Hyderabad 6years girl rapecase : మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు

Uncategorized

Hyderabad 6years girl rapecase : iRAYSMEDIA || HYDERABAD NEWS

Hyderabad 6years girl rapecase  సైదాబాద్ కాలనీలో చిన్నారి చైత్ర పై అత్యాచారం చేసి, హత్య చేయడం దారుణమని, అత్యంత దురదృష్టమనీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజూ డీజీపీ సీపీలతో మాట్లాడుతున్నానని చెప్పారు. పది పోలీస్ బృందాలు నిందితుడి కోసం గాలిస్తున్నాయని, కచ్చితంగా దోషులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో నూతన మహబూబాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయం నిర్మాణం, పనులు మెడికల్ కాలేజ్ కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు.

మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి వ్యాఖ్యలు….. 

మహబూబాబాద్ మెడికల్ కాలేజీ కార్యరూపం దాల్చడంలో నేను భాగస్వామ్యం కావడం సంతోషం. అధికారులు అంతా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

hyderabad 6years girl rapecase

నిర్మాణ పనులు త్వరగా కావాలని ఆర్ అండ్ బి కి అప్పగించాము. రూ.30 కోట్లతో నర్సింగ్ కాలేజీకి టెండర్ పూర్తి అయ్యింది. నర్సింగ్ కాలేజీ పూర్తి చేశాక అందులో ముందు మెడికల్ కాలేజీ నడిపిస్తాం. ఏరియా హాస్పిటల్ లో 300 పడకల ఏర్పాటు చేశాం. అన్ని సర్విసులు అక్కడ స్టార్ట్ చేస్తున్నాం.

సీఎం కేసిఆర్ గారి చేతుల మీదుగా మెడికల్ కాలేజీ శంకుస్థాపన, నర్సింగ్ కాలేజీ, కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేయడానికి పనులు వేగవంతం చేస్తున్నాం. సమీకృత కలెక్టర్ కార్యాలయం వల్ల ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడం సులువుగా అందుతాయి. 33 ప్రభుత్వ కార్యాలయాలు ఒకే దగ్గర ఉంటాయి.  జిల్లా అభివృద్ధిలో మీడియా సహకారం కావాలి. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి.

చిన్నారి చైత్రను అత్యాచారం చేసి హత్య చేయడం దారుణం. అత్యంత దురదృష్టకరం. అయితే ఘటన జరిగిన వెంటనే చర్యలు వేగవంతం చేశాం. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం, దోషులను శిక్షించే పనిలో ఉన్నాం. ఘటన జరిగిన రోజు నుంచి ప్రతి రోజు డీజీపీ, సీపీతో మాట్లాడుతున్నాం. పది పోలీస్ టీమ్స్ దీని మీద పని చేస్తున్నాయి.

hyderabad 6years girl rapecase

నిందితుని కుటుంబ సభ్యులు పోలీసుల కంట్రోల్ లో ఉన్నారు. దోషులను పట్టుకుంటాం.. కఠినంగా శిక్షిస్తాము.

మహబూబాబాద్ లో 3000 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి ఉండేది. కొంత ప్రభుత్వ భూమిని పేదలకు అసైన్డ్ చేశాం. భూములలో ఉన్న వారికి న్యాయం చేస్తాం. రికార్డులు లేని వారికే ఇబ్బంది అవుతుంది. అయినా ఎవరికీ నష్టం జరగకుండా చూస్తాం. మహబూబాబాద్ అత్యధిక గిరిజనులు ఉన్న జిల్లా ఇది. ఇక్కడ సీఎం కేసిఆర్ గారు మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ రావడంతో సూపర్ స్పెషాలిటీ వైద్యం రానుంది. ఈ క్రమంలో ఎవరికీ ఇబ్బంది అయినా వారికి నష్టం లేకుండా చూస్తాం.

hyderabad 6years girl rapecase

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జెడ్పి చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, ఆర్ అండ్ బి పి ఎం సి గణపతి రెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ, , జిల్లా కలెక్టర్ శంకర్ ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి ఏ ఎస్ పి గౌతమ్ కలెక్టర్ కొమురయ్య, ఎస్. ఈ నాగేందర్ జిల్లా ఇతర అధికారులు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నేతలు నూకల శ్రీ రంగా రెడ్డి, శ్రీధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి ఉన్నారు.

 

4 Year Old Girl Raped: 4 సంవత్సరాల బాలికపై అత్యాచారం, హత్య | 4 year old girl raped, murdered by man

Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.

Previous Post
Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.
Next Post
Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy
Hyderabad 6 Years Girl Rape Case: డీజీపీ చెంతకు చేరిన సైదాబాద్ 6 ఏళ్ల బాలిక అత్యాచార కేసు.
Tollywood Drugs Case : డ్రగ్స్ కేసులో చాల మందిని తపించారన్నా Revanthreddy

Recent Posts

Menu