Revanth Reddy Master Plan:ఇది జరుగుతే రేవంత్ రెడ్డి Next CM

Revanth Reddy Press Meet

Revanth Reddy Master Plan

iRAYSMEDIA

Revanth Reddy Master Plan:

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తగ్గించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేక రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు

రేవంత్ రెడ్డి ప్రధాన ఏకైక లక్ష్యం టిఆర్ఎస్ పార్టీ ని అధికారానికి దూరం చేయడమే
పిసిసి అధ్యక్షుడు కాక ముందు నుంచే రేవంత్ రెడ్డి ఈ విషయంపై దృష్టి సారించారు . ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేపట్టారు. ఇక అప్పుడైతే పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడో తర్వాత నుండి మరింత దూకుడు ఉన్నారు రేవంత్ రెడ్డి . కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు సహకరించినా, సహకరించకపోయినా, టిఆర్ఎస్ పార్టీ ని అధికారానికి దూరం చేయడమే రేవంత్ రెడ్డి ప్రధాన ఏకైక లక్ష్యం గా పనిచేస్తున్నారు. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచిన దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిఆర్ఎస్ లో చేర్చుకున్నారు కెసిఆర్ . అప్పట్లో ఇది పెద్ద సంచలనం ,కానీ ఆ తర్వాత అంతా ఈ వ్యవహారాన్ని మర్చిపోయారు అందరు .

అయితే రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా టిఆర్ఎస్ లో చేర్చుకున్నా అంశంపై ఆయన దృష్టి పెట్టి విమర్శలు చేశారు. ఎవరైతే కాంగ్రెస్ తరుపున గెలిచి కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని రేవంత్ డిమాండ్ కూడా చేశారు. అంతేకాదు రాజీనామా చేయకపోతే , ముందు ముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ హెచ్చరించాడు రేవంత్ రెడ్డి . అయితే కాంగ్రెస్ వదిలి టీఆర్ఎస్ లో చేరిన కొంత మంది ఎమ్మెల్యేలకు TRS పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తితో ఉన్నారు. అటువంటి వారందరినీ కాంగ్రెస్ గూటికి లో చేర్చుకునే వ్యూహంలో రేవంత్ నిమగ్నమయ్యారు. వీరే కాకుండా టిఆర్ఎస్ లో ఉన్న కొంత మంది అసంతృప్తి నేతలను గుర్తించి, వారు కాంగ్రెస్ లో చేరే విధంగా ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమానికి రేవంత్ సిద్ధమవుతున్నారు.

ఐతే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలతోనూ రేవంత్ చర్చలు జరిపినట్టు సమాచారం. అంతేకాకుండా అనేక కారణాలతో కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరిన కీలక నాయకులు అందరిని సొంతగూటికి తెచ్చే ప్రయత్నాలు రేవంత్ నిమగ్నం అయ్యారు ఇలాంటి ఎత్తుగడతో వచ్చే ఎన్నికల వరకు ముందుకు వెళ్తే , తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆశిస్తున్నారు , అలాగే తెలంగాణలో కాంగ్రెస్ కు తిరుగు లేకుండా చేయడంతోపాటు, 2023 ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు సాధ్యం అవుతుందనే లెక్కల్లో రేవంత్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలోనూటీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు అందరిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చే బాధ్యతల్లో రేవంత్ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నారు.

READ MORE:

Operation Huzurabad: ఆపరేషన్ హుజురాబాద్, తెలంగాణలో బిజెపి యాక్షన్ ప్లాన్ | Operation Huzurabad, BJP Action Plan in Telangana

ICC announced Future Plans, 14 teams in World Cup change. 20 teams in T20 Cup

Previous Post
Dravid Appointed Team-India Head-Coach:టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్
Next Post
Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది
Dravid Appointed Team-India Head-Coach:టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్
Huzurabad By-Election Special Story:హుజురాబాద్ ఉప ఎన్నికలో TRS ఇంచార్జిలకు గుబులు మొదలైంది

Recent Posts

Menu