Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRSలో తిరుగుబాటు తప్పదన్నరేవంత్‌రెడ్డి

Revanth Reddy Press Meet

Revanth Reddy Press Meet

iRAYSMEDIA

Revanth Reddy Press Meet:హుజూరాబాద్‌ ఉప ఎన్నిక తర్వాత TRS PARTY లో తిరుగుబాటు తప్పదని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు

సోమవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు.తెరాస పార్టీలో తిరుగుబాటును ఎదుర్కోవడానికే
ఈ ప్లీనరీ, విజయగర్జన సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారన్నారు. తెరాస విజయగర్జనకు మించి డిసెంబరు 9న హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఐతే ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగా ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్‌ ఎందుకు ప్రస్తావించాడు అని ఏది దేనికి సంకేతమని రేవంత్ రెడ్డి ప్రస్తావించాడు ప్రశ్నించారు.

‘ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పార్లమెంటు కన్నా 6 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి.వచ్చే 2022 ఆగస్టు 15తో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు కావస్తుంది. ప్రధాని మోదీ డైరెక్షన్‌లో గుజరాత్‌తో కలిసి కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారు’ అని రేవంత్‌ జోస్యం చెప్పారు. హుజూరాబాద్‌ జరిగే ఉప ఎన్నిక ఫలితాల తర్వాత ఏదో ఒక కారణంతో మంత్రి హరీశ్‌రావును కూడా బయటికి పంపుతారని ఆయన చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో BJPకి ఆర్థిక సాయం సర్దుబాటుతో పాటు MIM పోటీపై చర్చలు జరపడంలో మధ్యవర్తిత్వం నెరపడానికి; తనపై కేసులు, దాడులు లేకుండా ఉండడానికి మోదీతో కేసీఆర్‌ ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. SCలకు మూడెకరాలు భూమి ,అలాగే దళితునికి సీఎం పదవి ఇస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేసిన కేసీఆర్‌ నాయకత్వంలో మోత్కుపల్లి నర్సింహులు తెరాసలో చేరడాన్ని ఆయన విమర్శించారు.

READ MORE:

Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు

Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్

Previous Post
Motkupalli Joins In TRS: TRS లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
Next Post
Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ
Motkupalli Joins In TRS: TRS లో చేరిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
Milad UN Nabi Rally-Hyderabad:మిలాద్‌- ఉన్‌- నబీ సందర్భంగా నగరంలో శాంతి ర్యాలీ

Recent Posts

Menu