మన ఆయుర్దాయం 150 ఏండ్లు చేయొచ్చునట!

మన ఆయుర్దాయం 150 ఏండ్లు చేయొచ్చునట

మన ఆయుర్దాయం 150 ఏండ్లు చేయొచ్చునట!

పరిశోధనల్లో తేలిన సారాంశం:

మన ఆయుర్దాయం 150 ఏండ్లు చేయొచ్చునట! సగటు మనిషి ఆయుర్దాయం 100 ఏళ్లు అన్నదే అందని ద్రాక్షగా జీవితాలు ముగిసిపోతున్నాయి. కానీ తరతరాలుగా చిరంజీవిగా జీవించాలనే తపన మానవ జాతిని ప్రభావితం చేస్తూనే ఉంది. వందేళ్ల పూర్ణ ఆయుష్షు కలగాలని మనలో ప్రతి ఒక్కరం పెద్దల నుంచి పదేపదే ఆశీస్సులు తీసుకుంటుంటాం. కోరుకుంటాం. కానీ 60 ఏళ్ల వరకు జీవిస్తేనే గగనం అనే వాస్తవిక ప్రపంచం మన ఆశలపై నీళ్లు చల్లుతున్నది కదా. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సాగించిన అధ్యయనాలలో ఇది భవిష్యత్తులో సాధ్యమే అని తెలుస్తోంది. వారి ఆలోచనల్లో 150 ఏళ్ల దీర్ఘాయువు సాధించడం వరకు సాధ్యమేనట.

అదెలా సాధ్యం అన్న ప్రశ్న తప్పక వస్తుంది. దానికి వారు ఇస్తున్న సమాధానం ఏమిటంటే – సాధారణంగా 30 – 40 ఏళ్ల వయసు తరువాత శరీరంలో కొత్త అణువుల ఉత్పత్తి క్రమంగా తగ్గడం ప్రారంభిస్తుంది. దీని ఫలితమే వృద్ధాప్యపు ఛాయలు. అక్కడి నుంచి శరీరం క్రమంగా మన అదుపులో ఉండకుండా బలహీనమవడం మొదలవుతుంది. కనుక, ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది – అంటే వృద్ధాప్యపు నీడ పడడాన్ని మరింత ఆలస్యం చేయగలిగితే మన ఆయుర్దాయం పెరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మన పురాణాలు, కథలు అన్నిటిలోనూ చిరంజీవులుగా జీవించడం కోసమే తపస్సులు చేసి, వరాలు పొంది, ఎందరినో మెప్పించి కూడా ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారని మనకు తెలుస్తూనే ఉంది. దీనినే ఆంగ్ల రచయిత మార్క్ ట్వెయిన్ మహాశయుడు ఇలా చెప్పాడు. మన జీవితాలు 60 ఏళ్ల దగ్గర ప్రారంభమై క్రమంగా తక్కువ వయసులోకి అంటే 18 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ స్థితికి చేరితే ఎంత బాగుంటుందో కదా అని! ఈ ఆలోచన ఎలా ఎవరిని ప్రభావితం చేసిందో కానీ సింగపూర్ కు చెందిన కొెంత మంది శాస్త్రవేత్తలు సుదీర్ఘకాలం డీవించిన మనిషి ఎవరైనా ఉన్నారా అని ముందుగా గాలించారు. వారి అధ్యయన ఫలితాలను సింగపూర్ కు చెందిన బయో టెక్ కంపెనీ జోరో సంస్థ శాస్త్రవేత్తలు ఒక పరిశోధనా పత్రం రూపంలో నేచర్ కమ్యూనికేషన్ అనే జర్నల్ లో ప్రచురించారు. వారి పరిశోధనల ప్రకారం మానవ జీవితం 120 నుంచి 150 ఏళ్ల వరకు కొనసాగే అవకాశాలున్నాయని గుర్తించింది.

మరణం లేదా మనిషి చావడం అనే ప్రక్రియకు మూలం శరీరంలోని పునరుజ్జీవన సామర్థ్యం క్షీణించిపోవడమే కారణం అని వారు అంచనా వేశారు. ఇది కేవలం అత్యంత సూక్ష్మమైన భౌతిక లక్షణం మాత్రమేనని, అయితే ప్రాణం పోవడానికి ఇతర కారణాలు కూడా ఉంటే ఉండవచ్చని వారు నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశోధనలో భాగంగా ముందుగా మానవుడు ప్రతిరోజూ వేసే అడుగుల సంఖ్యను, ఆ క్రమంలో వారి శరీరంలోని రక్త కణాల సంఖ్యను లెక్కకట్టి పోల్చి చూసే ప్రయత్నం చేశారు. దీనికి అవసరమైన కీలక సమాచారాన్ని అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, రష్యా దేశాల ప్రజల జీవన గమనం ఆధారంగా సేకరించారు. దీనిని విశ్లేషించగా “శారీరిక క్షీణత అనే అంశంలో సకల మానవ జాతిలో సారూప్యత ఉన్నదని” తెలుసుకున్నారు.

శాస్త్రజ్ఞుడు తిమోతీ వి. పైకోవ్  నేతృత్వంలో సాగిన పరిశోధనల్లో వ్యాధుల ప్రభావం పక్కన పెట్టి వయసు పెరిగే కొద్దీ శరీరంలోని జీవ కణాల పునరుజ్జీవన సామర్థ్యం క్షీణించిపోతూ ఉంటుందని గుర్తించింది. అది ఎంత వేగంగా క్షీణిస్తున్నదనే దానిపై ఆధారపడి మరణం ఎదురవుతున్నదని తేల్చారు. సాధారణంగా వారి అంచనా ప్రకారం 120 లేదా 150 ఏళ్ల వయసు వచ్చిన తరువాత ఈ పునరుజ్జీవన సామర్థ్యం వేగంగా క్షీణించిపోతుంది. ఈ పరిశోధనలకు ప్రాతిపదికగా నడిచిన అడుగుల దూరం, రక్త కణాల సంఖ్య మధ్య పోలిక నిజానికి వేరువేరు అంశాలేనని జేరో సంస్థను స్థాపించిన మరో శాస్త్రవేత్త, ఈ పరిశోధన పత్రం రూపకల్పనలో సహకారం అందించిన పీటర్ ఫెడిచెవ్ అంగీకరించాకు. అయితే వాటి మధ్య ఏకరూపకత కూడా ఉందని. రెండు అంశాలు కూడా పునరుజ్జీవన సామర్థ్యాన్ని క్షీణింపజేయడం ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. వయసు ప్రభావానికి అవి సాక్ష్యంగా అవి నిలుస్తాయని అన్నారు.

దీనికి ఉదాహరణగా – వయో వృద్ధులకు ఎన్ని వైద్యాలు చేసినా, ఎంత చికిత్సలు అందించినా వారి ఆయు ప్రమాణాన్ని కొద్ది మేరకు మాత్రమే పెంచగలుగుతున్న వాస్తవాన్ని మరో శాస్త్రవేత్త, దీని సహకరూపకర్త ఆండ్రీ గుడ్కోవ్ గుర్తుచేశారు. ఈ పరిశోధన పత్రం పరిశీలించిన తరువాత వైద్య నిపుణులు సరైన ఔషధాలను రూపొందించగలిగితే ఈ సామర్థ్యం క్షీణించిపోకుండా మరి కొంత కాలం కొనసాగే విధంగా కాపాడవచ్చని, ఆ రకంగా వయోభారం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చునని ఆశిస్తున్నారు.

ఇప్పటివరకూ మన దృష్టికి వచ్చిన వివరాల ప్రకారం ఫ్రాన్స్ కు చెందిన ఒక వ్యక్తి జీన్ కాల్మెంట్ 122 ఏండ్ల వయసులో చనిపోయాడు.

Know more about Corporate companies helping hand to corona patients in India.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
Telangana on the brink of progress
Next Post
First dual SIM 5G smartphone to be launched in the country
Telangana on the brink of progress
First dual SIM 5G smartphone to be launched in the country

Recent Posts

Menu