రేపే భారత్ బంద్ : కేంద్ర ప్రభుత్వంపై రైతుల తిరుగుబాటు

రేపే భారత్ బంద్

రేపే భారత్ బంద్ : iRAYSMEDIA – HYDERABAD NEWS

ఈ నెల 27న అంటే రేపే భారత్ బంద్ విజయ వంతం చేయాలని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు పిలుునిచ్చాయి. వీరి భారత్ బంద్ పిలుపు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు తెలిపింది. ఈ ఉద్యమం అంత శాంతియుతంగా నిరసన తెలియజేయాలని ఏపీ మంత్రి పేర్ని నని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను ఖండిస్తూ ఈ నిరసనను చేపట్టామని చెప్పారు.

రేపే భారత్ బంద్

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్ సంస్థలకు అమ్మే నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి ఈ నిరసన చేపట్టామన్నారు. వీరికి మద్దతుగా ఆర్టీసీ కార్మికులు కూడా మధ్యాహ్నం వరకు నిరసనలో పాల్గొంటామని తెలిపారు. అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం 35మంది యొక్క ఆత్మ బలిదానాలు వృధా కాకుండా ఉండడానికి ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలి అని నిర్ణయించుకున్నారు.

 రేపే భారత్ బంద్

ఈ నెల 27న రైతు సంఘాల అభ్యర్థులు, కేంద్రం సూచించిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి చేపట్టిన ఈ భారత్ బంద్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంపూర్ణ మద్దతును తెలిపారు. టిడిపి కార్యకర్తలు, నాయకులు ఈ బంద్ లో పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో రైతు వ్యతిరేక చట్టాలపై తమ గళం విప్పారని, రైతు ప్రయోజనాలే టీడీపీకి ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

భారత్ బంద్ కు టీడీపీతో పాటు సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా మద్దతును తెలిపాయి.

 

ఈ క్రిందివి కూడా చదవండి : 

Previous Post
తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : SRIJA scores Top 20 In CIVILS 2021
Next Post
బిగ్ బాస్ సీజన్ 5 నుండి లహరి ఎలిమినేటెడ్ : LAHARI Eliminated from BIGG BOSS 5
తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : SRIJA scores Top 20 In CIVILS 2021
బిగ్ బాస్ సీజన్ 5 నుండి లహరి ఎలిమినేటెడ్ : LAHARI Eliminated from BIGG BOSS 5

Recent Posts

Menu