Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Jam Alert

Hyderabad Traffic Jam Alert: రానున్న రెండు రోజులు హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad Traffic Jam Alert వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఆదివారం అనగా సెప్టెంబర్ 19న ఉదయం 6 గంటల నుండి సోమవారం (సెప్టెంబర్ 20) ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

శనివారం అర్ధరాత్రి నుండే సిటీలో ర్టీసీ బస్సులను పలుచోట్ల దారి మళ్లింపు చేస్తున్నారు మరియు అంతరాష్ట్ర జిల్లాల లారీలను అధికారులు నిషేధించారు.

వాహనాల దారి మళ్లింపు ఆంక్షల గురించి తెలుసుకోవాలనుకునే వారు 040-278552482, 9490598985, 9010303626 నంబర్లకు ఫోన్ చేయగలరని పోలీస్ అధికారులు సూచించారు. గూగుల్ మ్యాప్స్ లో ఎప్పటికి అపుడు ట్రాఫిక్ రద్దీని అప్డేట్ చేస్తామని తెలియజేసారు. రైల్వే స్టేషన్, విమానాశ్రయం వెళ్లే ప్రయాణికులు గణేష్ నిమజ్జన యాత్ర దారి నుండి కాకుండా వేరే దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్లు తెలిపారు.

బాలాపూర్ నుండి వచ్చే గణేష్ శోభాయాత్ర మరియు ఫలకనుమా నుండి వచ్చే గణేష్ శోభాయాత్ర చార్మినార్, అఫ్జల్ గంజ్, గౌలిగూడ, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ కు తరలించనున్నారు.
బేగంబజార్, ఉస్మాన్ గంజ్, అఫ్జల్ గంజ్, గౌలిగూడ మీదుగా శోభాయాత్రకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసారు.
ఉప్పల్ నుండి వచ్చే గణేషులను రామాంతపూర్, అంబర్పేట, శివమ్ రోడ్, ఫీవర్ ఆసుపత్రి, నారాయణగూడ, లిబర్టీ మీదుగా రావాలి.
సికింద్రాబాద్ నుండి వచ్చే గణేషులను ఆర్పి రోడ్, కర్బలా మైదానం, కవాడిగూడ, ముషీరాబాద్, హిమాయత్ నగర్, లిబర్టీ మీదుగా ట్యాంక్ బండ్ లేదా ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాలను మళ్లించాలి అని ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఆదేశించారు.

 

ఈ క్రిందివి కూడా చదవండి:

Police Close Tank Bund Traffic: ఆదివారం పోలీసులు ట్రాఫిక్ కోసం ట్యాంక్ బండ్‌ను మూసివేయనున్నారు | Police will close the tank bund for traffic on Sunday

Frustrated with Traffic Challans: బైక్ దగ్ధం .. వికారాబాద్ జిల్లాలో సంచలన సంఘటన | Bike Burned .. Sensational incident in Vikarabad district

Previous Post
Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
Next Post
IPL 2021 Schedule : Mumbai Vs Chennai : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై
Junior Panchayathi Raj Posts : జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
IPL 2021 Schedule : Mumbai Vs Chennai : ఢీ అంటే ఢీ అంటున్న ముంబై చెన్నై

Recent Posts

Menu