ఇదీ మన సంస్కారం!! లక్ష డాలర్లు అప్పగించిన కుటుంబం

ఇదీ మన సంస్కారం!! లక్ష డాలర్లు అప్పగించిన కుటుంబం

ఇదీ మన సంస్కారం!! లక్ష డాలర్లు అప్పగించిన కుటుంబం

దేశం కాని దేశంలో వ్యాపారం జీవనోపాధిగా గడుపుతున్న భారతీయ కుటుంబం ఎవ్వరూ ఊహించని విధంగా అయాచిత చేతికి అందిన 1 లక్షల డాలర్లు – అంటే మన రూపాయలలో దాదాపు 72 లక్షలకు పై మాటే -నిజాయితీగా స్వంత దారుకు అప్పగించింది. ఇదీ మన సంస్కారం!! లక్ష

మసాచుట్స్ పట్టణంలో అరుణ్ షా కుటుంబానికి ఒక వ్యాపార దుకాణం ఉంది. వ్యాపారం పెంచుకునేందుకు వారు ఒక లాటరీ టికెట్ జారీ పథకం చేపట్టారు. ఆ దుకాణానికి నిత్యం వస్తున్న లియా రోజ్ ఫైగా 30 డాలర్లు పెట్టి ఒక టికెట్ కన్నది. అంటే దాదాపు రూ. 2160 పైన ఖర్చు చేసింది. ఆ టికెట్టుకు లాటరీ బహుమతిగా ఎకంగా మిలియన్ డాలర్లు అంటే 1 లక్షల డాలర్లు (ఒక డాలరు రూ. 72 లకు సమానం) వచ్చింది. అక్కడి  విధానం ప్రకారం టికెట్ పై దాచి ఉంచిన అంకెలను స్క్రాచ్ చేసి పరిశీలిస్తే దాని వల్ల వచ్చే బహుమతి ఎంతో తెలుస్తుంది. ఆమె ఇంటికి వెళ్లే తొందరలో అలా పైపైన గీచివేసి పూర్తిగా చూడకుండా మనకెక్కడ వస్తుంది అనుకుంటూ పక్కనే ఉన్న చెత్త బుట్టలో పడేసింది. ఇది జరిగింది గత మార్చిలో.

ఇక్కడే అనుకోని ఘటన జరిగింది. షాపు దుకాణంలో ఒ మూలకు చేరిపోయిన ఆ టికెట్టు ముక్క దుకాణందారు కుమారుడు అభి చూశాడు. ఏమిటా అని తీసి చూశాడు. టికెట్టు పూర్తిగా చూడలేదని గుర్తించాడు. ఆ కాస్త పని అభి పూర్తి చేశాడు. ఆశ్చర్యం. ఆ టికెట్టుకు ఏకంగా అంత పెద్ద మొత్తం బహుమతిగా వచ్చిన విషయాన్ని గమనించాడు. కుటుంబంలోని వారికి తెలియజేశాడు. అందరిలో ఆనందం. మిగిలింది చాలా పెద్ద మొత్తం. దానితో ఖరీదైన కారు కొనేసుకుందామనుకున్నారు. కానీ అది మరొకరికి దక్కవలసిన సొమ్ము. వాడుకునేందుకు బిడియం. ఇలా రకరకాల ఆలోచనలతో రెండు రోజులు అందరూ నిద్ర లేని రాత్రులు గడిపారు. ఇదీ మన సంస్కారం!! లక్ష డాలర్లు అప్పగించిన కుటుంబం

ఏకాభిప్రాయం కోసం స్వదేశంలో ఉన్న తండ్రి సలహా సంప్రదించారు. ఆయన మరో ఆలోచన లేకుండా మనది కానిది మనకొద్దు … ఇచ్చేయండి అన్నారు. అదే ఏ తండ్రి లేదా కుటుంబ  పెద్ద అయినా చెప్పవలసిన మాట. కాదంటారా?

సరే. ఇక ఆప్పుడు అసలు హక్కుదారు కోసం వెతకడం మొదలుపెట్టారు. నిత్యం వచ్చే కస్టమరే కాబట్టి ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా పోయింది. కుర్రాడు వెళ్ల వెంటనే తమ దుకాణం దగ్గరికా రావాలని కోరాడు. ముందు ఆమె తరువాత వస్తా అన్నది. కానీ పిల్లాడు పట్టు వదల్లేదు. సరే బయలుదేరి వచ్చింది.

దుకాణంలో పది మంది ముందూ అభి తండ్రి లాటరీ సొమ్ము అందించాడు. మొత్తం ఏం జరిగిందో వివరించాడు. అప్పుడు ఆమె కూడా తాను తొందరలో సరిగా చూసుకోలేదని అంగీకరించింది. అక్కడున్న వారంతా అభీని, ఆతని తండ్రిని, ఆ కుటుంబాన్ని ఎంతగానో అభినందించారు. మెచ్చుకున్నారు.

Also Read: కరోనా బీభత్సం!! కుంగిపోతున్న వైద్య సిబ్బంది స్థైర్యం

Telangana Corona Emergency Contact Information: 

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

CORONA ( COVID 19 ) HELPLINE : 011-23978046 OR 1075

TELANGANA COVID 19 HELPLINE : 104, 8790005197, 040-23286100, 040-23454088

STATE CONTROL ROOM : 040-23450624 / 23450735

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Government Judas on strike .. Emergency services closed
Next Post
Schools from next month .. Old lessons for the whole first month
Government Judas on strike .. Emergency services closed
Schools from next month .. Old lessons for the whole first month

Recent Posts

Menu