ధూమపానం ప్రభావమే ఎక్కువ! కోవిడ్ 19 కరోనా వ్యాప్తిపై అధ్యయనాలు

ధూమపానం ప్రభావమే ఎక్కువ!

ధూమపానం ప్రభావమే ఎక్కువ, కోవిడ్ 19 కరోనా వ్యాప్తిపై అధ్యయనాలు!!!

          గత ఏడాది నుంచి ప్రపంచమంతటా  కోవిడ్ 19 కరోనా వైరస్ భయంకర పరిణామాలకు దారితీస్తోంది. అపారమైన ప్రాణనష్టంతో పాటు అంతులేని సమస్యలకు కారణమవుతున్నది. వాటితో పాటు ఆర్థిక మూలాలను  దారుణంగా దెబ్బతీస్తున్నది. మన దేశంలో గట్టిగా ఆరు నెలలు గడవకముందే రెండవ విడత వైరస్ దాడి మరింత ఉధృత స్థాయిలో జనజీవితాలను తల్లకిందులు చేసివేస్తోంది. ముఖ్యంగా కరోనా వైరస్ ప్రభావం సోకిన బాధితులలో అనేకమైన, అంతుచిక్కని ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ దశలో ఇటీవల ధూమపాన వ్యతిరేక దినోత్సవం (మే 31) అన్ని దేశాలలోనూ పాటించారు. ఆ సందర్భంగా ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

         ఈ అధ్యయనంలో భాగంగా స్త్రీపురుషులిద్దరి జీవితాలపై స్మోకింగ్ ప్రభావం గురించి పరిశీలించారు. స్మోక్ చేసే వారితో పాటు వారికి చేరువగా మసలుతూ పరోక్షంగా ధూమపాన ప్రభావానికి గురైన వారిలోనే ఎక్కువ సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ అధ్యయనాన్ని పూణేలోని ఒక వైద్య రంగ సంస్థ ఇండస్ హెల్త్ ప్లస్ చేపట్టింది. ఇలా నేరుగా స్మోక్ చేసే వారు, వారికి సన్నిహితంగా మసలుతూ దాని ప్రభావానికి గురైన వాళ్లలోనే సమస్యల తీవ్రత ఎక్కవగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఏప్రిల్ 2018  నుంచి జనవరి 2021 మధ్య కాలంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఒక్క మహారాష్ట్ర్రలోనే మొత్తం 29,548 మందిని గురించిన సమాచారాన్ని విశ్లేషించారు. పూణే పట్టణంలో 4124 మంది సమాచారం సేకరించి పరిశీలించారు.       

         రాష్ట్రవ్యాప్తంగా చూస్తే పురుషులలో 38 శాతం, స్త్ర్రీలలో 42 శాతం మందిలో ఊపిరితిత్తుల సమస్యలు కనిపించాయి. ఇక పూణెలో 48 శాతం మంది పురుషులు, 53 శాతం మంది స్త్ర్రీలలో ప్రమాద సూచికలు కనిపించాయి.  జననాలలో స్త్ర్రీల సంఖ్య అధికంగా ఉండడానికి ఆడవారిలో కూడా ప్రబలంగా ఉన్న పొగాకు వాడకమే కారణమని గుర్తించారు. స్మోక్ చేసే వారికి చేరువగా ఉండడం కూడా మరో కారణమని తేల్చారు.

         ఇంతకీ ఈ ఇండస్ హెల్త్ ప్లస్ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అమోల్ నయీకవాడి తమ పరిశోధనల వివరాలను వివరిస్తూ అంతకుముందే మన శరీరంలో ఉన్న రుగ్మతలకు స్మోకింగ్ దురలవాటు కూడా జతచేరితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ప్రత్యేకించి ఇప్పుడు అన్ని వర్గాలను భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావం చాలా ఎక్కువే అంటున్నారు. ముఖ్యంగా వైద్య చికిత్సకు స్పందించి కోలుకునే అవకాశాలను ఈ దురలవాటు కారణంగా చాలా ఆలస్యం అవుతుందట. నేరుగా స్మోక్ చేయకపోయినా అలాంటి వారికి చేరువగా మనలో చాలా మంది జీవితాలు సాగిస్తున్నాం కదా. అది మన ఇండ్లలనే కానీ, ఆఫీసుల్లో కానీ, దీర్ఘకాలం అలాంటి స్మోకర్లకు దగ్గరగా మసలడం వల్ల మనలో కూడా అవే దుష్పరిణామాలు కనిపిస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

         స్మోకింగ్ కారణంగా కరోనా వైరస్ వల్ల చాలా దుష్ఫలితాలు తప్పవు. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువ అవుతుంది. ఇంకా గుండెకు సంబంధించిన క్రానిక్ అబ్సస్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (దీనిని COPD గా వ్యవహరిస్తారు), బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, ఆస్థ్మా, లంగ్ క్యాన్సర్, ఊపరితిత్తుల సమస్య, డయాబిట్స్ వంటి వ్యాధులు సంక్రమిస్తాయట. ఇలాంటి స్మోక్ చేసే వాళ్లు వైరస్ బారిన పడుతున్నారు. అప్పటికే వారి ఊపిరితిత్తులు బలహీనం అయినందున వారిపై వైరస్ ప్రభావం మరింత అధికంగా ఉంటుంది.

        ముఖ్యంగా యువత మానసిక ఒత్తిడిని జయించేందుకు పొగ వచ్చే లేదా పొగ రాని స్మోకింగ్ కు అలవాటు పడుతున్నారు. దీనికి స్టెయిల్ అని సమాధానం చెప్పుకుంటున్నారు. కానీ ఇలాంటి వారు కేవలం మానసిక బలంతో మాత్రమే ఈ దురలవాటునుంచి బయటపడగలరు. వైద్య సలహా కూడా అవసరం.

Know more about increasing life span up to 150years.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
DGCI approves Sputnik V, fast-growing vaccine in India
Next Post
Maria Zakari, Coco Gauff make a grand entry into the French Open pre-quarter
DGCI approves Sputnik V, fast-growing vaccine in India
Maria Zakari, Coco Gauff make a grand entry into the French Open pre-quarter

Recent Posts

Menu