కరోనా బీభత్సం!! కుంగిపోతున్న వైద్య సిబ్బంది స్థైర్యం

కరోనా బీభత్సం

కరోనా బీభత్సం!! కుంగిపోతున్న వైద్య సిబ్బంది స్థైర్యం: ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది మారణహోమం సృష్టించిన కోవిడ్ 19 కరోనా వైరస్ భారత దేశాన్ని మరోసారి అతలాకుతలం చేస్తోంది. పెద్ద పట్టణాలు, నగరాలు, పల్లెలు అని ఏ తేడా లేకుండా కరోనా మహమ్మారి వ్యాపించి జనజీవనాన్ని అల్లకల్లోలం చేస్తోంది. అటు ప్రాణాలకు భరోసా లేకపోగా మరో పక్క అసలే అంతంతగా ఉన్న ఆదాయంతో పాటు కాస్తోకూస్తో దాచి ఉంచుకున్న కొద్ది పాటి సొత్తును కూడా వైద్య ఖర్చులు హరించేస్తుంటే, సామాన్య మానవుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. రోగం ఎటు నుంచి మీద బడుతుందో తెలియదు. చికిత్స ఏమిటో తెలియదు. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లినా ఎక్కడ ఏ రూపంలో అంటుకుంటోందో అర్థం కావడం లేదు. గత ఏడాది అంతా బిక్కుబిక్కుమంటూ రోజులు గడిపిన ప్రజలను మరోసారి ఉప్పెనలా మీద పడిన కరోనా వైరస్ తికమకపెడుతోంది. వ్యాధి రాకుండా అంటూ వ్యాక్సీన్లు  వచ్చేశాయని సంబరపడినంత సమయం పట్టలేదు. వాటికి విపరీతమైన కొరత ఏర్పడింది. అసలు టీకా అందుతుందో లేదో తెలియదు. చచ్చీ చెడి ఒకసారి టీకా వెయించుకుంటే చాలదంటారు. రెండో డోస్ అందడం మరింత గగనంగా మారిపోయింది. ప్రాణ రక్షణకు అవసరమైన మందులు నల్ల బజారు చేరుతున్నాయి. టీకాలే అడ్డదారిన పడుతుండగా మందులు వెళ్లడం ప్రాణాలకు బరోసా లేని స్థితి. ఇవన్నీ సమస్యకు ఒక వైపయితే ఏ అనారోగ్యమైనా సరే అది కరోనా వైరస్ ప్రభావమే కానీ, మరే ఇతర క్లిష్ట స్థితి అయినా సరే ఆసుపత్రులకు వెడితే అక్కడ పడకలు లేవు. పడకలు ముందు సంపాదిస్తే కానీ రోగులను ఆస్పత్రి ఆవరణలోకి కూడా రానీయడం లేదు. ఇంట్లో వైద్యం మరింత భారంతో కూడిన వ్యవహారం. ఇది జనాల గోల.

మరో పక్కన కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి రాత్రి పగలు అని లేకుండా నిర్విరామంగా వైద్యులు, వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. లక్షల సంఖ్యలో మీదపడిపోతున్న బాధితులను ఎలా కాపాడాలో అర్థం కాని అయోమయం వారిది. పడకలు లేవు. మందులు లేవు, ఆక్సిజన్ లేదు. సిబ్బంది ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. వారిలో వందల సంఖ్యలో ప్రాణాలనే పోగొట్టుకుటున్నారు. ఒకసారి కాదు. మళ్లీ మళ్లీ కరోనా బారిన పడుతున్నారు. కాస్త కోలుకోగానే మళ్లీ వైద్యులుగా తమ వంతు బాధ్యతలు చేపడుతున్నారు. తమ ప్రాణాలకు భరోసా లేదు. తమ కుటుంబాలకు రక్షణ లేదు. వైద్య సిబ్బంది బాధలను వెల్లడించాలంటే అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పడం చాలా కష్టం.

క్లుప్లంగా చెప్పాలంటే — ఒక వైపు కళ్ల ముందే రాలిపోతున్న ప్రాణాలు, విరామం లేకుండా గంటల కొద్దీ విద్ధి నిర్వహణ, వైద్యం చేయడానికి కావలసిన వనరులు చాలా పరిమితం, మందులు ఉండవు, ఆక్సిజన్ ఉండదు. బెడ్ లు ఉండవు. ఎన్నో సందర్భాలలో ఆశ లేకున్నా రోగికి, వారి కుటుంబీకులకి అబద్ధమని తెలిసినా ఆశ కల్పించేలా మాట్లాడడం ఎంతో బాధ మిగులుస్తోంది.  ప్రతి క్షణం ప్రాణాంతకమైన కరోనా వైరస్ బాధితులకు సేవలు అందించవలసి రావడం, కుటుంబాల గురించి ఆలోచించే తీరిక లేకపోవడం. వెరసి వైద్య సిబ్బంది మానసికంగా కుంగిపోతున్నారు. వారిలో కొందరు మానసిక వైద్యులను ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అంటే వాళ్లే పిచ్చాళ్లయిపోతున్నారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన యువ వైద్యురాలు తన పరిస్థితిని ఇలా వివరించారు. ఇంటికి వెళ్లిన తరువాత కరువుతీరా ఏడవడం నేను చేసే మొదటి పని. పనిచేసే చోట వైద్య పరికరాల సంగతి అలా ఉంచి తాగడానికి మంచి నీరు కూడా లేదు. ఇహ ఆక్సిజన్ గురించి వేరే చెప్పనక్కరలేదు. బాధపడుతున్న పేషెంట్లను ోపిగ్గా పడుకోమని చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాం. ఊపిరి అందక వారు విలవిలలాడుతుంటే ఎలా సముదాయించాలో ఎలా చికిత్స అందించాలో అర్థం గాక మాటలు దిగమింగుకుని కళ్లప్పగించి చూస్తున్నాం. చివరికి నాలో రగిలిపోతున్న మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం యాంటీ యాంక్జయిటీ మాత్రలు వాడవలసి వస్తోంది. మానసిక వైద్యుడిని సంప్రదించాలనుకుంటున్నాను. ఇంటికెడితే నా వల్ల ఇంట్లో వారికి హాని తీసుకు వస్తున్నానా అని ఆందోళన. మా జీవితాల్లో ఎక్కడా మనశ్శాంతి కనిపించడం లేదు.

బెంగుళూరుకు చెందిన ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మరో మహిళ తన అనుభవాలను ఇలా వెల్లడించింది. లేబర్ రూమ్ విధుల్లో ఉంటారామె. కొద్ది రోజుల క్రితం ఒక రోగి కరోనా పాజిటివ్ అని తేలింది. కనీసం పీపీఈ కిట్ కూడా లేదు. అయినా ఆ రోగికి అవసరమైన సేవలన్ని మొత్తం రోజంతా చేయాల్సి వచ్చింది. మనసంతా భయం భయంగా మారిపోయింది. ఇంటికెడితే పసి బిడ్డ, వృద్ధురాలైన తల్లి వారి యోగక్షేమాల గురించిన బెంగ. గతి లేక చెల్లెలికి ఫోన్ చేసి తల్లిని, తన బిడ్డను తీసుకెళ్లిపోవాలని కోరక తప్పలేదు. ఇక తనకు జరిగిన పరీక్ష ఫలితం కోసం ఎదురుచూడడం భయానకం. ప్రతి క్షణం తప్పు చేసిన భావన. తన స్థితిపై కోపం. అర్థం లేని ఉక్రోషం. పాజిటివ్ గా నిర్ధారణ అయిన రోగికి సేవ చేసేప్పుడు మాత్రమే పీపీఈ కిట్ వాడాలని యాజమాన్యం ఆదేశాలు. నేను సేవలందించిన పేషెంటుకు పరీక్ష ఫలితం వెల్లడయ్యే వరకు దగ్గరే ఉండి సేవ చేయాల్సి వచ్చింది. అంటే పీపీఈ కిట్ లేకుండానే. మాస్కులను, చేతులను కూడా మళ్లీ మళ్లీ శానిటైజ్ చేసుకుంటున్నా ధీమా అయితే లేదు. మాస్కలను కూడా మేమే శుభ్రం చేసుకోవలసి వస్తోంది.

కోలకతాలోని ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్న మరొకరు ఇలా చెప్పారు. మా ఆసుపత్రి నిజానికి అన్ని సౌకర్యాలతో ఉన్నదే. అయినా కూడా ఒకొక్కప్పుడు మాలో నిస్సహాయత, నిస్పృహ, నిరాశ వెల్లువలా ఉప్పొంగుతుంటాయి. కారణం ఆమె ఐసీయులో పనిచేస్తున్నారు. అందువల్ల పెషెంట్ల చివరి క్షణాల్లో ఏం చేయాలో తెలియక నిస్సహాయంగా చూస్తూ ఉండక తప్పడం లేదు. ముందు రోజు ఎంతో హుషారుగా పలకరించిన వారు, తమ కుటుంబ సభ్యులతో కబుర్లు చెప్పిన వారు ఇక లేరన్న విషయం గమనించగానే గుండెలు జారిపోతాయి. ఇటీవల రోజుకు పది నుంచి పన్నెండు మంది చనిపోతుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. నిద్రపోవాలన్నా భయమేస్తోంది.

మరోక వైద్య సిబ్బంది మాటల్లో … అప్పుడే ఆ 20 ఏళ్ల యువకుడికి కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అందించి వచ్చాను. పది నిముషాల తరువాత చూస్తే హార్ట్ ఎటాక్. ఆతడి ఊపిరి ఆగిపోయింది.గత 13  నెలలుగా ఆమె దినచర్య ఎలా సాగుతోందంటే … ఉదయం 3.30 కి నిద్ర నుంచి లేవడం, ఇంట్లో వాళ్లకి వంటా. టీఫినూ సిద్ధం చేసి 7 గంటలకు ఆస్పత్రికి చేరడం … పీపీఈ కిట్ మాస్క్ వేసుకోవడం … అంతే. మళ్లీ రాత్రి ఇంటికి చేరేవరకూ రోగుల ఆలనా పాలనా. ఇంటికి చేరిన తరువాత తూడా అప్పటి వరకు తాను ఉపయోగించిన దుస్తులు, హ్యాండ్ బ్యాగ్, వాటర్ బాటిల్ వంటివాటిని మరుగుతున్న నీళ్లలో వేసి శుభ్రం చేసుకోక తప్పదు. ఆ తరువాతే ఎవరినైనా పలకరించడం …. కరోనా బీభత్సం!! కుంగిపోతున్న వైద్య సిబ్బంది స్థైర్యం

ఇది వైద్యుల పరిస్థితి. ఇక నర్సులు, రేడియోగ్రాఫర్లు, లాబ్ టెక్నీషియన్లు, అనస్థీటిస్టులు, వైద్య విద్య అభ్యసిస్తూ తమ వంతు సేవలు అందిస్తున్న వారు ఇలా ప్రతి ఒక్కరూ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారు. వారిలో నిద్ర పట్టక బాధ పడుతున్న వారు చాలా మందే. వారిలో నిస్సత్తువ సమస్యగా మారింది. వరదలా వస్తున్న బాధితులు, కళ్ల ముందే రాలిపోతున్న మరణాలు, అందుబాటులో అంతంత మాత్రంగానే ఉన్న వనరులు, కుటుంబ భద్రత గురించిన ఆందోళన వారిలో కూడా నిరాశ నిస్పృహలనే తెచ్చి పెడుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మానసిక వైద్యులు ఒకరు అంగీకరించారు. చాలా మంది తమ సమస్యను బయటికి చెప్పి వైద్య సలహా తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. వారికి ధైర్యం చెప్పాల్సి ఉంది. నిజానికి వైద్య విద్యలో భాగంగా ఎలాంటి పరిస్థితిలోనూ ఆందోళన చెందకూడదని శిక్షణ ఇస్తారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితిని అయిన భరించాల్సిందే. పంటి బిగువన అయినా సరే ముందుకు సాగాల్సిందే. కరోనా బీభత్సం!! కుంగిపోతున్న వైద్య సిబ్బంది 

Also Read: డబుల్ మాస్క్ అవసరమా? కాదా? కేంబ్రిడ్జి ప్రొఫెసర్ అభిప్రాయం!!

Telangana Corona Emergency Contact Information: 

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

CORONA ( COVID 19 ) HELPLINE : 011-23978046 OR 1075

TELANGANA COVID 19 HELPLINE : 104, 8790005197, 040-23286100, 040-23454088

STATE CONTROL ROOM : 040-23450624 / 23450735

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Tollywood Young Tiger NTR with mesmerizing looks
Next Post
Top secret about Radheshyam movie is leaked .. Shock if you know what is it?
Tollywood Young Tiger NTR with mesmerizing looks
Top secret about Radheshyam movie is leaked .. Shock if you know what is it?

Recent Posts

Menu