Teenmaar Mallanna Today News:తనను హత్య చేయడానికి కుట్రపన్నారు అని ఆరోపించిన మల్లన్న

Teenmaar Mallanna Today News

Teenmaar Mallanna Today News

iRAYSMEDIA

Teenmaar Mallanna Today News:తెలంగాణ అధికార పార్టీ తనను హత్య చేయడానికి భారీ కుట్ర పన్నిందని తీన్మార్‌ మల్లన్న ఆరోపించారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధి కొర్రెములలోని జేకే కన్వెన్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన ‘తీన్మార్‌ మల్లన్న టీం భవిష్యత్‌ కార్యాచరణ’ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అధికార పార్టీ తనను అనేక ఇబ్బందులకు,చిత్రహింసలకు గురిచేసింది అని తెలిపారు మల్లన్న.అలాగే ఎక్కడా లేని విధంగా కేసులు పెట్టి 74 రోజులు జైలుకు పంపిందన్నారు.జైలులో పాత నేరస్థులతో అక్టోబరు 2, గాంధీ జయంతి రోజున నన్ను చంపాలని కుట్ర పన్నగా చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలిపారు మల్లన్న . మరుసటి రోజు చీకటి గదిలో బందించారని ఎర్రగడ్డలోని మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని యత్నించినట్లు ఆరోపించారు.

జైలు నుంచి తనను బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులు సహాయం చేసారని తెలిపారు .అయితే బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మాట వాస్తవమేనని పేర్కొన్నారు.

భవిష్యత్‌ కార్యాచరణ

ఈ సందర్భంగా భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా.. నూతన పార్టీ పెట్టడం,ఇతర పార్టీలో చేరడం, ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం, పాత పద్ధతిలోనే కొనసాగడం, వంటి నాలుగు అంశాలపై జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయ సేకరణ చేపట్టారు. జిల్లాలవారీగా అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలను నిర్ణయాలను క్రోడీకరించి తీసుకునే రాజకీయ నిర్ణ్ణయాన్ని స్వాగతిస్తామని అందరూ ఏకాభిప్రాయంతో తీర్మానించినట్లు తీన్మార్‌ మల్లన్న తెలిపారు. మల్లన్న జైలు నుంచి బయటకు రావడానికి సహకరించిన వారందరికీ, తన టీం సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

READ MORE:

Teenmar Mallanna key announcement on the formation of a new party

Mallanna To-Join In BJP-Party:బీజేపీ లోకి మల్లన్న

Mallanna Case High-Court Serious:మల్లన్న కేసుల పై హై కోర్ట్ సీరియస్

Previous Post
November 14 Children’s Day:భారతదేశం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటుందో మీకు తెలుసా?
Next Post
Delhi Air Pollution::దేశ రాజధాని ఢిల్లీ లో లాక్‌డౌన్
November 14 Children’s Day:భారతదేశం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటుందో మీకు తెలుసా?
Delhi Air Pollution::దేశ రాజధాని ఢిల్లీ లో లాక్‌డౌన్

Recent Posts

Menu