సింగరేణి చైర్మన్ చొరవతో సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్

సింగరేణి

సింగరేణి వ్యాప్తంగా కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది .సింగరేణి చైర్మన్ మరియు ఎం. డి శ్రీ .ఎన్.శ్రీధర్ చూపిన ప్రత్యేక చొరవతో  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ సూచనల మేరకు అన్ని ఏరియాల్లో గల ఏరియా ఆసుపత్రులు, డిస్పెన్సరీ లో కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసినట్లు యాజమాన్యం తెలియజేసింది.

 రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండవ  ఫేజ్ వ్యాక్సినేషన్ లో భాగంగా  సింగరేణి లో కూడా 45 సంవత్సరాలు పైబడి కోమార్బిడిటీస్ గల వారికి  ఈ వ్యాక్సిన్ను ఇవ్వనున్నారు.

కోవిడ్ వ్యాధిని  ఎదుర్కోవడం కోసం సింగరేణి సి.అండ్  ఎం. డి శ్రీ.ఎన్ .శ్రీధర్   ప్రత్యేక చొరవ చూపి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసి ,పెద్ద ఎత్తున   పరీక్షలు నిర్వహించి  వైద్య సేవలు అందించారని..అందువలన అతి తక్కువ నష్టంతో సంస్థ కోవిడ్ నుండి బయట పడిందని అదే విధంగాకోవిడ్  వ్యాక్సిన్ ను కూడా కార్మికులకు వేయించాలని కార్మికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ చైర్మన్ మరియు శ్రీ ఎం శ్రీధర్ రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖ వారిని ఇటీవల సంప్రదించి కార్మికులకు వాక్సిన్ వేయాలని కోరారు . దీనిపై  వ్యాప్తంగా సంస్థ వ్యాక్సిన్ వేయించడానికి అంగీకరిస్తూ. రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్  సింగరేణిసంస్థ కి ఒక లేఖ రాసారు . సంస్థ వ్యాప్తంగా వ్యాక్సిన్ వెయ్యటానికి అనువుగా ఉన్న ఏరియా ఆస్పత్రులను డిస్పెన్సరీ లను సిద్ధంగా ఉంచాలని దీనిలో కోరారు.

ఈ మేరకు  సింగరేణి వైద్య శాఖ  పూర్తి ఏర్పాట్లు చేసింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ ఒక ప్రకటన చేస్తూ ఈ అవకాశాన్ని ఫేజ్ రెండు పరిధి లోకి వచ్చే వయసున్న మరియు కోమార్బిడిటిస్ గల  కార్మికులు వారి కుటుంబ సభ్యులు వినియోగించుకోవాలని కోరారు.

 రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తో పాటు కంపెనీ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తీసుకురావాలని సూచించారు.

 

Previous Post
Energy, metal down, markets dhamaal
Next Post
KCR Decision on school management and examinations in Telangana
Energy, metal down, markets dhamaal
KCR Decision on school management and examinations in Telangana

Recent Posts

Menu