One More BY-Election In Telangana:రాష్ట్రంలో త్వరలో మరో ఉపఎన్నిక ఎక్కడంటే

One More BY-Election In Telangana:

One More BY-Election In Telangana:

iRAYSMEDIA

One More BY-Election In Telangana:తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో త్వరలో వేములవాడ KUDA ఉపఎన్నిక వస్తుందని జోస్యం చెప్పారు.

అలాగే తమతో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మరికొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని రఘునందన్‌రావు పేర్కొన్నారు.కాగా ప్రస్తుతం వేములవాడ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయన పౌరసత్వంపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది. టీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం కాదని, ఆయనకు ఇంకా జర్మనీ పౌరసత్వం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ఐతే భారత పౌరసత్వం లేకుండా ఎమ్మెల్యేగా ఉండే అర్హత చెన్నమనేని రమేష్‌కు లేదంటూ బీజేపీ వాదిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. అయితే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని బీజేపీ ఆశిస్తోంది. దీంతో వేములవాడలో త్వరలో ఉప ఎన్నిక జరుగుతుందని ఆ పార్టీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే వేములవాడ ఉపఎన్నికలోనూ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని రఘునందన్ ధీమా వ్యక్తం చేశారు.

RAED MORE:

Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

POWER STAR PUNEETH RAJ KUMAR BIO : పునీత్ రాజ్ కుమార్ బయోగ్రఫీ

Previous Post
Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?
Next Post
UK Becomes-First-Country To-Approve Oral-Covid-Pill:కోవిడ్ పిల్‌ను ఆమోదించిన మొదటి దేశం UK
Huzurabad Election Etela Won:హుజూరాబాద్‌లో ఈటల గెలపునకు ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?
UK Becomes-First-Country To-Approve Oral-Covid-Pill:కోవిడ్ పిల్‌ను ఆమోదించిన మొదటి దేశం UK

Recent Posts

Menu