దేశానికి రక్ష కాంగ్రెస్ మాత్రమే! అయితే పూర్వపు శక్తి సంపాదిస్తేనే

దేశానికి రక్ష కాంగ్రెస్ మాత్రమే!

దేశానికి రక్ష కాంగ్రెస్ మాత్రమే! అయితే పూర్వపు శక్తి సంపాదిస్తేనే: కపిల్ సిబ్బాల్!

“కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనంగా ఉంది. అది శక్తివంతం కావాలి. దేశాన్ని కాపాడాలి. అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం.” ఇవి కాంగ్రెస్ పార్టీలో ఇటీవల వ్యతిరేక గళం విప్పిన నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబ్బాల్ మాటలు. క్రమంగా పార్టీ ప్రజాభిమానానికి దూరమవుతున్న వేళ … ముఖ్యంగా సోనియా గాంధీ పార్టీ పగ్గాలను రెండోసారి చేపట్టిన తరువాత … గత కొద్ది సంవత్సరాలుగా పార్టీ నాయకత్వంలో మార్పు రావాలని డిమాండ్ చేసిన 23 మంది కాంగ్రెస్ నాయకులలో కపిల్ ఒకరు. వీరిలో ఒకరైన జితిన్ ప్రసాద ఇటీవల బిజిపి తీర్థం తీసుకున్న విషయం పత్రికలలో ప్రముఖంగానే వచ్చింది. ఈ పరిణామం తరువాత మరోసారి కపిల్ తన వాణి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ పూర్వపు ఔన్నత్యాన్ని సాధించాలని అప్పుడే దేశానికి మేలు జరుగుతుందని ఆయన నాయకత్వానికి సూచించారు. ఇవాళ్లి రోజున దేశంలోని రాజకీయ రంగంలో ఏర్పడిన బలహీనతలకు పరోక్షంగా కాంగ్రెస్ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తన శక్తిని తిరిగి పుంజుకోవడం తక్షణ అవసరమని ఆయన పార్టీ శ్రేణులకు, నాయకత్వానికి గుర్తుచేశారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించగలిగే శక్తి  కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ఆయన గట్టిగా చెబుతున్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఆ రకమైన నమ్మకాన్ని కలిగించలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కార్యశీలతను కూడా ప్రదర్శించలేకపోతోందన్నారు. పార్టీ ప్రజలతో మమేకం కాలేకపోతోంది. వ్యవస్థాపరంగా ఎన్నికలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కొత్త ముఖాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి. వారిలో పార్టీపై తిరిగి పూర్తి విశ్వాసం నెలకొల్పాలి. కేంద్ర స్థాయిలోకూడా మార్పులు చేర్పులు చేపట్టి ఎదురవుతున్న సవాళ్లను తట్టుకుని ప్రజల పక్షాన నిలబడ గల సత్తా తమకు ఉందని నిరూపించుకోవడం అవసరం అని ఆయన హెచ్చరించారు. నిస్సత్తువగా నిలిచిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో రాజకీయాలలో సత్తా గల ప్రతిపక్షం ఉండాలి. ఆ స్థానం ఇప్పుడు చాలా బలహీనంగా ఉంది. ఆ శూన్యాన్ని కాంగ్రెస్  పార్టీ మాత్రమే భర్తీ చేయగలదనే నమ్మకం పార్టీలోని కార్యకర్తలకు, దేశంలో అసంఖ్యాకంగా ఉన్న కాంగ్రెస్ అభిమానులకు కలిగించాలి. ముఖ్యంగా రాజకీయాలలో విస్తృతమైన అనుభవం ఉన్న సీనియర్లకు, కొత్త ఉత్సాహం పరవళ్లు తొక్కుతున్న యువతకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే పార్టీ పూర్వపు శక్తి సామర్థ్యాలను సమకూర్చుకోగలదు.

ఇవాళ్లి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటంటే ఎన్నికలలో ఓటమి సర్వసాధారణమైపోయింది. 2014, 2019 లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతునే ఉంది. ఎక్కడా విజయాన్ని అంందుకోలేకపోయింది. పైగా రాజస్తాన్ లోనూ, పంజాబ్ లోనూ పార్టీలో అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎప్పుడు ఎవరు పార్టీని వీడి పాలకపక్షమైన బీజేపీలో చేరిపోతారో తెలియకుండా పోయింది. అస్సాం, గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలలో పెద్ద పెద్ద నాయకులు పార్టీని విడిచిపెట్టి పాలక పార్టీలోకి చేరిపోయారు. దాంతో ఆయా రాష్ట్రాలలో పార్టీ పెను సంక్షోభాలు ఎదుర్కొంది. రాజస్తాన్ లో తమ పార్టీ నేతల ఫోన్ లనే నాయకత్వం టాప్ చేసి వారి కదలికలపై నిఘా వేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వంపై కొద్ది కాలం క్రితం తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్, ఆయన సహచరులపై ఈ నిఘా తీవ్ర స్థాయిలో ఉంది. ఇక పంజాబ్ లో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కు పక్కలో బల్లెంలా మాజీ క్రికెటర్ – కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు అడుగడుగునా భయపెడుతున్నాడు. ఇటీవల బిజేపిలో చేరిన జితేన్ ప్రసాద విషయంలో కపిల్ సిబ్బాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసారు. గతంలో మొత్తం 23 మంది నేతలు సమష్టిగా అధిష్టానానికి రాసిన లేఖలో ప్రస్తావించిన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని కపిల్ గుర్తుచేశారు. కేంద్ర నాయకత్వం తీరు మారకపోతే పరిణామాలకు వారే బాధ్యులవుతారని కూడా ఆయన హెచ్చరించారు.

Know more about the economic decline not seen over 40 years.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
TPCC chief announcement in a few more hours
Next Post
Rave party under the name of birthday
TPCC chief announcement in a few more hours
Rave party under the name of birthday

Recent Posts

Menu