గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం.. ఎక్కడో తెలుసా..!?

గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం

గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం : iRAYSMEDIA – HYDERABAD NEWS

తిరుపతి అనగానే లడ్డూ గుర్తొస్తుంది. అలాగే శబరిమల అనగానే డబ్బాలో అందించే అరవణ ప్రసాదం గుర్తొస్తుంది. ఇలా కొన్ని గుళ్ళలో ప్రసాదాలు చాలా ఫేమస్ అవుతాయి. చాలా ఆలయాల్లో లడ్డు, పులిహోర, వడ, దద్దోజనం, చెక్కర పొంగలిని తదితరాలను ప్రసాదాలుగా ఇస్తుంటారు.

అసలు అయితే గుడిలోకి మాంసాహారాన్ని అనుమతించరు. మనం కూడా మాంసాహారం తిన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళకూడదు అనే నియమం ఉంది. కానీ ఒక గుడిలో మాత్రం ఏకంగా మాంసాహారాన్ని ప్రసాదంగా ఇస్తున్నారు. వినడానికి ఎంతో వింతగా ఉన్న ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

మన దేశంలో బిర్యానీ పంచే ఆలయం ఉంది అంటే నమ్మడం కష్టమే. అయినా కూడా అలాంటి గుడి మన దేశంలో, అది కూడా మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో ఉంది. అక్కడ ఆలయంలో ఉత్సవాల సమయంలో దాదాపు సుమారు రోజుకు 1000 కిలోల బియ్యంతో, 250 మేకపోతులతో, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీ వండుతారు.

గుడిలో మటన్ బిర్యానీ ప్రసాదం :

ఈ ఆచారం నిన్న మొన్నటిది ఐతే కాదు.
సుమారు 84 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తమిళనాడు లోని మధురై గ్రామంలో ఉన్న మునియాండి ఆలయంలో ఈ ఆచారం కొనసాగుతుంది. మునియాండి అంటే శివుని సేవకుడు అని అర్థం.

అయితే ఈ బిర్యానీ ప్రసాదం ఆచారం ఎలా మొదలయ్యింది అంటే అప్పట్లో ఎస్పీఎస్ సుబ్బానాయుడు మునియాండి అనే పేరుతో ఒక హోటల్ ని ప్రారంభించాడు. ఈ హోటల్ కి మంచి లాభాలు వస్తే స్వామి భక్తులకి రెండేళ్ల పాటు బిర్యానీని ప్రసాదంగా పంచుతానని మొక్కుకున్నాడు. అలా మెల్లమెల్లగా ఇది ఆనవాయితీగా మారిపోయింది. ప్రతి సంవత్సరం జనవరి 24 నుండి రెండు రోజులు ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు జరిగినన్ని రోజులు బిర్యానీనే ప్రసాదంగా పంచుతారు. ఎక్కడెక్కడి నుండో వేలాది మంది భక్తులు తరలి వస్తారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఆలయ సిబ్బంది బిర్యానీని అందిస్తారు. ఈ మునియాండి స్వామికి వివిధ దేశాల్లో భక్తులు ఉన్నారు. మరో విషయం ఏంటంటే ఈ ఆలయ ప్రసాదమైన బిర్యానీని పార్సెల్ కూడా చేపించుకుని తీసుకెళ్లే అవకాశం ఉంది.

 

 

READ MORE : 

Tasty Biryani: మీరు బయట బిర్యానీ తింటున్నారా? | Do you eat biryani outside?

Again Lockdown:మళ్ళీ కేరళ రాష్ట్రంలో పూర్తిగా లాక్డౌన్ | Again completely lockdown in Kerala state

Previous Post
HUZURABAD BI-ELECTIONS : 101 తుపాకులను సరెండర్ చేయమన్న సీపీ సత్యనారాయణ
Next Post
Sai Pallavi About LoveStory : ముద్దు సీనుపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
HUZURABAD BI-ELECTIONS : 101 తుపాకులను సరెండర్ చేయమన్న సీపీ సత్యనారాయణ
Sai Pallavi About LoveStory : ముద్దు సీనుపై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి

Recent Posts

Menu