అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం : Surprise Gift To ALLU ARJUN

Surprise Gift To ALLU ARJUN

అల్లు అర్జున్ కు అరుదైన 160ఏళ్ల బహుమానం –  Surprise Gift To ALLU ARJUN iRAYSMEDIA – HYDERABAD NEWS

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అయిన అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారన్న విషయం మన అందరికి తెలిసిందే. అయితే మన ఈ ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్లో ముఖ్యంగా కేరళ ఒక్క రాష్ట్రంలోనే అల్లు అర్జున్ కు విశేషమైన సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

అల్లు అర్జున్ ని మించి ఇంకే ఇతర హీరోకి కూడా ఇంత క్రేజ్ లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త సినిమా అయిన పుష్ప సినిమాను సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలోని పాట దాక్కో దాక్కో మేక యూట్యూబ్ ట్రెండ్ గా నిలిచి సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ లోను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ ఇటు కోలీవుడ్ ఫ్యాన్సే కాకుండా అటు బాలీవుడ్ లోను ఫాన్స్ను సంపాదించుకుని పాన్ ఇండియా స్టార్ గా మారడానికి బన్నీ సిద్ధంగా ఉన్నాడు.
తాజాగా యూఏఈకి వెళ్లిన అల్లు అర్జున్ కి ఘన స్వాగతం పలికారు. పైగా అల్లు అర్జున్ వీరాభిమాని ఐన ఓ మల్టీ మిలియనీర్ అతి ప్రాచీనమైన బహుమానాన్ని అందించారు.

Surprise Gift To ALLU ARJUN

Surprise Gift To ALLU ARJUN : అయితే ఈ మల్టీ మిలియనీర్ కేరళ లోని మూల ప్రాంతం నుండి దుబాయ్ వెళ్లి అక్కడ సెట్లయ్యాడు. ఈ మల్టీ మిలియనీర్ పేరు రియాజ్ కిల్టన్. ఇతను అల్లు అర్జున్ కు వీరాభిమాని అయినందున, అయన యూఏఈకి వచ్చారన్న విషయం తెలుసుకుని ఆయనని కలుసుకున్నారు. తన అభిమానాన్ని చాటుకునేందుకు గాను ఆ మల్టీ మిలియనీర్ 160 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతనమైన పిస్టల్ ను బహుమతిగా అందిచారు. అయితే ఈ విషయం అంతటిని మల్టీ మిలియనీర్ స్నేహితుడైన ప్రముఖ తమిళ దర్శకుడు ఒమర్ లులు తన సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

 

READ MORE : 

Allu Arjun as God: అల్లు అర్జున్ దేవుడిగా కొత్త సినిమా | New movie to Allu Arjun as God

ప్రకృతి విచిత్రం! 24 వేల ఏండ్ల తరువాత ఊపిరి పోసుకున్న సూక్ష్మ జీవి!

Previous Post
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు : 80 NEW CORONA CASES IN KUKATPALLY
Next Post
IPL చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు : BCCI కీలక నిర్ణయం
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా : GHMC లో కొత్తగా 80 కేసులు : 80 NEW CORONA CASES IN KUKATPALLY
IPL చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు : BCCI కీలక నిర్ణయం

Recent Posts

Menu