పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఒకేసారి ౩ సినిమాలతో అలరించనున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : iRAYSMEDIA – HYDERABAD NEWS

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో భారీ సినిమా రాబోతుంది అన్న విషయం మన అందరికీ తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఆ సినిమా పేరును భవదీయుడు భగత్ సింగ్ అనే అధ్బుతమైన పవర్ ఫుల్ టైటిల్ ను ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా

ఈ సినిమాకు సంబందించి మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాని వచ్చే నెల అంటే అక్టోబర్ 15న దసరా పండుగ రోజు లాంఛనంగా షూటింగ్ ప్రారంభిస్తామన్న వార్త చక్కర్లు కొడుతుంది. స్క్రిప్ట్ పని పూర్తైన ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ఆఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అందుకు గాను ఇప్పుడు వచ్చే సినిమా మీద అంతే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, అందులో ఒక పాత్ర లెక్చరర్ గా కనిపించనున్నారు కొన్ని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా : ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్టైన అయ్యప్పనుమ్ కోషియమ్ అనే సినిమాను రీమేక్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమా లో దగ్గుబాటి రానా కూడా హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలను త్రివిక్రమ్, డైరెక్టర్ గా సాగర్, సంగీత దర్శకుడిగా థమన్ వ్యవహరించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ ఐన నిర్మాణ సంస్థ భీమ్లా నాయక్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం యొక్క టైటిల్ సాంగ్ ను ఇటీవలే యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి ఆదరణ పొందింది.

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా

ఈ రెండు సినిమాలు కాకుండా పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇందులో స్పెషల్ రోల్ లో జాక్వలైన్ ఫెర్నాండెజ్ కనిపించనున్నారు అని టాక్. ఈ సినిమా 2022 సమ్మర్ కానుకగా తెరకెక్కనుంది.

పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా

READ MORE :

Pawan Kalyan fans in Pakistan: పాకిస్థాన్‌లో పవన్ కళ్యాణ్ అభిమానులు | Pawan Kalyan fans in Pakistan

Pawan Kalyan Twitter Tweets-పవన్ కల్యాణ్‌ vs ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్‌ వార్ – iraysmedia

Previous Post
IPL చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు : BCCI కీలక నిర్ణయం
Next Post
HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం
IPL చరిత్రలో తొలిసారి ఒకే రోజు ఒకే సమయానికి రెండు మ్యాచ్ లు : BCCI కీలక నిర్ణయం
HYDERABAD GHMC NEWS TODAY : హైదరాబాద్ లో మరో మరణం

Recent Posts

Menu