PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినం.

Breaking News, National
PM NARENDRA MODI BIRTHDAY

PM NARENDRA MODI BIRTHDAY : నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం.

భారత దేశ ప్రధాన మంత్రి అయినా నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17 తో 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రధాని నరేంద్రమోదీ పుట్టిన రోజు సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుండే వేడుకలు మొదలయ్యాయి.

బీజేపీ అభ్యర్థులు ఉత్సహంతో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజెసి ఆనందంతో భారీ కేకులను కట్ చేసారు.

PM NARENDRA MODI BIRTHDAY

మోదీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సొంత నియోజకవర్గమైన వారణాసిలో అర్ధరాత్రి సంబరాలు అంబరాన్ని అంటాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు భారత మాత ఆలయంలో 71 వేల దీపాలను వెలిగించి, 71 కిలోల లడ్డును కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా “కాశీ సంకల్ప్” అనే పుస్తకాన్ని కూడా విడుదల చేసారు. ఈ వేడుకల్లో బీజేపీ ఎంపీ రూప గంగూలీ, బిహెచ్యూ మాజీ వీసీ జిసి త్రిపాఠి పాల్గొన్నారు..

PM NARENDRA MODI BIRTHDAY : మధ్యప్రదేశ్ లోని భూపాల్ లో లాల్ఘాటి చౌరహాలో బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 71 అడుగుల పొడవైన వాక్సిన్ ఆకారంలో ఉన్న కేక్ను కట్ చేసారు.

PM NARENDRA MODI BIRTHDAY

ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు, రేషన్ కార్డుల పంపిణి, నదులను శుభ్రం చేసే కార్యక్రమాలతో పాటు కరోనా వాక్సినేషన్ లాంటి పనులను చేపట్టారు. ప్రధాని పుట్టినరోజు సందర్భంగా నేటినుండి 20 రోజుల పాటు “సేవా ఔర్ సమర్పణ్ అభియాన్” పేరుతో బీజేపీ ఈ కార్యక్రమాలను చేపట్టింది. ఈ వేడుకలు వచ్చే నెల అక్టోబర్ 7వ తేదీతో ముగిస్తున్నాయి.

ఈ క్రిందివి కూడా చదవండి :

PM-KISAN: PM-KISAN పథకం, అర్హత & ప్రయోజనాలు PM మోదీ 9 వ విడత విడుదల చేసినందున | PM-KISAN Scheme, Eligibility & Benefits as PM Modi Releases 9th Installment

Minister Harish Rao: హుజూరాబాద్‌లో మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు | Minister Harish Rao sensational remarks in Huzurabad

Previous Post
Hyderabad Rape Victim News : రాజుకి తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా..!??
Next Post
దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!
Hyderabad Rape Victim News : రాజుకి తలకొరివి పెట్టింది ఎవరో తెలుసా..!??
దేవిశ్రీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది..!!

Recent Posts

Menu