Samantha NagaChaitanya Divorce Confirmed : చై-సామ్ కు విడాకులు మంజూరు

Samantha NagaChaitanya Divorce Confirmed

Samantha NagaChaitanya Divorce Confirmed : iRAYSMEDIA – HYDERABAD NEWS

గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న గాలి వార్తలే నిజమయ్యాయి. ఎంతో మంది నిజం కావద్దు అనుకున్న సంఘటన నిజమైంది. టాలీవుడ్ సెలబ్రిటీ ప్రేమ జంట సమంత, అక్కినేని నాగచైతన్య వేరు వేరు కుంపటి పెట్టుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇద్దరు పెట్టిన పోస్ట్ మాత్రం సేమ్ ఉండటం గమనార్హం .. ఇప్పటి వరకు నాగ చైతన్య ఒక్కసారి కూడా చెప్పక పోవడం ..ఇప్పుడు సమంత చెప్పిందే నిజం కావడం ప్రేక్షకుల్లో ఎంతో బాధని మిగిల్చిందని చెప్పాలి.
మొదటగా అందరు సినిమా ప్రమోషన్ అనుకున్నారు కానీ లాస్ట్ అదే నిజం అయింది అంటున్న అక్కినేని అభిమానులు.

సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అధికారికంగా ప్రకటించారు. చైతూ – సమంత విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఇండస్ట్రీలో చాల రోజులుగా చర్చనీయాంశంగా మారింది. చాల కాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడినట్లు ప్రచారం జరుగుతోంది.

Samantha NagaChaitanya Divorce Confirmed

Samantha NagaChaitanya Divorce Confirmed : సమంత సోషల్ మీడియా ఖాతాలో తన పేరు వెనుక అక్కినేని ఇంటి పేరు తొలగించడం అప్పట్లో పెద్ద దుమారమైంది . సమంత తీసుకున్న నిర్ణయం ఇటు సినీ ఇండస్ట్రీతో పాటు అటు సినీ అభిమానులకు ఆందోళన రేపింది. సమంత – చైతూల మధ్య ఎదో తేడాగా బెడిసికొడుతుందన్న ప్రచారం గుప్పుమంది. సమంత, నాగ చైతన్యల మధ్య వివాహ బంధంకి అడ్డుకట్ట పడిందన్న ప్రచారం సోషల్ మీడియాలోనూ జోరుగా సాగుతోంది.

ఇది ఇలా ఉంటె మొన్నటికి మొన్న చైతూ లేకుండా సమంత తన ఫ్రెండ్స్‌తో కలిసి గోవాకు వెళ్లి వారితో అక్కడ తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత రెండు నెలలుగా చైతూ ఫోటోలు ఏవీ సమంత షేర్ చేయకపోవడం.. ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న వార్తలకు మరింత ఊతమిచ్చింది. సమంతకి ఎంతో ఇష్టమైన తన మామ అక్కినేని నాగార్జున బర్త్ డే వేడుకలకు తను హాజరుకాకపోవడానికి కారణం ఇదేనని మీడియా వర్గాలు తేల్చేశాయి. అయితే ఏ పుకారుపై ఇటు సమంత, అటు చైతూ లేదా నాగార్జున ఫ్యామిలీ నుంచి ఎవరూ కూడా స్పందించలేదు. మొన్న ఆ మధ్య సమంత ఓ ఇంటర్వ్యూలో రిస్ట్రిక్షన్‌లో ఉండటం తనకు ఇష్టముండదని ఇండైరెక్ట్ గా అక్కినేని ఫ్యామిలీపైనే ఈ వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 

READD MORE : 

Samantha will act in the first period film ‘Shakuntalam’

Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా

Previous Post
Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి
Next Post
Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు
Revanth Sounds ‘Jung Siren’:లాఠీ అయినా తూటా అయినా నాకే అన్న రేవంత్ రెడ్డి
Special Story On Kalkuri-Ramulu : సేవే జీవిత లక్ష్యంగా భావించిన మహాఘనుడు

Recent Posts

Menu