అవిగో ఆశా కిరణాలు! జమ్ము-కాశ్మీర్ కు రాష్ట్ర హోదా !

అవిగో ఆశా కిరణాలు!

అవిగో ఆశా కిరణాలు!

జమ్ము-కాశ్మీర్ కు రాష్ట్ర హోదా !

జమ్ము-కాశ్మీర్ రాష్ట్రానికి రాజ్యంగంలోని 370వ అధికరణ కింద సంక్రమించిన ప్రత్యేక హోదాను గతంలో రద్దు చేసి, లఢఖ్ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా విభజించిన తరువాత రాష్టంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జమ్ము-కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తినిచ్చే అంశంపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవ తీసుకున్నట్లు స్ఫష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 24వ తేదీన ఆ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఆహ్వానం అందిన విషయాన్ని మాజీ ముఖ్యమంత్రులు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత మెహబూబా ముఫ్తి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ధృవీకరించారు. అయితే ఈ చర్చల ప్రయోజనం, లేదా చర్చించే ముఖ్యమైన అంశాలపై ఇంకా స్పష్టత లేకున్నా, జమ్ము-కాశ్మీర్ కు రాష్ట్ర హోదా ముఖ్యమైనదని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈలోగా జమ్ము-కాశ్మీర్ పరిధిలో అయిదు పార్టీల (ఈ కూటమిలో నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ(ఎం), జమ్ము కాశ్మీర్ పీపుల్స్ మూవ్ మెట్, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పడు ఉన్నాయి. కూటమి నుంచి సాజద్ లోనే నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు వైదొలగాయి) కూటమిగా ఏర్పడిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ సీనియర్ నేత ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రం శాంతి యత్నాలు ప్రారంభిస్తే పరిశీలించేందుకు సిద్ధమేనంటూ స్నేహహస్తం అందించడం విశేషం. గత వారంలో (జూన్ 9న) పీడీపీ నేత మెహబూబా ఆధ్వర్యంలో జరిగిన కూటమి సమావేశం జరిగింది.

ఇతరత్రా అందిన సమాచారం ప్రకారం గత కొన్ని వారాలుగా జమ్ము-కాశ్మీర్ అప్నీ పార్టీ నేత అల్తఫ్ బుఖారీ, మరి కొందరు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో తెరవెనక సంప్రదింపులు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది నవంబర్ ప్రాంతంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా చర్చలలో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే లెఫ్ట్నెంట్ గవర్నర్ సిన్హా రాష్ట్ర ప్రముఖ నాయకులు అబ్దుల్లా, సాజద్ లోనె, కాంగ్రెస్ నేత మీర్ తదితరులతో జరిపిన చర్చలకు ప్రాముఖ్యం ఉంది.

అయితే చర్చలకు ఆహ్వానాలు అందుకున్న నాయకులు ఇంకా తమ వైఖరిని ఖరారు చేసుకున్నట్లు లేదు. కేంద్రం ఆలోచనలు తెలిసన తరువాతే ఆయా పార్టీల అభిప్రాయాలు వెల్లడి కావచ్చు. ఇప్పటివరకు 9 పార్టీలకు ఆహ్వానాలు వెళ్లినట్లు నిర్ధారణ అవుతోంది. కాకపోతే మొత్తం 16 పార్టీల వరకు ఆహ్వానాలు అందుకోవచ్చని సమాచారం.

Also, know more about Covid 19 updates in Telangana.

Know more about Central Government Failure in controlling corona spread.

Previous Post
Arrest of two doctors selling fake injections
Next Post
Construction of Warangal Hospital as in Canada
Arrest of two doctors selling fake injections
Construction of Warangal Hospital as in Canada

Recent Posts

Menu