Hyderabad Mumbai Bullet Train – హైదరాబాద్ మరియు ముంబై నగరాల మధ్య బుల్లెట్‌ రైలు – iRAYSMEDIA

Breaking News, Hyderabad news
Hyderabad Mumbai Bullet Train

Hyderabad Mumbai Bullet Train, iRAYSMEDIA

Hyderabad Mumbai Bullet Train:హైదరాబాద్‌/వికారాబాద్‌, సెప్టెంబర్‌ 27: మహా నగరం హైదరాబాద్ కి మరో ముత్యాలహారం జాతకానుంది . దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన విలాసవంతమైన భాగ్యనగరానికి దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నుంచి శరవేగంగా రాకపోకలు సాగించే సమయం త్వరలో రానున్నది

హైదరాబాద్ మరియు ముంబై రెండు నగరాల మధ్య బుల్లెట్‌ రైలు ప్రారంభించేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) ప్రతిపాదించింది. ఈ వచ్చే నవంబర్‌ 5న ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయిన అచల్‌ ఖేర్‌ తెలిపారు. నవంబర్ 18న టెండర్లు తెరిచే అవకాశం ఉన్నదని అచల్‌ ఖేర్‌ పేర్కొన్నారు.. ఈ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబైకి రైలులో కేవలం మూడున్న గంటల్లో చేరుకోవచ్చు. దాంతో 9.5 గంటల సమయం ఆదా అవుతుంది అని అచల్‌ ఖేర్‌ తెలిపారు

ప్రస్తుతం హైదరాబాద్ మరియు ముంబై రెండు నగరాల మధ్య నడుస్తున్న అత్యంత వేగవంతమైన రైలు హుస్సేన్‌సాగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో వెళ్లినా 14 గంటల సమయం పడుతున్నది. ముంబై-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ను దాదాపు రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యం నిర్మించనున్నారు.

ముంబై-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టును ముందుగా తెలంగాణలోని జహీరాబాద్‌ను లింక్‌ చేస్తూ నిర్మించాలని అనుకున్నారు. కానీ ఇది దూరం వల్ల , ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించేందుకు వికారాబాద్‌ మీదుగా నిర్మించేందుకు సర్వే చేస్తున్నారు అధికారులు . ముంబై నుండి పుణె మరియు జహీరాబాద్‌ మీదుగా నిర్మిస్తే హైదరాబాద్‌ వరకు 780 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తాజాగా ముంబై-పుణె-గుల్బర్గా-తాండూరు-వికారాబాద్‌ మీదుగా ఈ బులెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మిస్తే హైదరాబాద్‌కు అలైన్‌మెంట్‌ మార్చనుండటంతో 649.76 కిలోమీటర్లకు తగ్గుతుంది.
NHSRCL ఆధ్వర్యంలో బుల్లెట్‌ రైల్వే లైన్‌ సర్వే పనులు చేపట్టారు అధికారులు . వికారాబాద్‌ జిల్లాపరిధిలో ప్రభుత్వ తరుపున సహాయ, సహకారాలు అందించాలని ఈ సంస్థ ప్రతినిధులు ఇటీవల జిల్లా అధికారులను కోరారు.

ముంబైలో భారీ రైల్వే టెర్మినల్‌ ప్రాజెక్ట్ నిర్మాణానికి స్థలం లేకపోవడం వల్ల నవీముంబైలో నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. ముంబై విమానాశ్రయ స్థలంలో భూగర్భంలో రైల్వే టెర్మినల్‌ నిర్మించాలని ఆలోచిస్తున్నామని NHSRCL అధికారులు తెలిపారు. . ఈ ప్రాజెక్టుకోసం కొత్తగా రైల్వే ట్రాక్‌ నిర్మించనున్నారు.

కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 బుల్లెట్‌ రైలు కారిడార్లను ప్రతిపాదించింది. వీటిలో నాలుగింటికి ముంబైతో లింకు ఉన్నది. ముంబై-అహ్మదాబాద్‌ కారిడార్‌ను 2028లోపు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

READ MORE:

Send Money Without Internet:ఇంటర్నెట్ లేకుండా యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా ..

IPL 2021 CSK VS KKR : కాలికి రక్తం కారుతున్న క్యాచ్ వదలని డుప్లెసిస్

Previous Post
Revanth Reddy Meets Anjan Kumar:మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి
Next Post
Pawan Kalyan Twitter Tweets-పవన్ కల్యాణ్‌ vs ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్‌ వార్ – iraysmedia
Revanth Reddy Meets Anjan Kumar:మాజీ MP అంజన్ కుమార్ యాదవ్ ని పరామర్శించిన రేవంత్ రెడ్డి
Pawan Kalyan Twitter Tweets-పవన్ కల్యాణ్‌ vs ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విటర్‌ వార్ – iraysmedia

Recent Posts

Menu