గత 12 యేళ్లుగా వస్తున్న ఖైరతాబాద్ గణేష్ లడ్డు సంప్రదాయానికి బ్రేక్ పడింది. మరి ఈ సారి లడ్డు ఎవరు ఇచ్చారో తెలుసా..?

Breaking News
khairathabad ganesh

 

Khairathabad Ganesh Idol 2021:  గణేష్ ఉత్సవాలు మొదలయ్యాయంటే మొదటగా అందరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశుడే. హైద్రాబాద్లో ఎన్ని విగ్రహాలు పెట్టిన ఖైరతాబాద్ వినాయకుడి స్టయిలే వేరు.

ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రత్యేక రూపంలో విగ్రహాన్ని తయారు చేస్తుంటారు. విగ్రహానికి ఉండే ఎత్తులోను అంతే ప్రత్యేక విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెంచుకుంటూ వెళ్తారు అని మన అందరికి తెల్సిన విషయమే…

తెలంగాణ కాకుండా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఈ భారీ గణనాథుడిని దర్శించుకోడానికి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు, ఈ గణేశుని కోసం అంతే ప్రత్యేక స్థాయిలో భారీ లడ్డును తయారు చేయిస్తారు దీని నిర్వాహకులు. ఈ లడ్డు కోసం వేల సంఖ్యలో భక్తులు పోటీపడుతుంటారు. గత 12 సంవత్సరాలుగా తూర్పు గోదావరి జిల్లా తాపేశ్వరం నుండి ఈ గణేష్ కోసం లడ్డును తయారు చేసి తీసుకొస్తారు. ఐతే ఈ సంప్రదాయానికి ఈ సంవత్సరం బ్రేక్ పడింది. ఈ సంవత్సరం నుండి ఈ గణనాథుడికి లడ్డును స్థానికంగా ప్రత్యేక పద్దతిలో చేయించారు.

ఈ సంవత్సరం భాగ్యనగర వాసుల నుంచి 2000 కిలోల లడ్డును తయారు చేయించారు. స్వామి ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కూలర్ అధినేత శ్రీకాంత్ 1100 కిలోల లడ్డును ఈ ఖైరతాబాద్ గణనాథుడి కోసం తయారుచేయించారు. మరో 900 కిలోల లడ్డుని భక్తంజనేయ స్వీట్స్ వారు సమర్పించనున్నారు.

2010 నుండి ఖైరతాబాద్ గణేశుడికి లడ్డుని ఎవరు ఇచ్చారో తెలుసా…..

Khairathabad Ganesh Idol 2021: 2010 నుండి సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు, ఖైరతాబాద్ గణేష్ కోసం లడ్డును నైవేద్యంగా పంపేవారు. ఈ లడ్డు చాల సార్లు గిన్నిస్ బుక్ లోను చోటు దక్కించుకుంది.

Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి వేడుకలు GHMC సన్నద్ధమైంది | GHMC prepares for Ganesh Chaturthi celebrations

40 ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో….     2021లో 7.3 శాతం తగ్గనున్న దేశ ఆర్థిక స్థితి

Previous Post
Sangareddy youth cycle yatra: గ్రీన్ కవర్ మెరుగుపరచడానికి సంగారెడ్డి యువత సైకిల్ యాత్ర | Sangareddy youth cycle yatra to improve green cover
Next Post
TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest
Sangareddy youth cycle yatra: గ్రీన్ కవర్ మెరుగుపరచడానికి సంగారెడ్డి యువత సైకిల్ యాత్ర | Sangareddy youth cycle yatra to improve green cover
TELUGU BIGG BOSS 5: అందరికి చిరాకు తెప్పిస్తున్న లహరి | Bigg Boss 5 Latest

Recent Posts

Menu