కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర వైద్యుల లేఖ

కరోనా_నియంత్రణలో_సర్కారు_వైఫల్యం

కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర వైద్యుల లేఖ

తక్షణ చర్యలను సూచించిన నిపుణులు

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వాలు సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని 47 మంది వైద్యులు సమష్టిగా ఒక లేఖలో ఆరోపించారు. ప్రగతి శీల వైద్య బృందం పేరుతో వారు సుప్రీం కోర్టుకు రాసిన లేఖలో పరిస్థితి దారుణంగా మారిందని గుర్తు చేసారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పాలకులు అశ్రద్ధ చూపించినందునే ఈ పరిస్థితి తీవ్రరూపం దాల్చిందని వారు ఆరోపించారు. గత మార్చి, ఏప్రిల్, మే మాసాలలో కోవిడ్ 19 కరోనా వైరస్ ముప్పు ప్రతి రోజూ 4వేల మంది ప్రాణాలు బలితీసుకుంటోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాధి ప్రభావాన్ని అదుపు చేసేందుకు తక్షణం కొన్ని చర్యలు చేపట్టడం అవసరమని వారు చీఫ్ జస్టిస్ దృష్టికి వివరించారు. వారు రాసిన లేఖలోని సారాంశం క్లుప్తంగా ఇది :

వాస్తవ పరిస్థితులు :

గత మూడు నెలల కాలంలో కోవిడ్ బెడద దారుణంగా మారిందని ప్రభుత్వాలు ప్రకటిస్తున్న లెక్కలే చెబుతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 1500 మంది నుంచి 3000 ఇంకా ఎక్కువ సంఖ్యలో అమాయక ప్రజలు కోవిడ్ వ్యాధికి గురయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దేశంలో ఏప్రిల్ 15 నుండి చూస్తే రోజుకు 2,00,000 కేసులు నమోదవుతూ వచ్చాయి. ఏప్రిల్ 27 నాటికి ఈ సంఖ్య 3,60,960 కేసులతో ప్రపంచంలోనే ఎక్కడా లేని కోవిడ్ బాధితుల సంఖ్య నమోదయింది. ఇది ప్రపంచంలోనే మరే దేశంలోనూ కనిపించని అత్యంత బాధాకరమైన రికార్డు. ఇక ఆ తరువాతి రోజులలో రోజువారీ సంఖ్య 4 లక్షలు దాటిపోయింది. మే నెల 4వ తేదీ నాటికి మొత్తం దేశంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లు దాటిపోయింది. (తాజా లెక్కల ప్రకారం 2,54,96,330 కేసులు నమోదయ్యాయి) ఇప్పటి వరకు కరోనా వైరస్ విజృంభణ ప్రారంభమైన నాటి నుంచి ఇది అధికారిక సమాచారం అయితే అనధికారికంగా తెలుస్తున్న అంకెలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీనికి పది రెట్లు అధికంగానే ఉండవచ్చునని తెలుస్తోంది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు అరకొరగా ఉండడం ఒక సమస్య కాగా మృతుల అంత్యక్రియలు మరింత పెద్ద సమస్యగా తయారైంది. చాలా చోట్ల మృతదేహాలను నదుల్లోకి పారేసి, ఎక్కడ పడితే అక్కడ పాటి  పెట్టేసి, సామూహికంగా దహనం చేస్తున్నట్లు పత్రికలలో నిత్యం వార్తలు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలు :

కోవిడ్ తొలి దశ దాడి పూర్తిగా అదుపులోకి రాకముందే కొన్ని మతపరమైన కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సమస్య తీవ్రమయేందుకు ప్రధాన కారణం అని చెప్పాలి. పరిస్థితిని సరిగా అంచనా వేసి నివారణ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించడం మరింత అధ్వాన్న పరిస్థితికి దారి తీసింది. బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నా, వేలాది మంది ఆక్సిజన్ అందక, ఆసుపత్రుల్లో బెడ్ లభించక పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం ఉదాశీనంగా చూస్తూ ఉండిపోయింది. ఆక్సిజన్ కొరత తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించే సిబ్బంది చాలా కొద్ది సంఖ్యలోనే ఉన్నారని తెలిసినా కొత్త నియామకాలు చేపట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఆక్సిజన్ ఉత్పత్తికి ఏ మాత్రం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో అనేక మంది కేవలం ఆక్సిజన్ అందుబాటులో లేని కారణంగా వేలాది మంది చనిపోయారు. చాలా రాష్ట్రాల నుంచి, కోర్టుల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాలపై విమర్శలు, చీవాట్లు   ఎదుర్కొన్నాయి.

ఎంతో కొంత ప్రజలకు భరోసా ఇస్తున్న వ్యాక్సీన్ ఉత్పత్తి పరిమితంగా ఉండడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. వ్యాక్సిన్ డోసులు సవ్యంగా లభించకపోవడంతో అన్ని రాష్ట్రాలలోనూ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొదటి డోసు లభిస్తే రెండవది సమస్యగా మారింది. చాలా చోట్ల మొదటి డోసు కూడా అందక జనం గగ్గోలు పెడుతున్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి కేవలం రెండు సంస్థలకు మాత్రమే ఇవ్వడం వల్లనే ీ పరిస్థితి ఏర్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రసుత మే నెలలో పూర్తిగా ఆపివేసినట్లు తెలుస్తున్నది. కోవిడ్ పరిక్ష నిర్ధారణ కేంద్రాలు, వ్యాక్సీన్ వేసే కేంద్రాలు ఒకే చోట ఏర్పాటు చేయడం వల్ల వ్యాధి వ్యాప్తికి కారణమవుతుందన్న భయాందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇలా పరీక్షా కేంద్రాలను, వ్యాక్సీన్ కేంద్రాలను ఒకే చోట ఏర్పాటు చేయడం పూర్తిగా ప్రభుత్వాల అలసత్వానికి సూచనగా గుర్తించాలి.

సమస్యకు పరిష్కారం చూడవలసిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపించడంతో వైద్య రంగంలో స్వార్థశక్తులు స్వప్రయోజనాల కోసం ఒక మాఫియాగా మారిపోతోంది. వైద్యానికి అపరిమితంగా ఫీజులు వసూలు చేయడం, మందుల ధరలు పెంచివేయడం, కృత్రిమ కొరత సృష్టించడం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న శక్తులు వైద్య రంగంలో విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో లాగేసుకుంటున్నాయి. ఈ దశలో ప్రజలకు శాస్త్రీయమైన అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు కొందరు గోమూత్రం, గోవు పేడలతో వైద్యం అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. నిజానికి రాజ్యాంగంలోని 51ఏ(హెచ్) ప్రకారం ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంచవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.

డాక్టర్ల బృందం సూచనలు

  1. కోవిడ్ సమస్యను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. అన్ని ప్రైవేటు లేక కార్పొరేట్ ఆసుపత్రులను జాతీయం చేయాలి. కార్పొరేట్ మాఫియా దుశ్చర్యలకు ముకుతాడు వేయాలి.
  1. ప్రతి మండలంలోనూ 1000 పడకల ఆసుపత్రులను తక్షణం ఏర్పాటు చేయాలి. వాటిని సమర్థవంతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది నియామకాలు చేపట్టాలి. అంబులెన్స్లు సేవలు ఉచితంగానే అందించాలి. అన్ని రకాల వ్యాధులకూ ఉచిత వైద్య సదుపాయం కల్పించాలి.
  1. వేరు వేరు చోట్ల రోగనిర్ధారణ కేంద్రాలను, వ్యాక్సీన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. వ్యాక్సీన్లను, చికిత్సకు అవసరమైన మందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పెద్ద మొత్తాలలో కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా అందించాలి. మందులు ఇతర ప్రాణ రక్షణ పరికరాలను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిని గుర్తించి కఠినాతికఠినంగా శిక్షించాలి.
  1. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వైద్య ఆరోగ్య సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా బడ్జెట్లో కనీసం 10 శాతం నిధులు కేటాయించాలి.

తెలంగాణలో పరిస్థితి

రాష్ట్రంలో కూడా పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా లేదు. కోవిడ్ ప్రారంభం నుంచి చూస్తే కేసుల సంఖ్య నేటికి 5,36,766 కేసులకు చేరింది. మొత్తం మరణాలు 48,110 చేరింది. మన పొరుగు రాష్టం ఆంద్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 14,75,372 గానూ, మరణాలు 2,11,501 కి చేరాయి. సమస్యలు కూడా అన్ని రాష్ట్రాలలోగానే ఇక్కడా తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. వ్యాక్సీన్లు కొరత, మందుల కొరత, ఆక్సిజన్ కొరత, వైద్య సిబ్బంది కొరత, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ అన్నీభయంకరంగానే ఉన్నాయి. లాక్ డౌన్ నిబంధనలు ఏ మేరకు ప్రయోజనం ఇస్తాయో తెలియాలంటే మరి కొద్ది కాలం ఎదురు చూడకతప్పదు.  కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం

ప్రగతిశీల వైద్యుల బృందం (ప్రోగ్రెసివ్ డాక్టర్స్): 

డాక్టర్ కాసుల లింగారెడ్డి

డాక్టర్ ఎస్ అజిచ

డాక్టర్ అన్వేష్

డాక్టర్ అవని

డాక్టర్ దేశమ్

డాక్టర్ హర్షవర్థన్ రెడ్డి

డాక్టర్ జగదీశ్వర్

డాక్టర్ జయసూర్య

డాక్టర్ కె. గౌతమ్

డాక్టర్ మధుసూదన్ రెడ్డి

డాక్టర్ మూర్తి

డాక్టర్ నళిని

డాక్టర్ రఫీ

డాక్టర్ వి. సూబ్బారెడ్డి

డాక్టర్ మేకల ఇన్నారెడ్డి

డాక్టర్ తిరుపతయ్య

డాక్టర్ విజయ కుమార్

డాక్టర్ శిరీష

డాక్టర్ తిరుపతి

డాక్టర్ గోపాల్ రెడ్డి

డాక్టర్ గోపీనాథ్

డాక్టర్ రాంగోపాల్

డాక్టర్ సాహితీ

డాక్టర్ సంతోష్

డాక్టర్ పెంచలయ్య

డాక్టర్ రాజశేఖర రెడ్డి

డాక్టర్ రణధీర్

డాక్టర్ రంగారెడ్డి

డాక్టర్ సాహస

డాక్టర్ శ్యాం సుందర్

డాక్టర్ శ్రీభూషమ్ రాజు

డాక్టర్ వంశీధర్ రెడ్డి

డాక్టర్ విజయకుమార్

డాక్టర్ విరించి విరింటి

డాక్టర్ వివేక్

డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్

డాక్టర్ సి.హెచ్. రాజమౌళి

డాక్టర్ చెన్నయ్య

డాక్టర్ మధుశేకర్

డాక్టర్ రాం మోహన్

డాక్టర్ వెంకటేశం

డాక్టర్ చంద్రశేఖర్

డాక్టర్ చైతన్య చెక్కిళ్ల

డాక్టర్ శ్రీనివాసం నళిని

కరోనా నియంత్రణలో సర్కారు వైఫల్యం – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర వైద్యుల లేఖ 

Also Read: కరోనా భీభత్సం!! రక్షణ వ్యవస్థ లేక జనజీవితాలు అల్లకల్లోలం

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

CORONA ( COVID 19 ) HELPLINE : 011-23978046 OR 1075

TELANGANA COVID 19 HELPLINE : 104, 8790005197, 040-23286100, 040-23454088

STATE CONTROL ROOM : 040-23450624 / 23450735

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Electricity bill payment counters in Telangana are longer open till 12 noon
Next Post
Telangana Chief Minister KCR visited Gandhi Hospital on Wednesday
Electricity bill payment counters in Telangana are longer open till 12 noon
Telangana Chief Minister KCR visited Gandhi Hospital on Wednesday

Recent Posts

Menu