PlayBoy Model JU ISEN : 15 వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం

Breaking News, Entertainment, World
PlayBoy Model JU ISEN

PlayBoy Model JU ISEN : iRAYSMEDIA – HYDERABAD NEWS

PlayBoy Model JU ISEN : 15వేల కోట్ల ఆస్తిని దక్కించుకున్న శునకం

కుక్కలకి ఉన్న విశ్వాసం మనుషులకు ఉండదనే సామెత మనం చాలాసార్లు విన్నాం. అలాంటి సంఘటనలు కూడా చాలా వరకు నిజమయ్యాయి. కొంత మంది యజమానులు మాత్రం పెంపుడు కుక్కలని తమ పిల్లలుగా భావించి వాటికీ తిన్పించడం, పుట్టిన రోజు వేడుకలు చేయడం ఇలా చేస్తుంటారు. మొదట్లో ఇది విదేశాల్లో ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు భారత దేశంలో కూడా ఇలాంటివి చూస్తుంటాం. వాటికీ స్కిన్ కేర్, ఆసుపత్రిలో రెగ్యులర్ చెకప్, వాకింగ్ దగ్గర నుండి మనుషులకు ఏవైతో అవసరం ఉన్నాయో అవన్నీ తమ పెంపుడు కుక్కలకి కూడా చేస్తుంటారు. వాటికి కొత్త రకమైన బట్టలు కుట్టించి అందంగా అలంకరిస్తారు కూడా.

తాజాగా ఒక మోడల్ జు ఐసెన్ తన పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను వినూత్నంగా తెలిపింది. తన పేరు మీద ఉన్న 15 కోట్ల ఆస్తిని పెంపుడు కుక్క అయిన ఫ్రాన్సిస్కో కు రాసింది.

ఇక వివరాల్లోకి వెళితే ప్రముఖ మోడల్ అయిన జు ఐసెన్ కు పిల్లలు లేనందున ఆమె ఒక పెంపుడు కుక్కను పెంచుకుంది. దాని విశ్వాసానికి ప్రతీకగా తన సంపాదనని పెంపుడు కుక్క ఐన ఫ్రాన్సిస్కోకి రాసిస్తున్నాను అని అధికారికంగా ప్రకటించింది. ఈ విషయమై ఆమె ఫ్రాన్సిస్కో లాయర్ ని సంప్రదించి తన తదనంతరం తన ఆస్తిని శునకానికే అంటూ చట్టబద్దమైన వీలునామా రాసింది. దీంతో ఒక్కసారిగా ఆ శునకం అధికారి అయిపోయింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడింది అని, ఇక భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు తనకు పిల్లలు లేనందున తాను సంపాదించిందంతా తన పెంపుడు కుక్కకు తన ఆస్తిని ఇచ్చి తన ప్రేమను చాటుకోవాలి అనుకుంది. తన కుక్కకి తన సంపాదించిన డబ్బు మంచి జీవితాన్ని ఇస్తుందని తెలిపింది. ఇక తన కుక్క బ్రతికినంత కాలం దాన్ని ప్రేమగా పెంచుకుని, కాపాడిన వారికి ఆస్తిని అనుభవించే హక్కు కూడా ఉంటుందని ఆమె తెలిపారు.

జు ఐసెన్ తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా తన పెంపుడు కుక్కతో ఉన్న ఫోటోలను తెగ షేర్ చేస్తుంది. ఈమె రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి సర్జరీ చేసుకుంది. తన మోడలింగ్ లో మరింత అందంగా ఆకర్షణీయంగా కనిపించడానికి తాను ఈ సర్జరీ చేపించుకుంది అని తెలిపింది.

Previous Post
మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Next Post
Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు
మెగా అభిమానులకు శుభవార్త : ఆచార్య రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Tamil-Nadu CM MK-Stalin Convoy: సీఎం ఎంకే స్టాలిన్‌ కాన్వాయ్‌లో వాహనాల సంఖ్య కుదింపు

Recent Posts

Menu