పరమత సహనం – పంజాబీ ఔన్నత్యం! అభినందనల వెల్లువ

పరమత సహనం - పంజాబీ ఔన్నత్యం!

పరమత సహనం – పంజాబీ ఔన్నత్యం

అభినందనల వెల్లువ

పరమత సహనం అనేది పనికిరాని పదంగా ప్రస్తుతం సమాజం వ్యవహరిస్తోంది. ఎవరి మతాన్ని వారు అభిమానించడంలో తప్పులేదు. కాని ఇతరుల మతం విషయంలో వ్యతిరేకత, విద్వేష భావాలు తారాస్థాయిలో విస్తరిస్తున్నాయి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా పంజాబ్ లో ఒక వ్యక్తి తన ఉన్నత మానసిక స్థితిని ఆచరణలో చూపించాడు. అక్కడక్కడ ఇలాంటి ఉదాహరణలు కనిపిస్తున్నా విద్వేషాలే ఎక్కువగా సమాజాన్ని కలుషితం చేస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో పంజాబ్ లోని మోగా, మలేర్ కోట జిల్లా పరిసరాలలో ఇతర మతాలకు సముచిత గౌరవం ఇచ్చిన సంఘటనలు వెలుగు చూశాయి. సిక్కులు, ముస్లింల మధ్య ఏర్పడిన సత్సంబంధాలు, సామరస్య బంధాలు దేశప్రజలందరికీ ఆదర్శంగా నిలిచాయి.

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే – ఈ రెండు జిల్లాలలో మలేర్ కోట జిల్లా ఇటీవలే కొత్తగా ఏర్పాటైంది. ఇక్కడ ఎక్కువగా సిక్కులు నివసిస్తుంటారు. ఇక్కడ ముస్లింలకు మసీదు నిర్మాణం అవసరమైంది. వారికి ఒక సిక్కు వ్యక్తి అండగా నిలిచాడు. ఆయన తనకు వారసత్వంగా వచ్చిన భూమిని మసీదు నిర్మాణానికి వీలుగా భూదానం చేశాడు. ఏడుగురు ముస్లిం పెద్దలకు ఆ మేరకు పత్రాలు అందించాడు. మోగా జిల్లాలోని సిక్కులు సమీపంలో మసీదు నిర్మాణానికి అవసరమైన భూమి పూజ జరిగింది. అందులో విశేషం లేదు. కానీ అక్కడి సిక్కులు స్నేహభావంతో తమ గురుద్వారా వేదికగా అందించారు.

ఈ విషయాన్ని మోగా జిల్లా భలూరు గ్రామ సర్పంచి అయిన పాలా సింగ్ వెల్లడించారు. జూన్ 13వ తేదీన భూము పూజ జరిగింది. వంద సంవత్సరాల నాటి శిధిల మసీదును పునర్నిర్మించేందుకు ఎకరంన్నర వైశాల్యం ఉన్న మసీదు ప్రాంగణంలో ఈ భూమి పూజ చేయాల్సి వచ్చింది. అనుకోకుండా ఆ రోజు భారీగా వర్షం కురవడం మొదలైంది. వర్షం పడుతున్న కారణంగా ముస్లిం పెద్దలు స్థానిక గురుద్వారా శ్రీ సత్సంగ్ సాహిబ్ పెద్దలను ఆశ్రయించారు. భూమి పూజ కార్యక్రమం అక్కడే సజావుగా సాగిపోయింది. విషయం తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అవసరమైన అన్ని ఏర్పాట్లలోనూ ముస్లింలతో సమానంగా తమ వంతు శ్రమదానం చేశారు. అక్కడి వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. దాదాపు రూ. 2 లక్షల మేరకు నిధులు సేకరించారని ఆయన మీడియా మిత్రులకు తెలిపారు.

నిజానికి అక్కడి ప్రజలెవరికీ మసీదు ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. కానీ దేశ విభజన నాటికే ఆ మసీదు అక్కడ ఉండేదని విశ్వసిస్తారు. దేశ విభజన కాలంలో పంజాబ్ ప్రజలు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో బాధలు పడ్డారు. కానీ ఇప్పుడు అంతా కలిసి మెలసి జీవించాలనే ఆకాంక్ష ఇక్కడి ప్రజలలో బలంగా ఉంది. ప్రస్తుతం దేశంలో విస్తరిస్తున్న మత విద్వేషాలు మమ్మల్నిమరింతగా బాధిస్తున్నాయని ఆయన వివరించారు. పూర్వపు ప్రేమాభిమానాలను మాలో మేము తిరిగి పెంపొందించుకోవాలని ఆశించాం మైనారిటీలపై దాడులు కొనసాగిస్తే ఇండియాకు, పాకిస్తాన్ కు ఉన్న తేడా ఏమిటని ఆయన ప్రశ్నించారు. వారి మత విశ్వాసాల ప్రకారం ప్రార్థనలు చేసుకునే హక్కు ముస్లింలకు కూడా ఉంది కదా ఆయన నిలదీశారు. వారంతా మన సమాజంలో మనతో పాటే సహజీవనం చేస్తున్న వారే కదా ఆని ఆయన తన సుహృద్భావాన్ని వ్యక్తంచేశారు.         స్థానికంగా నివసించే మరో వ్యక్తి అన్వర్ ఖాన్ మాట్లాడుతూ “మొహమ్మదీ మసీదుగా వ్యవహరించే ఈ మసీదు పునర్నిర్మాణం గురించి 2008 నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. నిధుల కొరత సమస్యగా మారింది. ఇప్పుడు నిధులు సమకూరినాయి. ఇక పని చురుకుగా పూర్తి చేస్తాం. ” అన్నారు.

గమనించవలసిన మరో అంశం ఏమిటంటే గత ఏడాది నవంబర్ 26 నుంచి ఢిల్లీ సమీపంలో జరిగిన రైతుల ఉద్యమ సమయంలో కూడా ఈ గురుద్వారా రైతులందరికీ భోజన వసతి కల్పించింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతకుముందు పౌరసత్వ చట్టం విషయంలో జరిగిన ఉద్యమ సమయంలో మలేరు కోట ముస్లిం ప్రతినిధి వర్గం వెళ్లి స్వర్ణ దేవాలయం నిర్వాహకులు అకల్ తఖ్త్ అధికార ప్రతినిధి జ్ఞానీ హర్ ప్రీత్ సింగ్ ను కలిసి ఆయన మద్దతు కోరారు. ఆ సమయంలో అక్కడి నుంచి బయటకు వచ్చే సమయానికి ముస్లింల మధ్యాహ్న ప్రార్థనల సమయం వచ్చేసింది. అది గమనించిన గురుద్వార నిర్వాహకుల అనుమతితో స్వర్ణ దేవాలయం ప్రాంగణంలోనే ముస్లిం ప్రతినిధి వర్గం తమ ప్రార్థనలను పూర్తి చేసుకుంది.

Know more about remarks made by Kapil Sibal in support of the Congress party.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
Shock to the winner of the Google Doodle competition. Sundar Pichai did video call
Next Post
గంగా నదీ జలాల్లో నవయుగ ‘సీత’ !
Shock to the winner of the Google Doodle competition. Sundar Pichai did video call
గంగా నదీ జలాల్లో నవయుగ ‘సీత’ !

Recent Posts

Menu