POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ

Breaking News, Exclusive, Sandalwood
PUNEETH RAJ KUMAR BIO

పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ : POWER STAR PUNEETH RAJ KUMAR BIO – iRAYSMEDIA HYDERABAD NEWS

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం ఇటు సిని పరిశ్రమను అటు సినీ అభిమానులను శోక సంద్రములో ముంచేసింది.

POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ తండ్రి కన్నడ సూపర్ స్టార్ అయిన రాజ్‌ కుమార్. పునీత్ రాజ్ కుమార్ మార్చ్ 17న 1975లో జన్మించాడు. ఆయన అసలు పేరు లోహిత్ రాజ్ కుమార్. సినిమాల్లోకి వచ్చాక పునీత్ గా పేరు మార్చుకున్నారు.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ నటవారసుడిగా 1985లో ‘బెట్టాడు హూవి’చిత్రంతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు పునీత్ రాజ్కుమార్ , ఉత్తమ బాలనటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు. దాదాపు 14 సినిమాల్లో బాలనటుడిగా నటించారు పునీత్ రాజ్ కుమార్. పునీత్ పుడుతూనే స్టార్. ఎదుగుతున్న క్రమంలోనే తండ్రి లాగా కన్నడనాట గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్ స్టార్ గా మారడానికి పునీత్ చాలా కష్టపడ్డాడు. అతని జీవితం క్రమశిక్షణతో సాగింది.

2002లో కన్నడ చిత్ర పరిశ్రమలోకి పునీత్ అప్పు అనే చిత్రంతో హీరోగా అడుగుపెట్టారు. ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ చిత్రం కన్నడలో ఓ ఊపు ఊపేసింది అనే చెప్పాలి. ఆ సినిమాతోనే పునీత్ సూపర్ స్టార్ గా మారాడు. అనంతరం 2003లో అభి చిత్రం, 2004లో వీర కన్నడిగ మరియు మౌర్య, 2005 లో ఆకాష్, 2006 లో అజయ్, 2007 లో అరసు,2007 లో మిలానా, 2008 లో వంశీ వంటి భారీ హీట్ లను సొంతం చేసుకుని వెండితెర మీద తిరుగులేని స్టార్ నిలిచారు.

పునీత్ తన కెరీర్ లో ఎక్కువ శాతం మాస్ సినిమాలే ఎంచుకున్నారు. అతను ఎంచుకున్న అద్భుతమైన సినిమా కథల వలనే అతను అవార్డ్స్ అందుకున్నారు. కన్నడ నాట అత్యథిక కలెక్షన్లు సాధించిన హీరోగా అలాగే అత్యథిక పారితోషికం అందుకున్న హీరోగానూ రికార్డ్ సృష్టించారు. 20 ఏళ్ల తన సినీ ప్రయాణంలో 29 సినిమాలు చేశారు పునీత్‌. చివరగా యువరత్న సినిమాలో నటించారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకి అందని ఘనతను ఆయన అతి కొద్దీకాలంలోనే పునీత్ రాజ్ కుమార్ కు దక్కించుకున్నారు. ఆయన చిత్రాలన్ని కన్నడలో సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి.

పునీత్ రాజ్ కుమార్ బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటుడుగానే ఆగలేదు. ఆయనకు పాటలు పాడటం కూడా చాలా ఇష్టం. పునీత్ ఆరేళ్ళ వయసు నుండే సినిమాల్లో పాటలు పడేవారు. ఆయన మొదటగా 1981లో భాగ్యవంత చిత్రంలో రెండు పాటలు పాడాడు. ఆయన ఇతర హీరోల సినిమాల్లో కూడా పాటలు పాడి గాయకుడిగా పలు అవార్డులను అందుకున్నారు.

పునీత్ రాజ్ కుమార్ హీరోనే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు చేసారు. 2019లో కవలుదారీ చిత్రానికి మొదటిసారిగా నిర్మాతగా వ్యవహరించి విజయాన్ని అందుకున్నారు. అనంతరం పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి విజయాన్ని అందుకున్నారు. పునీత్ సిల్వర్ స్క్రీన్ మీదనే కాకుండా స్మాల్ స్క్రీన్ లో కూడా పలు షో లకు హోస్ట్ గా వ్యవహరించారు. కన్నడంలో ప్రసారమైన..కన్నడద కొట్యాధిపతి (మీలో ఎవరూ కోటిశ్వరులు) షో కు రెండు సీజన్స్ ల్లో హోస్ట్ గా వ్యవహరించారు మరియు యూపీ స్టార్టర్స్ కు జడ్జిగా వ్యవహరించాడు.

సినిమాలు, టీవీ షోలే కాదు తన తల్లి పార్వతమ్మతో కలిసి అనేక సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. కొన్ని బ్రాండులకు ప్రచార కర్తగా కూడా వ్యవహరించారు. IPLలో ROYAL CHALLENGERS BENGALURU టీమ్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నాడు.

పునీత్1999న డిసెంబర్ 1న అశ్విని రేవంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం అశ్విని రేవంత్ కన్నడ పరిశ్రమలో ప్రొడ్యూసర్‌గా మరియు అనేక సినిమాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కూడా పని చేశారు. వీరిద్దరూ పీఆర్‌కే ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సినిమాలను నిర్మించారు. 20 ఏళ్ల వారి బంధాన్ని చూసి విధికి వీరిని వెక్కించింది, పునీత్‌ అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పునీత్ ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిద్దాం.

 

READ MORE : 

Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు

Chalo Raj Bhavan: చలో రాజ్ భవన్: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిగా నేను ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాను | I assure the government as TPCC President Revanth Reddy

Previous Post
Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు
Next Post
Huzurabad By Poll Update:హుజురాబాద్ ఉప ఎన్నికలో వివి ప్యాట్ కలకలం
Puneeth Rajkumar Suffers Heart-Attack:కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు
Huzurabad By Poll Update:హుజురాబాద్ ఉప ఎన్నికలో వివి ప్యాట్ కలకలం

Recent Posts

Menu