Supreme-Court Serious 0n Bharat-Bandh:రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

Supreme-Court Serious 0n Bharat-bandh

Supreme-Court Serious 0n Bharat-Bandh, iRAYSMEDIA

హైవేలను రోజూ బ్లాక్​ చేస్తే ఎట్ల?.. రైతుల ధర్నాపై సుప్రీం ఆగ్రహం

Supreme-Court Serious 0n Bharat-Bandh: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ, హర్యానా బార్డర్​లో రైతులు రోజూ హైవేలను బ్లాక్​ చేస్తుండటంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

సోమవారం భారత్​బంద్​ సందర్భంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 40 రైతు సంఘాల నాయకులు ర్యాలీలు, నిరసన చేసారు . దీంతో రోడ్లు బ్లాకై చేసి ఢిల్లీ, యూపీ మరియు హర్యానా బార్డర్లలో ట్రాఫిక్​కు తీవ్ర ఇబ్బంది కలిగించారు .

Supreme-Court Serious 0n Bharat-bandh

రైతులకు సమస్యలు ఉండొచ్చని, అందుకని రోజూ హైవేలను బ్లాక్​ చేస్తారా అని గట్టిగ నిలదీసింది. ఇలాగైతే ఎలాగని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. కోర్ట్ ఏమైనా జోక్యం చేసుకొని ఆదేశాలిస్తే కోర్టు పరిధి దాటుతోందని అంటారని కామెంట్​ చేసింది. కోర్టులు చట్టాల గురించి చెబుతాయని, అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలని గుర్తు చేసింది.

Supreme-Court Serious 0n Bharat-bandh

జాతీయ రహదారులను బ్లాక్ సమస్యకు పరిష్కారం కాదని. నోయిడాకు చెందిన మోనికా అగర్వాల్​ రోడ్లను బ్లాక్​ చేస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని కోర్టులో పిల్​ దాఖలు చేశారు. గతంలో ఢిల్లీ చేరుకోవడానికి 20 నిమిషాలు పట్టేదని, కానీ ఇప్పుడు 2 గంటలకు పైగా సమయం పడుతోందని, రైతుల చేసే నిరసనల వల్ల జనం చాల ఇబ్బంది పడుతున్నారని వివరించారు. గురువారం కోర్టు ఈ పిల్​పై కోర్టు గురువారం విచారణ జరిపింది.

ఒక్క రోజంటే ఏమో అనుకోవచ్చు..

‘రైతులకు బాధ కలిగి ఉండొచ్చు. కానీ రోడ్లు బ్లాక్​ చేయడం వాళ్ళ జనాలు కూడా ఇబ్బంది పడతారు అన్న విషయాన్నీ గమనించాలి . ఒకరోజంటే అనుకోవచ్చు. ప్రతి రోజూ రోడ్లను బ్లాక్​ చేస్తే ఎలా? హైవేలనుబ్లాక్ చేయకూడదు’ అని సుప్రీంకోర్టు కామెంట్​ చేసింది. దీనికి సంబంధించి కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించింది. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కేంద్రం తరఫున స్పందిస్తూ.. రైతుల సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించామని, ఆ కమిటీతో చర్చించేందుకు రైతు సంఘాలు నాయకులూ నిరాకరించాయని చెప్పింది. పిల్​లో భారత్​ కిసాన్​యూనియన్, నిరసన తెలుపుతున్న ఇతర రైతుల సంఘాలను పార్టీలుగా చేర్చాలని కోర్టును కోరగా పిటిషన్​ దాఖలు చేయాలని కోర్టు చెప్పింది. విచారణను అక్టోబర్​4వ తేదీకి వాయిదా వేసింది.

జడ్జిలుగా 16 మంది పేర్లు ప్రతిపాదించిన కొలీజియం

బాంబే, గుజరాత్​, ఒడిశా, పంజాబ్​ అండ్ హర్యానా హైకోర్టులకు జడ్జిలుగా నియమించేందుకు ఆరుగురు జ్యుడీషియల్​ ఆఫీసర్లు, 10 మంది లాయర్ల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించింది. కొలీజియం బుధవారం జరిగిన మీటింగ్​లో ఈ నిర్ణయం తీసుకుంది.

READ MORE:

Huzurabad By Election News : గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు TRS పార్టీ బీ-ఫారం

Sajjanar TSRTC Employees Salary : TSRTC ఉద్యోగులకు గుడ్ న్యూస్

Previous Post
Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా
Next Post
Mallanna To-Join In BJP-Party:బీజేపీ లోకి మల్లన్న
Gachibowli Stadium Hyderabad News:  గచ్చిబౌలి స్టేడియాన్ని కాపాడాలని ధర్నా
Mallanna To-Join In BJP-Party:బీజేపీ లోకి మల్లన్న

Recent Posts

Menu