తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : SRIJA scores Top 20 In CIVILS 2021

SRIJA scores Top 20 In CIVILS

తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : iRAYSMEDIA – HYDERABAD NEWS

తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : వరంగల్ జిల్లాకు చెందిన యువతి దేశంలోనే అత్యున్నత సర్వీస్ అయిన సివిల్స్ లో తన సత్తా చాటింది. టాప్ 20వ ర్యాంక్ సాధించి సివిల్స్ లో మెరిసింది.

తెలంగాణకు లోని వరంగల్ జిల్లా స్వస్థలం ఐన శ్రీజ హైదరాబాద్ లోని ఉప్పల్ సమీపంలో సాయినగర్ లో నివాసం ఉంటున్నారు. శ్రీజ తండ్రి శ్రీనివాస్ హన్సిగుడలోని వాహనాల షోరూమ్ లో Sales Managerగా, తల్లి శ్రీలత నర్సుగా పని చేస్తున్నారు. శ్రీజ ఉస్మానియా మెడికల్ కాలేజీలో MBBS చదివింది. తాజాగా సివిల్స్ ఎగ్జామ్స్ లో తనది తొలి ప్రయత్నం ఐనప్పటికి ఎవరు సాధించలేని ఘనతను సాధించింది. దేశంలోనే మొదటి 20వ ర్యాంక్ సాధించి అందరినీ అబ్బురపరిచింది.

టాప్పర్ ఇన శ్రీజ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో MBBS చేసిందని తెలిపింది. పేదలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో తను సివిల్స్ కు సిద్ధమైందని పేర్కొంది. సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవారు పెద్దగా ఒత్తిడికి గురవుతుంటారు. అలా తాను ఒత్తిడికి గురి అవ్వకుండా, అన్ని అంశాలపై అవగాహన పెంచుకుని సివిల్స్ లోని ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల్లో ఉతిర్ణత సాధించిందని తెలిపింది. ఈ రాత పరీక్షలోనే కాకుండా ఇంటర్వ్యులో కూడా తడబడకుండా సమాధానాలు చెప్పాను అని పేర్కొంది. శ్రీజ తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్ యాజమాన్యం తనకు ఇచ్చిన ప్రోత్సాహమే తన విజయానికి కారణమని ఆనందం వ్యక్తం చేసింది.

 

ఈ క్రిందివి కూడా చదవండి :

Telangana government has directed: వరంగల్ అర్బన్ మరియు రూరల్ జిల్లాల ప్రదర్శన పేర్లు మార్చాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు | The Telangana government has directed to change the name and display of Warangal Urban and Rural districts

Minister KTR Inaugurated: సౌర విద్యుత్‌ ఉత్పత్తి లో మేం సూపర్ | Minister KTR – We are super in solar power

Previous Post
Revanth Reddy vs Jagga Reddy : రేవంత్ రెడ్డిపై దుమారం రేపి వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి
Next Post
రేపే భారత్ బంద్ : కేంద్ర ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు
Revanth Reddy vs Jagga Reddy : రేవంత్ రెడ్డిపై దుమారం రేపి వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి
రేపే భారత్ బంద్ : కేంద్ర ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు

Recent Posts

Menu