Revanth Reddy vs Jagga Reddy : రేవంత్ రెడ్డిపై దుమారం రేపి వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి

Revanth Reddy vs Jagga Reddy

Revanth Reddy vs Jagga Reddy : iRAYSMEDIA – HYDERABAD NEWS

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకు రెండు రోజులుగా జరుగుతున్న వివాదానికి తెరపడింది.

Revanth Reddy vs Jagga Reddy : నిన్న ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మాటలు దుమారం లేపాయి అని చెప్పచు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై ఆరోపణ చేసిన విషయం తెలిసిందే. ప్రోటోకాల్ వివాదంలో కావాలనే తన సొంత జిల్లాలో జరిగిన కార్యక్రమానికి తనని ఎందుకు ఆహ్వానించలేదు అని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై ఆరోపణ చేసారు. ఏకంగా పార్టీలో వన్ మాన్ షో కొనసాగుతుందని, ఇలా కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇలాంటి కొత్త ధోరణి కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెడుతుందని ఆరోపణ చేసారు.

ఈ అంశంపై అధిష్టానం సీరియస్ అయ్యింది.

నిన్న రేవంత్ రెడ్డి పై అసంతృప్తి వెళ్లగక్కిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గా రెడ్డి … నిన్న జగ్గా రెడ్డి చేసిన దుమారం సద్దుమణిగింది’
నేడు తనదే తప్పు అంటూ ప్రకటించిన రేవంత్ రెడ్డి.

గాంధి భవన్లో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి, మహేష్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సమావేశమయ్యి మీడియాతో మాట్లాడారు. పార్టీ ప్రతిష్ఠతపై చర్చించామని జగ్గా రెడ్డి తెలిపారు.

నిన్నటి సమస్య సద్దుమనిగింది అన్నాతమ్ములన్నపుడు కొని సమస్యలు ఉంటాయి, మళ్ళి కలిసిపోతామన్నారు జగ్గా రెడ్డి. AICC అధికారులు కొన్ని సూచనలు చేసారని జగ్గా రెడ్డి తెలిపారు.మరో సారి ఇలా మాట్లాడను అని తనది తప్పే అని జగ్గా రెడ్డి వివరణ ఇచ్చారు. ఆర్గనైజ్షన్ పరంగా నేను కొంత మాట్లాడిన కూడా పార్టీ ని కాపాడే బాధ్యత లో అందరి పాత్ర ఉంటది.

డైరెక్షన్ ఠాకూర్ గారిది, కో-ఆర్డినేటర్ మహేష్ గారి సమక్షంలో కొంత నా తప్పు ఉన్నందున, నా తప్పును అడిగారు. మరొక్క సారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని వివరణ ఇచ్చినట్లు జగ్గా రెడ్డి గారు తెలిపారు.  ప్రోటోకాల్ కి సంబంధించి సరైన సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం ఎలా ప్లాన్ చేస్తారని సీనియర్ నాయకులూ చేస్తున్న వ్యాఖ్యలను తాను చేసానని జగ్గా రెడ్డి పూర్తి వివరణ ఇచ్చారు. క్షమాపణ చెప్పి జగ్గా రెడ్డి రెండు అడుగులు వెనకకు వేశారు.

దాదాపు పదేళ్లు అధికారికంగా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిణామాలు మంచివి కావనే ఒక ధోరణిలో, సీనియర్ నాయకులు అందరు కలిసి తాజాగా తెర మీదకి వచ్చిన జగ్గా రెడ్డి వివాదాన్ని పరిక్షరించారు.

 

ఇవి కూడా చదవండి:

వరంగల్ బిట్స్ కాలేజీలో దారుణం : విద్యార్థి మృతి

Cm Kcr Shocking Decision | అన్ని కులాలకు 10 లక్షలు | Dalitha Bandhu Scheme For All Cast

Previous Post
సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు
Next Post
తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : SRIJA scores Top 20 In CIVILS 2021
సంక్రాంతికి అలరించనున్న పెద్ద హీరోల భారీ సినిమాలు
తెలంగాణ యువతీ సివిల్స్ విజయం : SRIJA scores Top 20 In CIVILS 2021

Recent Posts

Menu