జైళ్లలో కుల వివక్ష కథనానికి జర్నలిస్టు సుకన్య శాంత కు అవార్డు

జైళ్లలో కుల వివక్ష కథనానికి జర్నలిస్టు, ఎక్స్లలెన్స్ అవార్డు ప్రకటించింది

జైళ్లలో కుల వివక్ష కథనానికి జర్నలిస్టు సుకన్య శాంత కు ఎక్స్లలెన్స్ అవార్డు ప్రకటించింది:

మన దేశపు జైళ్లలో కుల వివక్ష సాగుతోందని ది వైర్ వెబ్ సైట్ కు చెందిన జర్నలిస్టు సుకన్య శాంత రాసిన కథనానికి సొసైటీ ఆఫ్ పబిల్షర్స్ ఇన్ ఏసియా (SOPA) ఎక్స్లలెన్స్ అవార్డు ప్రకటించింది. ప్రాంతీయ స్థాయిలో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశంలో ‘From segregation to labor – Manu’s caste Law governs the Indian Prison system’ శీర్షికతో ఆమె రాసిన వ్యాసం సోపా ప్రశంసలు అందుకుంది. ఇదే కోటగిరి కింద ఫిలిప్పీన్ సెంటర్ ఫర్ ఇన్వెస్టిగేటివ్ జరన్లిజమ్, ఫ్రాంటియర్ మయన్మార్ వ్యవస్థలు ప్రత్యేక ప్రస్తావన స్థానం సంపాదించుకున్నాయి.

ఈ సోపా సంస్థను హాంగ్ కాంగ్ లో 1982లో ఏర్పాటు చేశారు. ప్రచురణ విభాగంలో ఉత్తమ పద్థతులను ప్రోత్సహించడమే కాకుండా ఉన్నత పాత్రికేయ ప్రమాణాలను నెలకొల్పే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో ప్రెస్ ఫ్రీడమ్, పాత్రికేయుల హక్కుల రక్షణ కూడా తమ లక్ష్యాలలో ముఖ్యమైనవని ఆ సొసైటీ ప్రకటించింది. ఈ లక్ష్యాల సాధనలో భాగంగా 1999 నుంచి ఉత్తమ పాత్రికేయ కథనాలను గుర్తించి, వారికి తగిన గుర్తింపు ఇచ్చేందుకు వీలుగా ఈ అవార్డులను ప్రకటించడం ప్రారంభించింది. ఈ అవార్డులు మీడియా రంగంలో అత్యున్నమైనవిగా గుర్తింపు పొందాయి.

ఏటా 90 అవార్డులను వివిధ కోటగిరీల కింద ఇచ్చి ఇంగ్లీషు, లేదా చైనీస్ భాషా పాత్రికేయులను సత్కరిస్తున్నారు. సుకన్య శాంత సాధించిన అవార్డు ఇది ఒక్కటే కాదు. 2020లో కే పి నారాయణ కుమార్ మెమోరియల్ అవార్డును కూడా ఆమె అందుకుంది. సామాజిక ప్రభావశీలమైన పాత్రికేయ ప్రవృత్తికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

జైళ్లలో పరిస్థితి గురించి సుకన్య శాంత కథనం వెలువడిన వెంటనే మధ్యప్రదేశ్ హైకోర్టు దానిని పిటిషన్ గా స్యూమోటో నిబంధనల ప్రకారం విచారణకు చేపట్టింది. జైళ్లలో ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను, నియమాలను, జ్రిజన్ మాన్యువల్స్ లో తగిన మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు నెలల తరువాత ప్రభుత్వం ఆ మాన్యువల్ లో అనేక మార్పులు చేసింది. అంటే 70 ఏండ్లుగా అమలులో ఉన్న పాతకాలపు మాన్యువల్ ను ఆమె కథనం తిరగ రాసేందుకు ప్రేరణ అయింది. అయితే మరెన్నో ఇతర రాష్ట్రాలలో పరిస్థితులు మాత్రం ఇంకా మారలేదు. పాత కాలపు రూల్స్ నే అనసరిస్తున్నాయి.

Know more about Minister Jagga Reddy’s forward step to help people.

Also, know more about Covid 19 updates in Telangana.

Previous Post
Congress MLA Jagga Reddy speaking in front of CM’s camp office || iRays Media News Updates
Next Post
TPCC leaders Appeal to support the Mariamma family
Congress MLA Jagga Reddy speaking in front of CM’s camp office || iRays Media News Updates
TPCC leaders Appeal to support the Mariamma family

Recent Posts

Menu