసుపత్రి సేవకు సిద్ధం: MP రేవంత్ రెడ్డి!

Recent Posts

Menu