40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో….     2021లో 7.3 శాతం తగ్గనున్న దేశ ఆర్థిక స్థితి

2021లో 7.3 శాతం తగ్గనున్న, ఆర్థిక స్థితిగతులు దారుణంగా దిగజారిపోయాయి

40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో …. 2021లో 7.3 శాతం తగ్గనున్న దేశ ఆర్థిక స్థితి: ఆర్థిక స్థితిగతులు దారుణంగా దిగజారిపోయాయి

2021లో 7.3 శాతం తగ్గనున్న దేశ ఆర్థిక స్థితి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల కాలంలో దేశ ఆర్థిక స్థితిగతులు దారుణంగా దిగజారిపోయాయి. దేశ స్థూల ఉత్పత్తి (జిడిపి) 24.38 శాతం పడిపోయింది. దీనికి ప్రత్యక్ష కారణం మరేమీ కాదు. గత ఏడాది  నుంచి అన్ని దేశాలనూ అల్లకల్లోలం చేస్తున్న కోవిడ్ 19 కరోనా వైరస్ ప్రభావమే.

ఈ ఏడాది ప్రారంభం నుంచి అంటే జనవరి – మార్చి మధ్య కాలంలో  జిడిపి లో కనిపించిన పతనం ప్రభావం వల్ల దేశ ఆర్థిక పురోగతి 7.3 శాతం వరకు తగ్గిపోయింది. అయితే చివరి మూడు నెలల కాలంలో పురోగతి కొద్దిగా మెరుగుపడి 1.6 శాతం వృద్ధిని మాత్రమే సూచించింది.

2019-20 సంవత్సరంలో జిడిపి కేవలం 4 శాతం వృద్ధి సాధించింది. నిజానికి ఇది గత 11 ఏండ్ల కాలంలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఉంది. దీనికి కారణం ఉత్పత్తి రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ మాంద్యం ఏర్పడడమే.

2020-21 సవత్సరంలోనే మొదటి  మూడు నెలల కాలంలో జిడిపి క్షీణత 24.38 శాతం అని తేలింది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సెంట్రల్ స్టేటిస్టిక్స్ ఆఫీసు – సీఏఓ) ఈ వివరాలను వెల్లడించింది.

కోవిడ్ ప్రభావాన్ని అడ్డుకునేందుకు లాక్ డౌన్ అన్ని ప్రాంతాలలోనూ సర్వసాధారణమైపోయింది. గత ఏడాది నుంచి ఈ సమస్య అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. గత సంవత్సరం కొద్దిగా పుంజుకుంటున్న వ్యవస్థ మళ్లీ రెండో వేవ్ కారణంగా లాక్ డౌన్ సుడిగుండాలలో చిక్కుపోయింది. అక్టోబర్ – డిసెంబర్ కాలంలో కేవలం 0.4 శాతం పురోగతికనిపించింది. ఏప్రిల్ – జూన్ మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ 24.38 శాతం తగ్గిపోయిందని గణాంకాల కార్యాలయం వెల్లడించింది. అయితే జూలై – సెప్టెంబర్ నాటికి 7.5 శాతానికి మెరుగయింది.

వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపి తగ్గడం ఖాయమని ముందుగానే అంచనా వేసి, 8 శాతం వరకు ఈ తగ్గుదల ఉండవచ్చని లెక్కకట్టింది. ఈ అంచనాల ప్రకారం మార్చి నాటికి 1.1 శాతం వరకే తగ్గుదల కనిపించాలి. మరో పక్కన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీ ఐ) లెక్కల ప్రకారం ఆర్థిక స్థితిలో 7.5 శాతం పతనం అంచనా వేసింది. అయితే చాలా మంది ఆర్థిక నిపుణులు మన వ్యవస్థ పుంజుకుంటుందని గట్టిగా విశ్వసించాయి. అందువల్ల ఈ క్షీణత సీఎస్ఓ అంచనా వేసిన 8 శాతం ఉండకపోవచ్చని చెప్పారు. ఈ సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యయనం సారాంశం గమనించాలి. ఈ అధ్యయనం ప్రకారం జనవరి-మార్చి మాసాల కాలంలో క్షీణత 7.3 శాతం కన్నా తక్కువే ఉండవచ్చని తెలుస్తున్నది.

Know more about corporate companies’ aid to India.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

 

Previous Post
Amazon Prime Subscription Rs.499 Annual Offer with 50% Discount. Details
Next Post
He Read Inter and incarnate as a doctor
Amazon Prime Subscription Rs.499 Annual Offer with 50% Discount. Details
He Read Inter and incarnate as a doctor

Recent Posts

Menu