కార్పొరేట్ సంస్థలు కనికరిస్తున్నాయి!! కరోనా చికిత్సకు కార్పొరేట్‌ సాయం

Indian_companies_are_offering_unusual_assistance_to_their_employees.

కరోనా చికిత్సకు కార్పొరేట్‌ సాయం: కానీ అది చాలదు మరింత కదలాలి!!

ప్రపంచంలో మరెక్కడా లేని స్థాయిలో కోవిడ్ 19 కరోనా వైరస్ మన దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రాణాలు పోతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. గత ఏడాది కరోనా తొలి  సారి విరుచుకుపడినప్పుడు యాజమాన్యాలు అంతగా స్పందించినట్లు కనిపించలేదు. చేతనైన సంస్థలు విరాళాలు ప్రకటించడంతో చేతులు దులుపుకున్నాయి. ఫలితంగానే సినీ నటుడు సోనూ సూద్ మానవత్వంతో పది మందికి పేదలకు ఆర్తులకు అండగా నిలిచి కరుణామూర్తిగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ ఏడాది రెండో విడత మరింత భయంకరంగా కరోనా విజృంభిస్తోంది. గత ఏడాది కేంద్రం లాక్ డౌన్ విధించడాన్ని సాధ్యమైనంత తీవ్రంగా వ్యతిరేకించిన వివిధ పార్టీల పాలనలోని వివిధ రాష్ట్రాలు ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో పోటీ పడుతున్నాయి. బహుశా అందుకు కేంద్ర ప్రభుత్వం తప్పిదాలతో పాటు రాష్ట్రాలలోని పాలక పక్షాలు ప్రదర్శించిన ఉదాశీనత కూడా కారణమని అవి అర్థం చేసుకుని ఉండవచ్చు. గత ఏడాది గుంపులుగా చేరడాన్ని కేంద్రం చాలా సార్లు మందలించింది. కారణాలు ఎన్నికలైనా, కుంభమేళా వంటి మత పరమైన కార్యక్రమాలే అయినా గత కొద్ది నెలలుగా ప్రజల్లో కాని పాలకుల్లో కానీ ఈ జాగ్రత్తలపై ఏ మాత్రం శ్రద్ధ కనిపించలేదు.

ఫలితం … ఉధృతంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి. ఎక్కడ చూసినా ఆక్రందనలు, భయాందోళనలు, ఆసుపత్రులలో, మరణాల విషయంలో ఎడ తెగని బాధాకరమైన దృశ్యాలు. ఇలాంటి పరిస్థితులలో అనుకోకుండా కొన్ని విదేశీ బహుళజాతి సంస్థలు, కొన్ని దేశీయ సంస్థలు కూడా కరోనా నియంత్రణకు తమ వంతు బాధ్యతను స్వీకరించినట్లు కనిపిస్తుంది, అలాంటి వాటిలో నిక్ ఉత్పత్తుల సరఫరాదారు ఫెంగ్ టేయ్ పది రోజుల పాటు తమ సంస్థను మూసివేసేందుకు ముందుకు వచ్చారు. తమ ఉద్యోగులు కరోనా బారిన పడకుండా కాపాడడమే తమ ఉద్దేశమని ఈ సంస్థ యాజమాన్యం తైవాన్ స్టాక్ ఎక్స్చేంజీకి తెలియచేసింది. ఇదే విధంగా మరోన్నో సంస్థలు కొన్ని రోజుల పాటు తమ కార్యకలాపాలను మూసివేసేందుకు సంసిద్ధతను తెలిపాయి. ఇదే విధంగా హోండా మోటారు కంపెనీ, సుజుకీ కార్పొరేషన్ కూడా ఇటీవలి కాలంలో ఇదే విధంగా ఇండియాలో తమ కార్యకలాపాలను మూసివేశాయి.

ఇక డెవలపర్ గోడ్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ కార్మికులకు మరింత విశ్రాంతి ఇచ్చేందుకు పనిభారం తగ్గించేందుకు, కార్యాలయాలలోనైనా సరే ఎక్కువ మంది ఎక్కువ సమయం కలిసి ఉండకుండా భద్రత ఇవ్వాలని నిర్ణయించింది. అందు కోసం వారానికి మూడు రోజులు సెలవులు ఇస్తూ వారానికి నాలుగు రోజుల పనిదినాలను అమలు చేస్తోంది. ఇక దేశంలోనే అతి పెద్ద ప్రాపర్టీస్ కంపెనీలలో ఒకటైన లోథా గ్రూపు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన తమ కార్మికుల కుటుంబాలకు 12 నెలల జీతం ఇవ్వాలని నిర్ణయించింది. ఒక రకంగా పరిహారమే అయినప్పటికీ నష్టానికి తగినంత కాకపోయినా కొంత ఊరటనిస్తుందని చెప్పాలి. బోరోసిల్ లిమిటెడ్ సంస్థ రెండు సంవత్సరాల వేతనాన్ని వారి కుటుంబాలకు అందించడంతో పాటు మృతుల పిల్లల విద్యా బాధ్యతలను డిగ్రీ స్థాయి వరకు స్వీకరించేందుకు సంసిద్ధత ప్రకటించింది.

వాస్తవానికి మన దేశంలో లాక్ డౌన్ ప్రతిపాదన పారిశ్రామిక వర్గాలకు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే వారి ఉత్పత్తి తగ్గిపోతుంది. లాభాలు రాకపోగా నష్టాలు తప్పవు. ఇది వారి ఆలోచన. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతుందని వారు భయపడుతూ వచ్చారు. అయితే గత కొద్ది మాసాలలో కరోనా దారుణాలు పరిశీలించిన తరువాత ఇప్పుడు వాటి వైఖరిలో కొంత మార్పు వచ్చింది. ముఖ్యంగా కరోనా సవాలుకు జవాబుగా సిద్ధమవుతున్న వాక్సీన్ తయారీ సమస్య వారి ఆలోచనలో మార్పునకు కారణంగా కనిపిస్తోంది. ఫలితంగా కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) లాక్ డౌన్ విధించి ప్రజల ప్రాణాలను, వారిపై కాపాడాల్సిందేనని ఈ నెలారంభంలో పాలకవర్గాలకు సూచించింది.

తమ సంస్థలో పనిచేస్తున్న వారిలో 17 మంది ఒక్క మార్చి నెలలో ప్రాణాలు కోల్పోయానరని కోటక్ మహీంద్రా బ్యాంక్ సిఈఓ ఉదయ్ కోటక్ ఎంతో ఆవేదనతో ప్రకటించారు. ఏప్రిల్ లో దాదాపు అదే సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం సంస్థ వర్గాలలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 250 మంది ఉద్యోగులను సురక్షితమైన బబుల్ వ్యవస్థలోకి పంపించింది. ఇక రిలయెన్స్ సంస్థ పారిశ్రామిక ఆక్సిజన్ తయారీని తాత్కాలికంగా నిలిపివేసింది.  ప్రాణరక్షక ఆక్సిజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చేందుకు నిర్ణయించింది. సుప్రీం కోర్టు కూడా ఇటీవల సాధారణ జనజీవితాలకు అందరాకుండా పోతున్న వాక్సీన్ కొరతను, ఆక్సిజన్ కొరతను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కేంద్రానికి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

“అంతటా నిరాశానిస్పృహలే కనిపిస్తున్నాయి” అంటూ కాలిఫోర్నియా యూనివర్సిటీ సామాజిక శాస్త్రవేత్త ఆరతీ సేథీ వాక్యం దేశంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతుంది. ఈ పరిస్థితులలో ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థలు తమ సిబ్బందికి భద్రతను ఇవ్వడంతో పాటు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కొన్ని సూచనలు

  • యాజమాన్యాలు కరోనా బాధిత కుటుంబాలకు అవసరమైన మందులు, పడకలు, వాక్సీన్లు, నిత్యావసరాలను అందజేసే బాధ్యతను స్వీకరించాలి. అంతేకాదు. కరోనా బాధితుల ఐసొలిషన్ కోసం ప్రత్యేకంగా కొన్ని సహాయ శిబిరాలను నిర్వహించడం చాలా మంచిది. ఆ రకంగా చేస్తే కార్మికులకు, యాజమాన్యాలకు మధ్య మెరుగైన అనుబంధాలు ఏర్పడతాయి. షిఫ్టుల వారీగా ఉత్పత్తి కార్యకలాపాలను విభజించడంతో పాటు ఆయా విధులకు హాజరయ్యే కార్మికులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలలో తీసుకురావడం / తిరిగి ఇళ్లకు చేర్చడం వల్ల వారికి ప్రజా రవాణా సాధనాలలో ప్రయాణించడం ద్వారా కలిగే ముప్పు నుంచి రక్షణ ఇవ్వవచ్చు.
  • ఇక వ్యాపార కార్యక్రమాలలోని సంస్థలు లాభాల ఆలోచన కొంచం పక్కన పెట్టి సేవాధర్మంంతో వినియోగదారులకు చేరవేయడానికి ముందుకు రావాలి. కొంత మంది సేవాభావంతో ఉన్న వారు వివిధ రకాలుగా బాధితులకు చేయూతనిస్తున్నారు. అలాంటి వారికి వీరి తోడ్పాటు ఉంటే అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కలుగుతుంది.
  • ప్రాణరక్షణకు అత్యవసరమైన మందులు, ఆక్సిజన్ సిలిండర్లను కూడా తప్పుదారి పట్టిస్తున్న ఉద్యోగుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఆసుపత్రులు ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రులు తమ దగ్గర ఉన్న పడకల ఖాళీలను ప్రతిరోజు టీవీలు, పత్రికల ద్వారా లేదా వారి వారి వెబ్ సైట్ లలో ప్రముఖంగా తెలియజేయడం చాలా మంచింది. వైద్యం దుర్భరం కాకుండా చూడాలి. ఇక్కడ ఎక్కువ లేదా అడిగినంత ఇవ్వగలిగిన వారి కాకుండా అవసరమైన వారికే ప్రాధాన్యం ఇవ్వడం చాలా ముఖ్యం.

కరోనా చికిత్సకు కార్పొరేట్‌ సాయం

Also Read: కరోనా భీభత్సం!! రక్షణ వ్యవస్థ లేక జనజీవితాలు అల్లకల్లోలం

Telangana Corona Emergency Contact Information:

For Free Ambulance (Cyberabad)
9490617400
9490617431
For Free cab Services (Rachakonda)
9490617234

Check Telangana COVID-19 Updates: https://covid19.telangana.gov.in

Previous Post
Reliance Jio topped the 4G speed chart, Info shared by TRAI
Next Post
Australian Prime Minister Scott Morrison lifted ban on flights from India
Reliance Jio topped the 4G speed chart, Info shared by TRAI
Australian Prime Minister Scott Morrison lifted ban on flights from India

Recent Posts

Menu