Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు

Huzurabad By-Election Special Story

Latest-Update ON Huzurabad BY-Election

iRAYSMEDIA

 

Latest-Update ON Huzurabad BY-Election:హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈరోజుతో ముగియనున్నది. ఈరోజు సాయంత్రం గుర్తులను కేటాయించనున్నారు. ప్రస్తుతం 42 మంది అభ్యర్థులు హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు.

ఐతే ఇందులో ఎంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారు అన్నది తెలియాల్సి ఉన్నది. ఈరోజు ఉపసంహరణకు సమయం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఉన్నది. ఎవరైతే పోటీనుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారో వారు నేరుగా సంతకం పెట్టి నామినేషన్‌ను వెనక్కి తీసుకోవచ్చు .

అధికార పార్టీ TRS, BJP, CONGRESS నుంచి ముగ్గురు, 32 మంది స్వతంత్రులు, 7 మంది ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి EVMను ఏర్పాటు చేయనున్నారు. నోటాతో కలిపి 16 మంది అభ్యర్థులను మాత్రమే ఒక్కో బ్యాలెట్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఐతే ఈ 42 మందిలో సగం మంది విత్‌డ్రా చేసుకున్నా, రెండో బ్యాలెట్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. బ్యాలెట్‌లో అభ్యర్థుల పేర్లు, ఫొటోలు, గుర్తులు తప్పనిసరి. స్వతంత్ర -అభ్యర్థుల పేర్లతో అకక్షరాల వరుసలో “సింబల్స్” కేటాయింపుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

READ MORE:

Bandi-Sanjay On Huzurabad By-Election: KCR కి ఆర్ ఆర్ ఆర్” చూపెడుతాం అన్న బండి సంజయ్

Huzurabad By Election News: హుజురాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ స్వీకరణ వాయిదా

Previous Post
Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్
Next Post
Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా
Datsun Company Festival Disscounts: డాట్సన్ కంపెనీ వాహనాలపై భారీ డిస్కౌంట్స్
Amit-Shah Tikely To-Attend Huzurabad: హుజురాబాద్ కి అమిత్ షా

Recent Posts

Menu