Hyderabad Breaking News Today:మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్

HYDERABAD BREAKING NEWS TODAY

hyderabad breaking news today IRAYSMEDIA

రేవంత్ రెడ్డిని విమర్శించే ముందు నీ స్థాయి ఎందో తెలుసుకో.
ఎంపీ,ఎమ్మెల్యే,మంత్రి పదవులు ఏలా తెచ్చుకున్నావో అందరికీ తెలుసులే.

మంత్రి మల్లారెడ్డిపై మండిపడ్డ వజ్రేష్ యాదవ్

hyderabad breaking news today:రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలు చూసి మతిభ్రమించి పిచ్చిప్రేలపణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిపై అనవసరంగా వాక్యాలు చేసి అధినేత దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారని ఇది సరైన విధానం కాదని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ తోటకూర వజ్రేష్ యాదవ్ మండిపడ్డారు.

సోమవారం నాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం నాడు జరిగిన టీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి తన స్థాయిని మించి టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పిచ్చి ప్రేలపణలు చేశారని అన్నారు. మంత్రి మల్లారెడ్డి చేసినట్లుగా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎవరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చిండో నిరుపించాలని లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ సభలు సమావేశాలకు వస్తున్న జనాలను చూసి టీఆర్ఎస్ పార్టీ నేతలకు మతి భ్రమించి పోతుందని అందుకే అవాకులు,చెవాకులు పేలుతున్నారని వాపోయారు.మంత్రి మల్లారెడ్డి మాటలు చూస్తుంటే గురిగింజ సామెత గుర్తుకు వస్తుందని గురిగింజ తన కింద నలుపు చూసుకోనాట్లుగా ఉందని తమరు టీడీపీ పార్టీలో ఎంపీ పదవీ, టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే,మంత్రి పదవులు ఏలా సంపాదించుకున్నారో నీ పార్టీ నేతలను అడిగితే తెలుస్తుందని అన్నారు.నీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను సరిదిద్దడం మానుకొని కాంగ్రెస్ పార్టీపై,నేతలపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో ప్రజలకు అర్దం అవుతుందని వాక్యానించారు.

రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి ప్రజా క్షేత్రంలో మాట్లాడే ముందు హుందాగా వ్యవహరించాలని లేని పక్షంలో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. తాము విమర్శలు చేయాలంటే మాకు మా నాయకుడు నేర్పిన సంస్కారం అడ్డోస్తుందని అందుకే హుందాగా మాట్లాడుతున్నామని అన్నారు. ఇప్పటికైన నోటి దూల తగ్గించడం మంచిదని సూచించారు.

READ MORE:

Talasani Srinivas Yadav: తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య మరియు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుందని చెప్పారు | Talasani Srinivas Yadav said that the Telangana government has taken several steps for the development of the film industry, Animal Husbandry, Fisheries and Dairy

Why Revanth Reddy met Konda Vishweshwar Reddy: రేవంత్ రెడ్డి కొండ విశ్వేశ్వర్ రెడ్డిని ఎందుకు కలిశారు? | Why Revanth Reddy met Konda Vishweshwar Reddy?

Previous Post
KCR Temple For Sale: అమ్మకానికి KCR గుడి | TRS News
Next Post
Artificial Kidney For Dialysis || మూత్రపిండాల మార్పిడికి మరోకొత్త యంత్రం
KCR Temple For Sale: అమ్మకానికి KCR గుడి | TRS News
Artificial Kidney For Dialysis || మూత్రపిండాల మార్పిడికి మరోకొత్త యంత్రం

Recent Posts

Menu