ప్రకృతి విచిత్రం! 24 వేల ఏండ్ల తరువాత ఊపిరి పోసుకున్న సూక్ష్మ జీవి!

24 వేల ఏండ్ల తరువాత ఊపిరి పోసుకున్న సూక్ష్మ జీవి!

ప్రకృతి విచిత్రం! 24 వేల ఏండ్ల తరువాత ఊపిరి పోసుకున్న సూక్ష్మ జీవి!

నిత్యం ప్రపంచంలో చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కాలగర్భంలో కలిసిపోవలసిన ఒక చిరు ప్రాణం 24000 ఏండ్ల తరువాత ఊపిరి పోసుకోవడం విశేషం కదా ! రష్యాకు ఉత్తరంగా, ఉత్తర ధృవానికి దగ్గరలో ఉండే సైబీరియా హిమ ప్రాంతంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది.

కేవలం తాజా నీటిలో మాత్రమే జీవించే మల్టీ సెల్యూలార్ సూక్ష్మజీవి అది. దానికి ఉన్న అత్యంత విశిష్టమైన లక్షణం ఏమిటంటే ఎంతటి శీతల ప్రదేశంలో అయినా, గడ్డ కట్టించే చలి వాతావరణంలో కూడా అది బతుకగలదు. ఈ ప్రత్యేక లక్షణమే దానిని ఇన్నేండ్ల తరువాత మళ్లీ సజీవంగా ఉనికిలోకి తీసుకువచ్చింది. మరో విచిత్రం ఏమిటంటే అది పరసంపర్కం లేకుండానే మరిన్ని జీవాలకు జన్మనిచ్చింది. ఈ సుదీర్ఘ జీవన పోరాటంలో గడ్డకట్టి పోయి ఉన్న మంచు మధ్య అది 24000 ఏండ్ల పాటు గడ్డకట్టుకుపోయి ఉంది.

రష్యన్ శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ సూక్ష్మజీవి పేరు బెడలాయిడ్ రోటిఫయర్. అత్యంత పురాతన కాలానికి చెందిన దీనిని ధృవ ప్రాంతానికి చేరువలో ఉన్న యకూటియా ప్రాంతంలోని అలజేయా నది లో వారికి లభించింది.  ఇంతవరకు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్లో ఇలాంటి జీవాలు మైనస్ 20 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలో కేవలం 10 సంవత్సరాలు మాత్రమే జీవిస్తుందని గుర్తించారు. అయితే ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన సజీవ సాక్ష్యం చూస్తే గడ్డకట్టుకుపోయిన దశలో జీవి మనుగడ చాలా చాలా ఎక్కువ కాలం సాధ్యమేనని గమనించినట్లు కరెంట్ బయోలజీ అన్న జర్నల్ లో కథనం వచ్చింది. అత్యంత ఎక్కువ కాలం జీవించిన ప్రాణి కూడా ఇదేనని నిర్ధారణ అయింది.

భూగర్భంలో 3.5 మీటర్ల లోతులో సేకరించిన శాంపిల్స్ దీని ఉనికిని బయటపెట్టాయి. దీని గతకాలం గురించిన అంచనాల ప్రకారం ఇది 23,960 ఏండ్ల నుంచి 24,485 ఏండ్లకు పూర్వం నాటిదని లెక్కగట్టారు. ఆ ప్రాంతంలో ఏడాది పొడవునా మంచు గడ్డలు భూ ఉపరితలంపై పేరుకుపోయి ఉంటాయి. ఈ మంచు గడ్డల కింద ఏయే విశేషాలు దాగి ఉన్నాయనే అంశంపై చాలా సంవత్సరాలుగా పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇంతకుముందు ఈ మంచు గడ్డల అడుగు భాగం నుంచి వెలికి తీసిన సూక్ష్మజీవాలు సైబీరియా ప్రాంతంలోనే రెండు చోట్ల కనిపించాయి. అవి 30000 ఏండ్ల నాటివని వారు లెక్కించారు.

Know more about china bio-weapons.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

 

Previous Post
Bollywood star hero’s interest in Tollywood actresses
Next Post
Benefits of eating almonds on a daily basis
Bollywood star hero’s interest in Tollywood actresses
Benefits of eating almonds on a daily basis

Recent Posts

Menu