Hyderabad Vinayaka Nimarajanam:వినాయక నిమర్జనానికి అనుమతి ఇవ్వని అధికారులు | Hyderabad News

hyderabad ganesh nimarjanam

hyderabad Ganesh Nimarjanam  వినాయక నిమర్జనాని కి అనుమతి ఇవ్వని అధికారులు

హై కోర్ట్ ఇచ్చిన నిర్ణయం, తెలియక అయోమయం 

హైదరాబాద్ నలుమూలల నుండి చేరుకున్న విగ్రహాలు.
తెచ్చిన విగ్రహాలని వదిలివెళ్తున్న భక్తులు 
పోలీసులు భక్తుల మధ్య వాగ్వాదం
పలు చోట్ల ట్రాఫిక్ జాములు
నేడు 5 వ రోజు కావడం వల్ల పెరుగుతున్న వినాయక నిమర్జన ఇబ్బందులు

iRAYSMEDIA, HYDERABAD NEWS,TANK BUND

పిఓపి విగ్రహాల నిమర్జనం ట్యాంక్ బండ్ లో చేయకూడదంటూ అధికారుల నిబంధనలు …..ఎలాగైనా నిమర్జనం చేయాలనీ భక్తుల ఆరాటం
పోలిసులకి కనిపించుకుండ దొడ్డి దారిలో నిమర్జనం చేస్తున్న వైనం .

HYDERABAD GANESH NIMARJANAM : గణేష్ నిమర్జనం దృష్ట్యా ప్రభుత్వం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం నుండి స్పష్టమైన సూచనలు లేకపోవడం దీనికి కారణం …. హైకోర్ట్’ ఇచ్చిన ఆదేశాలు ప్రజలకు తెలియకపోవడం తో నగరం లో పలు చోట్ల తీవ్ర గందరగోళ పరిస్ధిస్థులు నెలకొన్నాయి. …. ఈ సంవత్సరం చెరువుల్లో పిఓపి ఇతర రసాయన మరియు రంగులు వాడి తయారుచేసిన విగ్రహాలను చెరువుల్లో నిమర్జనం చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం తెలియని ప్రజలు చెరువు దగ్గరికి తీసుకచ్చిన పిఓపి విగ్రహాలను పోలీసులు నిమర్జనం చేయనీయట్లేదు …… తీసుకొచ్చిన విగ్రహాలని ఇటు నిమర్జనం చేయలేక అటు వెంట తీసుకుపోలేక అయోమయం లో పడుతున్న భక్తులు.

పోలీసులకు తల నొప్పిగా మారిన హైకోర్టు ఆదేశాలు..

ట్యాంక్ బండ్ ప్రాంతాల్లోని చెరువులకు భక్తులు బ్యాండ్ మేళాలతో వచ్చి హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలు తెలియక విగ్రహాలను అక్కడే వదిలేసి వెళ్తున్నారు… ఈ వ్యవహారం అంత పోలీసులకి తల నొప్పిగా మారింది. కొన్ని చెరువుల వద్ద ఎలాంటి ఇబ్బంది లేకపోవడం వల్ల భక్తులు నిమర్జనం చేసి వెళ్తున్నారు.

హైకోర్టు సోమవారం :

ఎలాగైనా సోమవారం హైకోర్టు నుండి సానుకూల స్పందన వస్తుందని ఆశించిన అధికారులు. కానీ హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనడం తో అధికారులు బెంబేలెత్తి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ద్రుష్టి సారించారు … కోర్ట్ అనుమతించిన బేబీ పాండ్స్ నిర్మిచారు.

బేబీ పాండ్స్:

26 అడుగుల పొడువు 24 అడుగుల వెడల్పు 12 నుండి’15 అడుగులతో ఈ బేబీ పాండ్స్ ని GHMC వారు నిర్మించిన కొన్నింటిని పవర్ బోర్లతో, కొన్నింటిని వాటర్ ట్యాంకర్లు తో నీరు నింపనున్నారు … అయితే ఈ బేబీ పాండ్స్ లో అన్ని విగ్రహాలను నిమర్జనం చేయాలంటే ఎక్కువ రోజులు పడుతుందని దీనితో విగ్రహం తడిచేలా ముంచి వెంటనే తీసేలా చర్యలు తీసుకోనున్నారు .
పెద్ద విగ్రహాలను కూడా ఇందులో నిమర్జనం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెల్సింది.

ఇవి కూడా చదవండి:

khairathabad ganesh:ఖైరతాబాద్ గణేష్ కి తొలిసారి తలపాగా ఎవరిచ్చారో తెలుసా | Hyderabad News

Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి వేడుకలు GHMC సన్నద్ధమైంది | GHMC prepares for Ganesh Chaturthi celebrations

Previous Post
హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.
Next Post
Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ సైదాబాద్ 6 Years Old Girl Rape ఘటనలో స్నేహితుడి సహాయంతో నిందితుడు పరారు.
Dalitha Bandhu Scheme : 14,400 మంది లబ్దిదారుల ఖాతాలో 10 లక్షలు జమ చేసిన ప్రభుత్వం

Recent Posts

Menu