Maoist leader RK Dead:ఆర్కేది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అంటున్న ఆర్కే భార్య శిరీష

Maoist leader RK dead

Maoist leader RK Dead,BREAKING NEWS

iRAYSMEDIA

Maoist leader RK Dead: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి…….
ఆర్కే” మృతి పై ఆయన భార్య శిరీష ఆర్కే” మృతి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్తది(RK ) సహజ మరణం కాదని ఏది ముమ్మాటికీ “ప్రభుత్వ హత్య” అని శిరీష గారు ఆరోపించారు.

అనారోగ్యం బారిన పడిన తన భర్తకు వైద్యం సదుపాయం అందించకుండా పోలీస్ శాఖ తీవ్రంగా ప్రయత్నించిందని ధ్వజమెత్తారు శిరీష గారు . పోలీసులు అడవిని చుట్టుముట్టి అనారోగ్యం బారిన పడిన RK కి వైద్యం అందకుండా చేసి చంపేశారని శిరీష ఆరోపించింది. అంతేకాకుండా మావోయిస్టులకు సహకరించకుండా గిరిజనులను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే మావోయిస్టులకు చేరే ఆహారంలో విషం కలుపుతున్నారంటూ …తన భర్త ఆర్కే చనిపోలేదని ప్రజల గుండెల్లో ఎప్పటికి చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.

తన భర్త RK “బడుగు-బలహీన” అణగారిన వర్గాల ప్రజల కోసం అమరుడయ్యారన్నారు. “ప్రజల కోసం పోరాడతాం…ప్రజల కోసం చస్తాం” అంటూ సాగిన పోరాటంలో తన కొడుకుని కూడా పోగొట్టుకున్నామని..ఇప్పుడు ఆర్కేను కూడా కోల్పోయామని అయన భార్య శిరీష కన్నీటి పర్యంతమయ్యారు. RK గొప్ప యోధుడనీ. ప్రజల కోసం పోరాడిన వ్యక్తి అని .
తప్పకుండా అతను కోరుకున్న ఆశయాలను కొనసాగిస్తామనీ తెలిపారు. ఆర్కేకు జోహార్లు తెలుపుతూ అర్కే “అమర్ రహే” అంటూ కన్నీటితో నినాదాలు చేశారు. ప్రజల కోసం బ్రతికిన మనిషికి.. వీరుల మధ్య అంత్యక్రియలు జరిగాయని శిరీష తెలిపారు.

కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో చనిపోయారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతిని మావోయిస్టు పార్టీ అధికారికంగా ధృవీకరించింది. ఈ నెల 14న ఉదయం RK
మృహతి చెందినట్లు మావోయిస్టు అధికార ప్రతినిది అయినా అభయ్ ప్రకటించారు. ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కిడ్నీలు ఫెయిల్ అవడంతో చనిపోయినట్టు ప్రకటనలో ధ్రువీకరించారు . చికిత్స చేసినా కూడా ఆర్కేను కాపాడులేకపోయామని ప్రకటించారు. అయితే ఆర్కే అంత్యక్రియలు విప్లవ-శ్రేణుల మధ్యే జరిగినట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది .

READ MORE:

Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం

The mass resignation by 32 volunteers of AP

 

Previous Post
Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం
Next Post
Dravid Appointed Team-India Head-Coach:టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్
Weather Forecast Today: రెండు తెలుగు రాష్టాల్లో అల్పపీడనం ప్రభావం
Dravid Appointed Team-India Head-Coach:టీం ఇండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్

Recent Posts

Menu