కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ

కొత్త దర్శకుడికి అవకాశం

కొత్త ప్రాజెక్ట్ తో … కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన రవితేజ

తన సొంత పగ్గాలతో స్టార్ హీరోలతో పోటీ పడుతూ, అత్యంత పోటీ ప్రపంచమైన సినిమా పరిశ్రమ లో తనదైన శైలి లో మొదటి నుండి జయ అప జయలను పక్కన పెట్టి చాల వేగంగా సినిమాలు చేస్తూ వచ్చాడు రవి తేజ.

ఈ మధ్య క్రాక్ సినిమా తో జనాలని, అభిమానులని ఊరుతులూగించిన రవి తేజ,
అపుడే మళ్ళి కొత్త సినిమా ప్రాజెక్ట్ తో ఒక కొత్త డైరెక్టర్ ని సినిమా ప్రపంచానికి పరిచయం చేసారు. ఇంతకు ముందు రవితేజ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ లు ఇపుడు స్టార్ డైరెక్టర్లు గా మెగా ఫోన్ తిప్పేస్తున్నారు. ఆలా రవితేజ ‘శరత్ మండవ’ తో నిన్న (13-4-2021) కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు. ‘మజిలీ’ సినిమాతో పరిచయమైన ‘దివ్యాన్ష కౌశిక్’ ఈ సినిమాలో కథానాయికగా అలరించనుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెలలోనే మొదలుపెట్టనున్నారు.

ఉగాది పండుగని పురస్కరించుకొని ఈ సినిమాకి మూహూర్తం పూజ కార్యక్రమం ముగించారు. దేవుడి పాదాల ముందు రవితేజ క్లాప్ కొట్టగా, దర్శకుడు శరత్ మండవ ఆక్షన్ అని చెప్పారు.
ఈ సినిమా కి ‘సామ్ సీ ఎస్’ సంగీతాన్ని సమకూర్చారు. అలాగే సత్య సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Previous Post
శ్రీ ప్లవ నామ సంవత్సరం రాశి ఫలాలు!!!
Next Post
Do you know how petrol and diesel rates are in Telugu states ..?
శ్రీ ప్లవ నామ సంవత్సరం రాశి ఫలాలు!!!
Do you know how petrol and diesel rates are in Telugu states ..?

Recent Posts

Menu