Sai Pallavi About LoveStory : ముద్దు సీనుపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

Entertainment, Exclusive, Tollywood
Sai Pallavi About LoveStory

Sai Pallavi About LoveStory :  iRAYSMEDIA – HYDERABAD NEWS

Sai Pallavi About LoveStory : ఈ కాలంలో హీరోయిన్ కావాలంటే గ్లామరస్ పాత్రలు అయినా ముద్దు సీన్లకైనా అంతకు మించిన వాటికైనా ఓకే చెప్పాల్సిందే. ముద్దు సీన్లు ఐతే ఇక ప్రతి సినిమాలో సాధారణమయిపోయాయి. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఇలాంటి వాటికి నిర్మొహమాటంగా నో చెప్పేస్తున్నారు. ఇలా చెప్పే హీరోయిన్లలో మొదటిగా హీరోయిన్ సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫిదా సినిమాతో అందరిని తనవైపుకు తిప్పుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ రోల్స్ కి కానీ ముద్దు సీన్లకు కానీ ఒప్పుకోను అని తెగేసి చెప్పేసింది అంట. తాను ఏదైతే చెప్పిందో అలాగే కట్టుబడి ఉంది.

ఇక మొన్న రిలీజ్ అయినా సాయి పల్లవి, నాగ చైతన్య నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమా రిలీజయిన మొదటి రోజే కాసుల వర్షం కురిపించింది. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి నాగ చైతన్య కి ముద్దు పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. ఒక సీన్లో చైతన్యకి టక్కున ముద్దు పెట్టి, పరుగెత్తుతుంది. ఈ సీన్ కు థియేటర్లో అరుపులు మిన్నంటాయి. దీంతో సాయి పల్లవి కూడా ముద్దు స్కీన్లకి రెడీ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేసారు.

ఈ కామెంట్లకు స్పందిస్తూ సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో లవ్ స్టోరీ సినిమాకు సంబందించిన ముద్దు సీన్ గురించి క్లారిటీ ఇచ్చింది. అయితే తాను ఇప్పడివరకు ఎలాంటి ముద్దు సీన్లు చేయలేదని, ఇక ముందు కూడా చేయను అని స్పష్టం చేసింది. తాను ఏదైనా సినిమా అంగీకరించేముందే ఇలాంటి సీన్లు చేయను అనే విషయాన్ని చెప్పేస్తుంది అంట. ఇక లవ్ స్టోరీ సినిమాలో కూడా పల్లవి నిజంగా చైతుని ముద్దు పెట్టుకోలేదని, ఆలా ముద్దు పెట్టుకున్నట్టు కనిపించడానికి కెమెరా యాంగిల్ ను సెట్ చేసారని చెప్పింది. తనకి ఇలాంటివి చేయడం నచ్చదు అని శేఖర్ కమ్ములకి తెల్సు అందుకే తనని బలవంతం చేయలేదని చెప్పింది. దీంతో సాయి పల్లవి అభిమానులు ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమాల కోసం నగ్నంగా కనిపించడానికి కూడా రెడీ అవుతున్న ఈ కాలంలో ఇలాంటివాటికి డైరెక్ట్ గా నో చెప్తున్న సాయి పల్లవిని పొగిడేస్తున్నారు.

 

READ MORE :

టక్ జగదీశ్ వాళ్ళ విడుదల కానీ శేఖర్ కమ్ముల Love Story :మనసును హద్దుకునేలా ఉన్న శేఖర్ కమ్ముల love story ట్రైలర్

Union Water Power Minister: విజయసాయిరెడ్డి కేంద్ర జల విద్యుత్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్‌ను కలిశారు |Vijay Sai Reddy meets Union Water Power Minister Gajendra Singh Shekhawat

Previous Post
గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం.. ఎక్కడో తెలుసా..!?
Next Post
BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise
గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం.. ఎక్కడో తెలుసా..!?
BIGGBOSS 5 Double Elimination + Wild Card Entry : 4th Week Suprise

Recent Posts

Menu