Nims Heart Transplantation Surgery : 12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు

Uncategorized
heart transplantation

Nims Heart Transplantation Surgery

12 నిమిషాల్లో గుండెను యశోద నుండి NIMS కి తరలించారు

iRAYSMEDIA HYDERABAD NEWS: బ్రెయిన్ డెడ్ రోగి [ కానిస్టేబుల్ వీరబాబు ] హృదయంన్నీ నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) లో హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లాకి చెందిన హుస్సేన్ కి నిమ్స్ డాక్టర్ అమరేశ్వేరి గుండే మార్పిడి ఆపరేషన్ చేసారు . మలక్‌పేట్ యశోద హాస్పిటల్స్ నుండి మధ్యాహ్నం 1:44 గంటలకు ప్రత్యేక అంబులెన్సు లో 1:56 గంటలలోపు గుండె మార్పిడి కోసం గ్రీన్ ఛానెల్‌లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా 12 నిమిషాల్లో నిమ్స్ కి చేరేలా చూసారు .

మలక్ పేటలోని యశోద హాస్పిటల్స్ నుండి నిమ్స్, పంజాగుట్ట నుండి అంబులెన్స్‌లో ఆక్సిడెంట్ లో బ్రెయిన్ డెడ్ అయినా వీరబాబు హృదయాన్ని వేగంగా నిమ్స్ కి చేరడానికి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి గ్రీన్ ఛానెల్‌ని అధికారులు సిద్ధం చేసారు.
ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి నిమ్స్‌లో రోగికి దాత హృదయం కేటాయించడం ఇదే మొదటిసారి. గత కొన్ని సంవత్సరాలుగా, నిమ్స్‌లోని సర్జన్లు ఐదు విజయవంతమైన గుండె మార్పిడిలను నిర్వహించారు. అయితే, ఇప్పటి వరకు నిమ్స్‌లో బ్రెయిన్ డెడ్‌గా అయినా రోగుల నుండి సేకరించిన దాతల గుండెలతో మొత్తం ఐదు గుండె మార్పిడులు జరిగాయి.

అయితే ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయినా ఎన్ . వీరబాబు హైదరాబాద్ కొండాపూర్ లో స్పెషల్ బ్రాంచ్ లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నడు.వీరబాబు పని మీద ఖమ్మం లోని కుసుమంచికి ఈ నెల 12న గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది . మొదట ఖమ్మం స్థానిక హాస్పిటల్ లో చెరిపించగా ఆ తరువాత వీరబాబు ని మెరుగైన వైద్యం కోసం మలక్ పెట్ యశోద హాస్పిటల్ కి తరలించారు .

చికిత్స మధ్యలో అతని మెదడు పనితీరు ఆగిపోవడంతో వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. వీరబాబు విషయం తెలుసుకున్న జీవన్ దాన్ ప్రతినిధులకు అవయవదానం చేయాలనీ కుటుంబసభ్యులకు తెలుపగా వాళ్ళు అంగీకరించడంతో వీరబాబు శేరీరం నుండి హార్ట్ ,లివర్,కిడ్నీస్, లంగ్స్ తీసి 8 మందికి డొనేట్ చేయచ్చని డాక్టర్ స్వర్ణలత [ జీవన్ డాన్ ఇంచార్జ్ ] తెలిపారు .

 

ఇవి కూడా చదవండి:

Arrest of two doctors selling fake injections

Previous Post
6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates
Next Post
Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 
6 Years Old Girl Rape Case: రాజు ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి |Hyderabad 6 Years Girl Rape Case Updates
Raju Suicide:హైదరాబాద్ సైదాబాద్ రేప్ కేసు రాజు సూసైడ్ 

Recent Posts

Menu