సగటు మహిళ విచిత్ర అనుభవం! బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ 100 కోట్ల డాలర్లు

సగటు మహిళ విచిత్ర అనుభవం!

సగటు మహిళ విచిత్ర అనుభవం

బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ 100 కోట్ల డాలర్లు

అమెరికా సమాజంలో పరమ పేదలు కూడా ఉంటారు. పాపం ఆమె భర్త చనిపోయి చాలాకాలమైంది. ఆయన బ్యాంకు ఏటీఎం కార్డు కనిపించింది. ఆ రోజు చేతిలో చిల్లిగవ్వ లేక ఆమె వెళ్లి ఏటీఎం నుంచి కేవలం 20 డాలర్లు (డాలరు ఒకటి మన రూ. 70 లకు సమానం.) తెచ్చుకుందామని వెళ్లింది. అడిగిన డబ్బు 20 డాలర్లు ఇస్తాం అయితే తీసుకుంటే అది అప్పు రూపంలోకి మారిపోతుంది అదనపు చార్జీలు పడతాయి అని హెచ్చరిక వచ్చింది. దిక్కుతోచని ఆమె ఆశ వదిలేసుకుంది. తీసుకోకుండానే బయటకి వచ్చేసింది. అయితే అసలు తమ ఖాతాలో ఎంత డబ్బు ఉందో అని తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. అక్కడ వారు చెప్పిన బ్యాంకు బ్యాలెన్స్ చూసి ఆమ కళ్లు తిరిగి పడిపోయిందనే అనుకోవాలి. ఆ మొత్తం అక్షరాలా ….

డాలర్లు 99,99,85,855.94 అంటే సుమారుగా వంద కోట్లు!

ఈ అనుభవం ఎదురైన మహిళ పేరు జూలియా యోనోవిస్కీ. ఫ్లోరిడాలోని లార్గో ప్రాంతంలో నివసిస్తారు. ఆమెకున్న ఏటీఎం కార్డు చేజ్ బ్యాంకు వారు ఇచ్చినది.

బ్యాలెన్స్ చూసిన తరువాత ఆశ్చర్యపోయిన ఆ మహిళ ఇలా వ్యాఖ్యానించింది. “ఓ మై గాడ్ (ఓ దేవుడా) ఏదో పెద్ద లాటరీ తగిలిందని చాలా మంది అనుకుంటారు. నాకు మాత్రం చాలా భయం వేసింది. ఖాతాలో వచ్చిన డబ్బును చూసి చాలా మంది దానిని లాగేసుకోవాలని అనుకోవచ్చు. కొంత మంది లాగేసుకుంటారు కూడా. అలాంటి కథనాలు చాలానే విన్నాను. అలా డబ్బును ఉపయోగించుకున్న వారు దానిని తిరిగి చెల్లించక తప్పదు కదా. అందుకే అలాంటి పని నేను చేయబోను. ఏ విధంగానూ ఆ డబ్బు నాది కాదు కదా. ” అని చెప్పారు జూలియా.

మంగళవారం (అంటే మనకు బుధవారం కావచ్చు) ఆ డబ్బు రహస్యం బయటపడింది. చేజ్ బ్యాంకు ప్రతినిధి వివరాలు వెల్లడించారు. వాస్తవానికి ఆమె బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ అసలు పైసా లేదు. నెగిటివ్ బ్యాలెన్స్ ఉంది. ఇలాంటి జీరో ఖాతాలను ఆధారం చేసుకుని కొన్ని అక్రమాలు జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు బ్యాంకు వారు ఉద్దేశపూర్వకంగా ఇలా వంద కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు చూపించే ఏర్పాటు చేశారు. కాకపోతే బ్యాంకు వారికి ఇలాంటి ఖాతా ఏదైనా అంటే వంద కోట్ల డాలర్ల బ్యాలెన్స్ ఉన్న ఖాతా ఏదైనా ఉంటే అది పూర్తిగా జీరో బ్యాలెన్స్ అకౌంటు అని బ్యాంకు వారు గుర్తించేందుకు ఒక ఇండికేషన్ గా పెట్టుకున్నారు. ఇలాటి అనుమానాస్పద లావాదేవీ కారణంగానే ఆమె సొంత డబ్బు అయినా 20 డాలర్లు కూడా ఇవ్వకుండా ఏటీఎం అడ్డుకున్నట్లు తెలుస్తోంది.

అత్యాశాపరులకు ఇదొక గుణపాఠం అవుతుందని జూలియా హెచ్చరించారు.

Know more about the sexual assault on Afghanistan women police.

Also, know more about Covid 19 updates in Telangana.

Previous Post
Better results if exercise at this time!
Next Post
Prakash Raj team entering the ring ahead of MAA elections
Better results if exercise at this time!
Prakash Raj team entering the ring ahead of MAA elections

Recent Posts

Menu