గంగా నదీ జలాల్లో నవయుగ ‘సీత’ !

గంగా నదీ జలాల్లో నవయుగ 'సీత’ !

గంగా నదీ జలాల్లో నవయుగ ‘సీత’ !

రోజులు మారాయి అనడం సరికాదని ఎప్పుడో రుజువైంది. మనసుల్లోనే మార్పు వచ్చింది అనేది నేటి సత్యం.

అందుకే మహా భారతంలో కుంతీ దేవీ తన కన్న మగ బిడ్డను గంగా నదిలో వదిలేసింది. అంతకుముందు అయోనిజగా అవతరించిన సీతా దేవి త్రేతా యుగంలో భూమిలో పెట్టెలో దాక్కుని నాగలి చాలుకు తగిలి వెలికి వచ్చింది. ఇప్పుడు తాజాగా ఒక తల్లి తన ఆడబిడ్డను గంగానది ప్రవాహంలో విడిచిపెట్టింది. ఇక్కడ తేడా బహుశా ఆ తల్లి సమస్య ఏమో కానీ, కలియుగంలో ఆశ్చర్యం కాదు. పెంట కుప్పల్లోనూ, రోడ్లపైనా, ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్న ఘటనలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి.

ఇంతకీ అసలు వార్త ఏమిటంటే –  ఉత్తరప్రదేశ్ లోని ఘజియా పూర్ సమీపంలోని గంగా నదిలో పడవ నడిపే సాధారణ మత్స్యకారుడు గుల్లు చౌదరి. ఆయన నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక చెక్క పెట్టె నీటిలో కొట్టుకురావడం చూశాడు. ఆశాజీవి కదా ఆయన ఆ పెట్టె పైకి తీసి లోపలికి తొంగిచూశాడు. అందులో ఆయనకు అప్పుడే పుట్టిన ఆడబిడ్డ కిలకిల నవ్వుతూ కనిపించింది. ఆ పెట్టె లోపలి భాగమంతా దేవుళ్ల చిత్రపటాలే. బహుశా ఆ తల్లికి తన మీదకన్నా కనిపించని ఆ దేవుళ్ల మీదే నమ్మకం ఎక్కువ కావచ్చు. నిజంగా ఆ బిడ్డ చిరంజీవే.

గంగమ్మ ప్రసాదం తనకు దక్కిందని ఆ నిరుపేద విపరీతంగా సంతోషించాడు. తన కన్న బిడ్డగా పెంచుకునేందుకు సిద్ధమైపోయాడు. మరో విచిత్రం ఏమిటంటే ఆ తల్లి తన బిడ్డ జాతకచక్రం కూడా భద్రంగా ఆ పెట్టెలోనే పెట్టింది. తన కులం వారిలో పూజారి విధులు కూడా నిర్వహిస్తున్న గుల్లు చౌదరి దానిని చూసి మరింత మురిసిపోయాడు. అయితే ఈ సమాచారం పోలీసులకు చేరింది. ఇక్కడ మాత్రం ఆలస్యం చేయకుండా వచ్చి ఆ పసిబిడ్డను స్వాధీనం చేసుకున్నారు. ఆఘమేఘాల మీద ఆ బిడ్డను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి విడుదల తరువాత ఆ బిడ్డ సంరక్షణ బాధ్యత ఎవరికి అప్పగిస్తారని అడిగితే పోలీసులు పాపం నోరు మెదపడం లేదు. వారికేం తెలుసు! కాకపోతే చికిత్స పూర్తయ్యలోపున ఆ బిడ్డ అసలు తల్లిదండ్రులు ఎవరో విచారించి వెతికి వేటాడి పట్టుకుంటారట. చూద్దాం.

మెల్లిగా ఈ పసి బిడ్డ సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చేరింది. పడవ నడిపే పేదవాని దయా హృదయాన్ని వేనోళ్ల మెచ్చుకున్నారు. ఆ బిడ్డ సంరక్షణకు ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. పేద గుల్లు చౌదరికి ప్రభుత్వ పథకాల రూపంలో లబ్ధి చేకూరుస్తారట. బిడ్డ బాధ్యత సర్కారు తీసుకుంటుందట. ఈ విషయాలను ముఖ్యమంత్రి స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

Know more about Hero Ravi Teja’s chance to the new director.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
పరమత సహనం – పంజాబీ ఔన్నత్యం! అభినందనల వెల్లువ
Next Post
India ranks 14th in helping others
పరమత సహనం – పంజాబీ ఔన్నత్యం! అభినందనల వెల్లువ
India ranks 14th in helping others

Recent Posts

Menu