Pawan Kalyan New House : మరో కొత్త బంగ్లా కొన్న పవన్ కళ్యాణ్ ధర ఎంతో తెలుసా

pawan kalyan new house

Pawan Kalyan New House,HYDERBAD NEWS,iRAYSMEDIA

సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ఏపీ రాజకీయాలన్నీ పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఏం మాట్లాడినా.. సంచలనమే అవుతోంది. కొద్దిరోజులగా
నిత్యం ఎదో ఒకరకమైన రాజకీయపరమైన అంశాలతో వార్తల్లో నిలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు.

Pawan Kalyan New House:అయితే ఇప్పుడు మరో కొత్త అంశంతో వార్తల్లోకెక్కారు.హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌ ప్రాంతంలో  పవన్ కళ్యాణ్  కొద్దీ రోజుల క్రితం ఓ బంగ్లాను కొనుగోలు చేశారు. రూ. 12 కోట్లు తో 676 గజాల విస్తీర్ణంలో ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్టు Zapkey.com సంస్థ వెల్లడించింది. ఈ కొనుగోలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 23, 2021న జరిగింది.

ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు స్టాంప్ డ్యూటీ రూ 66 లక్షలు ,అలాగే ట్రాన్స్‌ఫర్ డ్యూటీ రూ 18 లక్షలు , రిజిస్ట్రేషన్ రుసుము రూ 6 లక్షలు , మ్యూటేషన్ ఛార్జీల నిమిత్తం మరో రూ. 1.20 లక్షలు వెచ్చించినట్టు డాక్యుమెంట్‌లో ఉంది. మొత్తం 6350 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలోని బంగ్లాను రూ. 12 కోట్లకు కొనుగోలు జరిగినట్లు డాక్యుమెంట్లలో ఉంది. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

READ MORE:

Allu-Arjun Pushpa Release Date:అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

Previous Post
Allu-Arjun Pushpa Release Date:అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్
Next Post
Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా
Allu-Arjun Pushpa Release Date:అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్
Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా

Recent Posts

Menu