మమతా బెనర్జీ – సోషలిజమ్ వివాహం! నేటి నెట్టింటి విచిత్రం.

మమతా బెనర్జీ - సోషలిజమ్ వివాహం!

మమతా బెనర్జీ – సోషలిజమ్ వివాహం! నేటి నెట్టింటి విచిత్రం.

మమతా బెనర్జీ పేరు తెలియని వారు ఉండరు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఆమె ఇటీవలి శాసనసభ ఎన్నికలలో బీజేపీ సవాలుకు ఎదురునిలిచి గెలుపొందడమే కాదు. తనని కాదని బీజేపీ నీడన చేరిన తన వారిని ఒకరొకరిగా మళ్లీ వెనక్కి వచ్చేలా మార్చేసుకోగలుగుతున్నారు. పదేళ్ల క్రితం వరకు ఆమె ఒక ఫైర్ బ్రాండ్ అగ్నిశిఖ ఉక్కు మహిళ మాత్రమే అందరికీ తెలుసు. అప్పట్లో ఆమె కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేంద్రంలో మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఆ తరువాత జరిగిన రాజకీయ క్రీడలో ఉప్పెనలా విరుచుకుపడి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాల ఆధిపత్యాన్ని నేలమట్టం చేశారు. ఆమె కేంద్రంలో మంత్రిగా ఉన్న సమయంలో ఆమె వీర ధీర వ్యక్తిత్వం చూసి ముచ్చట పడిన ఒక తండ్రి తన కూతురుకు మమతా బెనర్డీని ఆమె పేరే పెట్టుకున్నారు.

ఇక అంతకు కొద్ది సంవత్సరాల ముందు కమ్యూనిస్టు భావాలతో ప్రభావితమైన ఒక తండ్రి తన కుమారుడికి సోషలిజమ్ అని పేరు పెట్టుకున్నారు. ఇది ఇక్కడ వధూవరుల గురించిన చిరు ప్రయత్నం. ఇప్పుడు వాళ్లు పెళ్లీడుకు వచ్చారు. ఇరు పక్షాల అంగీకరంతో వారి వివాహం ఇటీవల ఘనంగా జరిగింది.

కమ్యూనిస్టుల పేరు ఎత్తితే మండిపడే మమత సోషలిజమ్ అన్న పదాన్ని కూడా సహించరు కదా. మరి వారి పెళ్లి ఏమిటీ అని అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. వాస్తవానికి వారు ఇద్దరు ఆయా పేర్లతో పెరిగి పెద్దవారయిన వధూవరులు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక కమ్యూనిస్టు నేత రాష్ట్ర సిపిఐ అధ్యక్షుడు ఆర్ ముతరాసన్ సమక్షంలో వారి పెళ్లి ఆదివారమే జరిగింది. వీరి పెళ్లి స్థానికంగా సంచలనమే కలిగించింది.

సేలం జిల్లా సీపీఐ అధ్యక్షుడు ఏ. మోహన్ కుమారుడు పెళ్లి కొడుకు సోషలిజమ్. సోషలిజమ్ సోదరులిద్దరున్నారు. వారి పేర్లు కమ్యూనిజమ్, లెనినిజమ్. సోవియట్ యూనియన్ పతనం తరువాత అక్కడి సోషలిస్టు కమ్యూనిస్టు లెనినిస్టు ప్రభుత్వం కుప్పకూలినా ఆ సిద్ధాంతాలపై అభిమానం తగ్గించుకోలేక మోహన్ తన కుమారులు ముగ్గురికీ ఇలా సోషలిజమ్, కమ్యూనిజమ్, లెనినిజమ్ అని పేర్లు పెట్టుకున్నారట.

ఇక ఆడపెళ్లి వారి విషయానికి వస్తే  నిజానికి వారు కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు. తాతగారు ముచ్చటపడి తన మనుమరాలికి ఆనాటి మహిళా నాయకురాళ్లలో ఫైర్ బ్రాండ్ అయిన మమత వ్యక్తిత్వంపై అభిమానంతో ఆమె పేరే పెట్టుకున్నారు. పెళ్లి పత్రిక అందిన వారంతా పెళ్లికి హాజరవడమే కాక ఈ విచిత్రమైన పెళ్లి గురించే మాట్లాడుకున్నారు. వివరాలు తెలుసుకున్నాక ఆనందంగా కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు.

పేర్లలో ఉన్న వైవిధ్యం గురించి వధూవరులు స్పందిస్తూ రాజకీయంగా వేర్వేరైనా, వ్యక్తులుగా జీవితాంతం కలిసే ఉంటామని అందరికీ బరోసా ఇచ్చారు.

Know more about sexual assault on Afghanistan Women police.

Also, know more about Covid 19 updates in Telangana.

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)

9490617400

9490617431

For Free cab Services (Rachakonda)

9490617234

Previous Post
A special vaccination camp inaugurated by CMD Prabhakara Rao
Next Post
Police cracking down on red sandalwood smugglers
A special vaccination camp inaugurated by CMD Prabhakara Rao
Police cracking down on red sandalwood smugglers

Recent Posts

Menu